ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

The Marble Palace: దుబాయిలో అమ్మకానికి రూ.1,600కోట్ల భవంతి.. కొనుగోలు చేసే యోచనలో భారతీయుడు!

ABN, First Publish Date - 2023-06-17T09:55:38+05:30

దుబాయ్ అంటేనే అందమైన కట్టడాలకు పెట్టింది పేరు. ఇంద్రభవనాలను తలపించే ఎన్నో అద్భుత కట్టడాలు ఈ నగరంలో దర్శనిమిస్తుంటాయి. అలాంటి ఓ మహా అద్భుతమైన భవనం ఇప్పుడు దుబాయిలో అమ్మకానికి వచ్చింది. అదే 'మార్బుల్‌ ప్యాలెస్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

The Marble Palace: దుబాయ్ (Dubai) అంటేనే అందమైన కట్టడాలకు పెట్టింది పేరు. ఇంద్రభవనాలను తలపించే ఎన్నో అద్భుత కట్టడాలు ఈ నగరంలో దర్శనిమిస్తుంటాయి. అలాంటి ఓ మహా అద్భుతమైన భవనం ఇప్పుడు దుబాయిలో అమ్మకానికి వచ్చింది. అదే 'మార్బుల్‌ ప్యాలెస్ (Marble Palace). కాగా, ఈ మాన్షన్‌ను (Mansion) అతి ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ స్టోన్‌తో నిర్మించడం వల్లే దానికి ఈ పేరు వచ్చిందట. అయితే, దీని ఖరీదు కొంచెం కంగారు పెట్టిస్తుంది. మార్కెట్‌లో ప్రస్తుతం దీని ధర 750 మిలియన్ దిర్హమ్స్. అంటే మన కరెన్సీలో అక్షరాల రూ.1,600 కోట్లు అన్నమాట. కాస్ట్ కొంచెం ఎక్కువైన కూడా భవంతిని చూస్తే మాత్రం ఇట్టే మనసును దొచేస్తుందట. దాంతో అమ్మకానికి ఉందని తెలియడంతో కొంతమంది మిలియనీర్లు కొనుగోలు కోసం ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. ఇక ఈ ఇంద్రభవనంపై మోజుపడుతున్నవారిలో ఓ భారతీయుడు కూడా ఉండడం విశేషం. లక్షాబిటాట్ సోత్ బేస్ ఇంటర్నేషనల్ రియాల్టీ (Luxhabitat Sotheby’s International Realty) వారు విక్రయానికి ఉంచిన ఈ భవంతి నిర్మాణానికే సుమారు పన్నెండేళ్లు పట్టిందట. 2018లో దీని నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి.

ఈ ఇంద్ర భవంతి విశేషాల విషయానికి వస్తే.. 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో సువిశాలంగా దీన్ని నిర్మించారు. ఇంట్లో మొత్తం ఐదు బెడ్‌రూమ్‌లు ఉంటాయి. ఇందులో మాస్టర్ బెడ్‌రూమ్ ఒక్కటే 4వేల చదరపు అడుగులు ఉంటుంది. అంటే ఒక పెద్ద భవంతిని మించిన విస్తీర్ణం అన్నమాట. అలాగే 15 కార్ల గ్యారేజ్, ఇండోర్, అవుట్‌డోర్ స్మిమ్మింగ్ పూల్స్, 19 రెస్ట్‌రూమ్‌లు, 2 రూఫ్‌లు ఉంటాయి. ఇంకా 80వేల లీటర్ (21,000 గాలన్లు) కోరల్ రీఫ్ అక్వేరియం (Coral Reef Aquarium) స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎమర్జెన్సీ రూమ్‌లతో ఇంకా ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఈ భవనం సొంతం. ఇకపోతే ఈ భవంతిని ఎవరైనా కొనుక్కోవచ్చు లేదంటే అద్దెకు తీసుకోవచ్చని దాని బ్రోకర్ కునాల్ సింగ్ (Kunal Singh) తెలిపాడు.

Real Estate: స్వదేశంలో పెట్టుబడులకు ఎన్నారైల ఆసక్తి.. ఆ రెండు నగరాలే మనోళ్ల టార్గెట్.. సర్వేలో బయటపడిన ఆసక్తికర విషయాలు..

ఈ సందర్భంగా కునాల్ సింగ్ మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో కేవలం 5 నుండి 10 మంది కుబేరులు మాత్రమే దీనిని కొనుగోలు చేయగలరు అని అన్నాడు. ఇక భవంతిని అమ్మకానికి పెట్టిన తర్వాతి నుంచి గడిచిన మూడు వారాల్లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ ప్రాపర్టీని చూసేందుకు వచ్చారట. ఇందులో రష్యాకు చెందిన కొనుగోలు ప్రతినిధి ఒకరు. రెండో కస్టమర్ ఎమిరేట్స్ హిల్స్‌లో ఇప్పటికే మూడు ఇంద్ర భవనలాంటి రెసిడెన్సీలను కలిగిన భారతీయుడని తెలిపాడు. అయితే, ఆయన సతీమణి దీనికంటే కూడా ఇంకొంచెం మెరుగైన దాని కోసం ఎదురు చూస్తోందట. అందుకే ఆయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కునాల్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా, ఆ భారతీయ వ్యక్తి ఎవరనే విషయాన్ని కూడా సింగ్ బయటపెట్టలేదు.

Indian couple: భారతీయ జంటను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష.. సమర్థించిన దుబాయి కోర్టు


Updated Date - 2023-06-17T10:06:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising