BJP NRI Cell Gulf: జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయడానికి నరేంద్ర పన్నీరు దరఖాస్తు
ABN, First Publish Date - 2023-09-10T13:34:44+05:30
తెలంగాణ బీజేపీ ఎన్నారై సెల్ గల్ఫ్, మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు ఆదివారం (10వ తేదీన) ఉదయం 10.10 గంటలకు జగిత్యాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయడానికి అవకాశం ఇవ్వాలని హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎన్నారై సెల్ గల్ఫ్, మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు ఆదివారం (10వ తేదీన) ఉదయం 10.10 గంటలకు జగిత్యాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయడానికి అవకాశం ఇవ్వాలని హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఆయన వెంట గల్ఫ్ జేఏసీ నాయకులు కూడా ఉన్నారు. జగిత్యాల స్థానికుడు, బాల్యం నుండి ఆర్ఎస్ఎస్ (RSS) స్వయం సేవకుడు, విద్యార్థి పరిషత్‌లో పనిచేసిన విద్యార్థి నాయకుడు, తెలంగాణ బీజేపీ ఎన్నారై సెల్ గల్ఫ్, మిడిల్ ఈస్ట్ కన్వీనర్. భారతీయ జనతా పార్టీని గల్ఫ్ దేశాలలో ఉన్న తెలంగాణ కార్మికులను కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ అభివృద్ధిలో భాగమై అంకిత భావంతో పని చేస్తున్నారు. గత ముప్పై ఏళ్ల నుండి పార్టీలో ఉంటూ పార్టీకే జీవితం అంకితం చేశారు. జగిత్యాల ముద్దు బిడ్డ నరేంద్ర పన్నీరుకు గల్ఫ్ పక్షాన గల్ఫ్ కార్మికుల కోసం జగిత్యాల అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చి అవకాశం కలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ, గల్ఫ్ కార్మికులు వారి కుటుంబాల జీవితాలు ఆగమయ్యాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు అయిన ఇంత వరకు గల్ఫ్ కార్మికులకు చేసింది ఏమిలేదని విమర్శించారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వం మాత్రమే అని జోస్యం చెప్పారు. గల్ఫ్ కార్మికుల చిరకాల స్వప్నం ఎన్నారై సెల్, గల్ఫ్ బోర్డ్ బీజేపీతోనే సాధ్యం అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజీపీ నాయకులు వసంకాయల కార్తిక్, పిట్ల రాజు, బీర్పూర్ మండల ఓబీసీ అధ్యక్షుడు బసవరాజుల సంతోష్, మండల ఉపాధ్యక్షుడు గోస్కుల రాకేశ్, శ్రీనివాస్ రాజ్ గల్ఫ్ జేఏసీ నాయకులు, ఎన్నారై సెల్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
NRIs in UK: బ్రిటన్‌లోని ఎన్నారైలకు తీపి కబురు.. ఇకపై స్వదేశంలోని బిల్స్ నేరుగా చెల్లించవచ్చు..!
Updated Date - 2023-09-10T13:37:54+05:30 IST