ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US Mass Shooting: అమెరికాలో తూటాలకు బలైన తెలుగు యువతి.. సైకో కాల్పుల్లో ముఖం ఛిద్రం.. తల్లితో మాట్లాడిన 5నిమిషాలకే ఘోరం..!

ABN, First Publish Date - 2023-05-09T07:36:22+05:30

అమెరికాలోని టెక్స్‌సలో ఒక మాల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో మరణించినవారిలో.. తెలంగాణకు చెందిన తాటికొండ ఐశ్వర్య (27) అనే యువతి కూడా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలో తూటాలకు బలైన నేరేడుచర్ల యువతి ఐశ్వర్య

ఉన్నత చదువుల కోసం ఐదేళ్ల క్రితం అమెరికాకు

చదువయ్యాక అక్కడే ప్రాజెక్టు మేనేజర్‌గా జాబ్‌

స్నేహితుడితో కలిసి టెక్సస్‌ మాల్‌లో షాపింగ్‌కు

అగంతుకుడి కాల్పుల్లో ముఖం చిద్రమై దుర్మరణం

వేలిముద్రల ఆధారంగా ఐశ్వర్యను గుర్తించిన వైనం

హైదరాబాద్‌ సిటీ/ఎల్బీనగర్‌, నేరేడుచర్ల మే 8 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని టెక్స్‌సలో ఒక మాల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో మరణించినవారిలో.. తెలంగాణకు చెందిన తాటికొండ ఐశ్వర్య (27) అనే యువతి కూడా ఉంది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం ఐశ్వర్య తన స్నేహితుడితో టెక్స్‌సలోని ఓ మాల్‌కు షాపింగ్‌కు వెళ్లిందామె. 3.36 గంటల సమయంలో.. అగంతుకుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. ఏడుగురు క్షతగాత్రుల్లో ఐశ్వర్య స్నేహితుడు కూడా ఉన్నాడు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాగా.. ఐశ్వర్య స్వగ్రామం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపాలిటీ పరిధిలోని పాతనేరేడుచర్ల. రంగారెడ్డి జిల్లా కమర్షియల్‌ కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తాటికొండ నర్సిరెడ్డి, అరుణ దంపతుల కుమార్తె ఆమె. ఆ దంపతులకు శ్రీకాంత్‌రెడ్డి అనే కుమారుడు కూడా ఉన్నాడు. నర్సిరెడ్డి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని హుడాకాలనీలో నివాసం ఉంటోంది. హైదరాబాద్‌లోని మాతృశ్రీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఐశ్వర్య.. ఉన్నత చదువుల కోసం 2018లో అమెరికా వెళ్లింది. ఈస్టర్న్‌ మిషిగన్‌ యూనివర్సిటీలోని గ్రాండ్‌ స్కూల్‌లో కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో ఎమ్మెస్‌ పూర్తి చేసి, టెక్సస్‌ సమీపంలోని పర్‌ఫెక్ట్‌ జనరల్‌ కాంట్రాక్టర్స్‌ కంపెనీలో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. కిందటి సంవత్సరం డిసెంబరులో తన అన్న శ్రీకాంత్‌రెడ్డి పెళ్లికి చివరిసారిగా భారత్‌కు వచ్చిందామె. శనివారం మధ్యాహ్నం మాల్‌కు వెళ్లే ముందు ఐశ్వర్య తన తల్లికి ఫోన్‌ చేసి మాట్లాడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తర్వాత 5 నిమిషాలకే ఆమె తుపాకీ తూటాలకు బలైంది.

వేలిముద్రల ఆధారంగా గుర్తింపు

అగంతుకుడి కాల్పుల్లో ఐశ్వర్య ముఖం ఛిద్రం కావడంతో పోలీసులు వేలిముద్రల ఆధారంగా ఆమెను గుర్తించారు. ఆ తర్వాత కంపెనీ సిబ్బంది హైదరాబాద్‌లో ఉంటున్న ఐశ్వర్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమార్తె మరణవార్త విన్నప్పటి నుంచి ఐశ్వర్య తల్లిదండ్రులు నర్సిరెడ్డి, అరుణ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అటు నేరేడుచర్లలోనూ ఈ వార్తతో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె తాత రాంనర్సింహారెడ్డి.. ఐశ్వర్య మృతి విషయం తెలిసి భోరున విలపిస్తున్నారు. ఐశ్వర్య మృతదేహాన్ని ఇక్కడికి రప్పించేందుకు కుటుంబ సభ్యులు అక్కడి తెలుగు ప్రవాస సంఘాలు, ప్రభుత్వ అధికారుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. రెండు రోజుల్లో ఐశ్వర్య మృతదేహం నగరానికి చేరుకోవచ్చని సమాచారం. కాగా.. అమెరికాలో తుపాకీ కాల్పుల్లో ఐశ్వర్య మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఈ ఘటనను విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అమెరికా తెలుగు అసోసియేషన్‌ సభ్యులతో కూడా సంప్రదింపులు జరిపారు. ఐశ్వర్య మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌తో పాటు పలువురు అధికారులు అమెరికాలోని భారత కాన్సులెట్‌ అధికారులతో మాట్లాడుతున్నారు. ఇక.. ఐశ్వర్య మృతి పట్ల నల్లగొండ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇక.. ఆమె మరణవార్త తెలియగానే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డి, ఇన్‌కంటాక్స్‌ కమిషనర్‌ జీవన్‌లాల్‌, రంగారెడ్డి జిల్లా కోర్టులకు చెందిన పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు న్యాయమూర్తి నర్సిరెడ్డి ఇంటికి చేరుకుని ఆ దంపతులను పరామర్శించారు.

జాత్యహంకారంతోనే!

ఇంత దారుణానికి పాల్పడిన ఆ వ్యక్తిని.. మౌరిసియో గార్సియా (33) అనే అతివాదిగా (ఫార్‌ రైట్‌ వింగ్‌), నియోనాజీ సానుభూతిపరుడుగా పోలీసులు గుర్తించారు. అతడి దుస్తులపై ‘ఆర్‌డబ్ల్యూడీఎస్‌’ అనే స్టికర్‌ ఉందని వెల్లడించారు. ఆర్‌డబ్ల్యూడీఎస్‌ అంటే.. రైట్‌ వింగ్‌ డెత్‌ స్క్వాడ్‌ అని అర్థం. తన ఫేస్‌బుక్‌ ఖాతాలో అతడు శ్వేతజాతి దురహంకార పోస్టులు పెట్టేవాడని సమాచారం. అమెరికా సైన్యంలో పనిచేసిన గార్సియాను మానసిక ఆరోగ్యం బాగోలేదని విధుల నుంచి తొలగించారు. తర్వాత నుంచీ అతడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2023-05-09T07:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising