ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TACA: 'తాకా' ఆధ్వర్యంలో టోరొంటోలో ఘనంగా దీపావళి వేడుకలు

ABN, First Publish Date - 2023-11-26T13:02:23+05:30

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో శనివారం ( ఈ నెల18న) దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా జరిగాయి.

TACA: తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో శనివారం ( ఈ నెల18న) దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా జరిగాయి. గ్రేటర్ టోరొంటో మిస్సిస్సౌగలోని ఫీల్డ్ గేట్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో 1600 మందికి పైగా ప్రవాస తెలుగు వాసులు ఈ సంబరాలలో పాల్గొన్నారు. సకుటుంబ సపరివార సమేతంగా దీపావళి వేడుకలలో పాల్గొని ఆనందంగా గడిపారు. మొదటగా అధ్యక్షురాలు కల్పనా మోటూరి, వాణీ సజ్జ, అనిత జయంతి, సుకృతి బాసని, శృతి ఏలూరి, విద్య భవణం గారల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిరాఘాటంగా రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగాయి. దాదాపు మూడు వందల మంది స్థానిక తెలుగు కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. కెనడాలో మొదటిసారిగా తాకా వేదికపై జరిగిన విశేషమైన సంబురం ఇది. ఈ వేడుకలలో తాకా 2023-25 నూతన కమీటీ సభ్యులుగా ఎన్నికైన వారిని వ్యవస్థాపక సభ్యులు శ్రీనాథ్ కుందూరి ప్రమాణాస్వీకారం చేయించారు.

ప్రమాణాస్వీకారం చేసిన 'తాకా' నూతన కమిటీ..

రమేశ్ మునుకుంట్ల - అధ్యక్షులు

అరుణ్ కుమార్ లయం - ఫౌండర్స్ కమిటీ చైర్మన్

సురేశ్ కూన - చైర్మన్ బోర్డు ఆఫ్ ట్రస్టీ

కల్పన మోటూరి - ఔట్గోఇంగ్ అధ్యక్షురాలు మరియు ఎక్స్ అఫిసియో మెంబర్

రాఘవ్ అల్లం - ఉపాధ్యక్షులు

ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి - జెనరల్ సెక్రెటరి

మల్లిఖార్జునాచారి పదిర - ట్రెజరర్

అనిత సజ్జ - సాంస్కృతిక కార్యదర్శి

విద్య భవణం - డైరక్టర్

ఖాజిల్ మొహమ్మద్ - డైరక్టర్

ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు - డైరక్టర్

సాయిబోథ్ కట్టా - డైరక్టర్

ఆదిత్య వర్మ - డైరక్టర్

లిఖిత యార్లగడ్డ - యూత్ డైరక్టర్

రవీంద్ర సామల - యూత్ డైరక్టర్

విద్యసాగర్ రెడ్డి సారబుడ్ల - మెంబెర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ

వాణి జయంతి - మెంబెర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ

పవన్ బాసని - మెంబెర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ

శృతి ఏలూరి - మెంబెర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ

సంస్థ ఫౌండర్లు..

హనుమంతాచారి సామంతపుడి - ఫౌండర్

మునాఫ్ అబ్దుల్ - ఫౌండర్

శ్రీనాథ్ కుందూరి - ఫౌండర్

రవి వారణాసి - ఫౌండర్

రాకేశ్ గరికపాటి - ఫౌండర్

రామచంద్ర రావు దుగ్గిన - ఫౌండర్

లోకేశ్ చిల్లకూరు - ఫౌండర్

ఈ వేదికపై 2023 గ్రాండ్ స్పాన్సర్ శ్రీ రాం జిన్నాల గారితో పాటు ఇతర స్పాన్సర్లనూ తాకా కమిటీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీఏసీఏ (TACA) ఆధ్వర్యంలో మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేసారు. ఈ పండుగ సంబురాలు ప్రస్తుత తాకా అధ్యక్షురాలు కల్పన మోటూరి ఆధ్వర్యంలో జరుగగా ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోషాధికారి మల్లిఖార్జునాచారి పదిర, డైరక్టర్లు అనిత సజ్జ, శ్రుతి ఏలూరి, ఖాజిల్, ట్రుస్టీ బోర్డు చైర్మన్ మునాఫ్, ట్రుస్టీలు సురేశ్ కూన, ప్రవీణ్ పెనుబాక, రాఘవ్ అల్లం, సంస్థ ఫౌండర్లు చారి సామంతపుడి, అరుణ్ కుమార్ లయం, శ్రీనాథ్ కుందూరి, రమేశ్ మునుకుంట్ల పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లలో రవి వారణాసి, ఫౌండర్లు రాకేశ్ గరికపాటి, లోకేశ్ చిల్లకూరు, రమచంద్ర రావు దుగ్గిన, డైరెక్టర్లు గణేశ్ తెరాల, ప్రదీప్ రెడ్డి, కుమారి విద్య భవనం ఎంతో సహకరించారు. చివరిగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించిన, పాల్గొన్న వారందరికీ ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల ధన్యవాదాలు తెలిపారు. వేడుకలకు హాజరైనవారందరూ భారత జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించారు.

Updated Date - 2023-11-26T13:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising