ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TAL: విజయవంతంగా ముగిసిన 'తాల్' ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ

ABN, First Publish Date - 2023-08-08T08:38:09+05:30

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే “TAL ప్రీమియర్ లీగ్ (TPL)” క్రికెట్ టోర్నమెంట్‌ను ఈ సంవత్సరం కూడా విజయవంతంగా ముగిసింది.

ఎన్నారై డెస్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే “TAL ప్రీమియర్ లీగ్ (TPL)” క్రికెట్ టోర్నమెంట్‌ను ఈ సంవత్సరం కూడా విజయవంతంగా నిర్వహించింది. మెగా ఫైనల్ మ్యాచ్‌లు 6 ఆగస్టు 2023 ఆదివారం నాడు ఇంగ్లాండ్‌‌లో లాంగ్లీలోని స్లౌ క్రికెట్ క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ "డీజే వారియర్స్", "కూల్ క్రూయిజర్స్" జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా జరగగా మూడవ స్థానం కోసం "వైజాగ్ బ్లూస్" Vs "సూపర్ స్టార్స్" జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగింది.

ఛాంపియన్‌షిప్ విజేతలు, ఇతర వివరాలు:

ప్రైమ్ నార్త్ TPL 2023 ఛాంపియన్స్: కూల్ క్రూయిజర్స్, కెప్టెన్: శరత్ పుట్టా, ఫ్రాంచైజీ ఓనర్: సురేష్ మంగళగిరి

రన్నర్ అప్: డీజే వారియర్స్, కెప్టెన్: పవన్ కుమార్ చేసేటి, ఫ్రాంచైజీ ఓనర్: ధనంజయ మద్దుకూరి

3వ స్థానం: వైజాగ్ బ్లూస్, కెప్టెన్: సందీప్ మూవా, ఫ్రాంచైజీ ఓనర్: రవి బండారు

మ్యాన్ ఆఫ్ ద సిరీస్: వైజాగ్ బ్లూస్‌కు చెందిన శ్రీధర్ గిరిమాజీ

ఉత్తమ బౌలర్: వైజాగ్ బ్లూస్‌కు చెందిన శ్రీధర్ గిరిమాజీ (21 వికెట్లు)

బెస్ట్ బ్యాట్స్‌మెన్: డీజే వారియర్స్‌కు చెందిన పవన్ కుమార్ చెసేటి (274 పరుగులు)

క్రీడలు మరియు ప్రత్యేకించి క్రికెట్‌లో మహిళలను ప్రోత్సహించడానికి 'తాల్' నిర్వహించిన ప్రత్యేక తెలుగు మహిళల క్రికెట్ మ్యాచ్ ఈ సంవత్సరం ప్రత్యేకం. ఐటీ ట్రీ వారియర్స్ & గెలాక్సీ గర్ల్స్ పేరుతో రెండు మహిళా క్రికెట్ జట్లు ఆడాయి, అందులో గెలాక్సీ గర్ల్స్ మ్యాచ్ గెలిచింది. మహిళలు, పిల్లలు, వృద్ధులతో సహా 300 మందికి పైగా ప్రజలు ఈ అద్భుతమైన కార్యక్రమానికి హాజరయ్యారు. పిల్లలకు, పెద్దలకు ఆటలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. తోటి తెలుగు కుటుంబాలతో కలిసి వినోదంతో నిండిన రోజును ఆస్వాదించారు. భారతదేశం, బ్రిటన్ రెండింటి జాతీయ గీతాలతో ఈవెంట్ ప్రారంభమైంది.

'తాల్' చైర్మన్ భారతి కందుకూరి, ముఖ్య అతిథిగా హాజరైన ఇంగ్లాండ్ ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ సాజిద్ ఇక్బాల్ మహమూద్, ప్రత్యేక అతిధులు, హౌన్స్‌లో బరో మేయర్, అఫ్జల్ కియాని, స్లో బోరో డిప్యూటీ మేయర్ బల్వీందర్ ఎస్ ధిల్లాన్, కౌన్సిలర్ చంద్ర మువ్వల, కౌన్సిలర్ ఆదేశ్ స్పర్మహాన్, తాల్ స్పాన్సర్ "ఫ్రీడమ్ సర్కిల్"కు చెందిన గౌతమ్ తదితరులకు స్వాగతం పలికారు. TPL 2023కి మద్దతు ఇచ్చినందుకు స్పాన్సర్ "ప్రైమ్ నార్త్ ఓవర్సీస్" ధనంజయ (DJ)ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

'తాల్' 15 సంవత్సరాల క్రితం 2008లో లండన్‌లో TAL క్రికెట్ లీగ్‌ని ప్రారంభించిందని, 2012లో TAL ప్రీమియర్ లీగ్‌గా IPL ఫార్మాట్‌లో రూపాంతరం చెందిన విషయాన్ని గుర్తు చేశారు. యూకే (UK) అంతటా అనేక తెలుగు కుటుంబాలను కలుపుతూ యూరోప్‌లో కమ్యూనిటీ సంస్థచే నిర్వహించబడుతున్న అతిపెద్ద T20 క్రికెట్ లీగ్‌గా అవతరించిందని భారతి కందుకూరి తెలియజేసారు. TPL ను సమన్వయంతో సమయస్ఫూర్తితో విజయవంతంగా నిర్వహించినందుకు 'తాల్' ట్రస్టీ (క్రీడలు) అనితా నోములను ప్రశంసించారు. TAL మరియు TPLలకు అందించిన సహకారానికి తాల్ సలహాదారులు, తాల్ సబ్‌కమిటీతో పాటు ట్రస్టీలు, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, గిరిధర్ పుట్లూరు, అనిల్ అనంతుల & కిషోర్ కస్తూరిలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో TAL స్పోర్ట్స్ ట్రస్టీ అనిత నోముల మాట్లాడుతూ.. ఈ సంవత్సరం 10 జట్లు 14 వారాల పాటు ఆడినట్లు, 140 మంది ఆటగాళ్లు 51 మ్యాచ్‌లు పూర్తి క్రీడా నైపుణ్యంతో మరియు ఆటలలో గొప్ప నాణ్యతతో ఆడారని అన్నారు. TPL-2023 జట్టు రవి సబ్బా, వాసుదేవ మేరెడ్డి.. TPL కమిటీ: శరత్ పుట్ట, ముఖేష్ చక్రవర్తి & సత్య పెద్దిరెడ్డి.. TPL సలహా బృందం: సంజయ్ బైరాజు, శ్రీనివాస్ రెడ్డి మరియు శ్రీధర్ మేడిశెట్టి.. క్రమశిక్షణా కమిటీ: వంశీ మోహన్ సింగూలూరి, శ్రీధర్ సోమిశెట్టి మరియు శరత్ జెట్టి తదితరుల సహాకారంతో TPL-2023 ఛాంపియన్‌షిప్‌ను ఇంత ఉన్నత ప్రమాణాలతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-08-08T08:38:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising