ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telugu Student: ఎనిమిది నెలల క్రితం ఫిలిప్పీన్స్ వెళ్లిన తెలుగు విద్యార్థి.. అనుమానాస్పద మృతి..!

ABN, First Publish Date - 2023-04-24T10:30:45+05:30

ఫిలిప్పీన్స్‌లో ఓ తెలుగు విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఓ తెలుగు విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. దవోవ మెడికల్ స్కూల్‌లో (Davao Medical School) వైద్య విద్యను అభ్యసిస్తున్న గూడూరు మణికాంత్ రెడ్డి (Guduru Manikanth Reddy) అనుమానాస్పదంగా చనిపోయాడు. మణికాంత్ రెడ్డి మృతిపై ఫిలిప్పీన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లి గ్రామానికి చెందిన మణికాంత్ రెడ్డి ఎనిమిది నెలల క్రితం ఉన్నత చదువుల కోసం ఫిలిప్పీన్స్ వెళ్లాడు. అక్కడి దవోవ మెడికల్ స్కూల్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు.

ఆదివారం (ఏప్రిల్ 23న) తెల్లవారుజామున మణికాంత్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు దవోవ మెడికల్ స్కూల్ యాజమాన్యం ఫోన్ చేసి అతడి తల్లిదండ్రులు గూడూరు రాంరెడ్డి, రాధకు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం కళాశాలకు చెందిన హాస్టల్ డ్రైనేజీ కాలువ వద్ద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న అతడి మృతదేహాన్ని గుర్తించినట్లు వారు తెలిపారు. ఈ విషయం తెలుకున్న పేరెంట్స్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనతో మణికాంత్ రెడ్డి స్వస్థలం రామలింగంపల్లిలో విషాదం అలుముకుంది. ఫిలిప్పీన్స్ (Philippines) నుంచి కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి తల్లిదండ్రులు సహకరించాల్సిందిగా జిల్లాకు చెందిన నాయకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

UAE: పాపం.. భారత ప్రవాసుడు.. ఈ ఏడాది పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామనుకున్నాడు.. కానీ, ఊహించని విధంగా..


Updated Date - 2023-04-24T10:32:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising