NRIs: ఎన్నారైలకు ఓటు హక్కు తప్పనిసరి: శివాని జాగర్లమూడి
ABN, First Publish Date - 2023-08-16T08:22:41+05:30
అమెరికాలోని ఎన్నారైలకూ ఓటు హక్కు తప్పనిసరిగా ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నారై ఉమెన్ వింగ్ (NRI WOMEN WING), ఏపీ ఎన్నారై యూఎస్ఏ (AP NRI USA) తో కలిసి తన ప్రయత్నాలు మొదలుబెట్టింది.
NRIs: అమెరికాలోని ఎన్నారైలకూ ఓటు హక్కు తప్పనిసరిగా ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నారై ఉమెన్ వింగ్ (NRI WOMEN WING), ఏపీ ఎన్నారై యూఎస్ఏ (AP NRI USA) తో కలిసి తన ప్రయత్నాలు మొదలుబెట్టింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో తమ కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ప్రవాస భారతీయులు, ఎన్నారైలకు ఓటు హక్కు కోసం కాన్సులేట్‌కు రిప్రజెంటేషన్‌ను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రవాస భారతీయులందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తమ సిటీలోని ఇండియన్ కాన్సులేట్ అధికారులను కలిసి, బ్యాలట్ ఓటు/ప్రాక్సీ ఓటును కల్పించాలని మెమొరాండం సమర్పించింది. అట్లాంటా, వాషింగ్టన్ డీసీ, చికాగో, న్యూయార్క్, నగరాల్లోని ప్రవాస భారతీయులు పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అక్కడ అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అట్లాంటాలో మహిళలు శివాని జాగర్లమూడి ఆధ్వర్యంలో శ్రీవాణి సుష్మా వడ్లపూడి, గిరిజా గొల్లపూడి, భార్గవి గొల్లపూడి అరుణా నల్లపనేని తదితరులు మెమొరాండం సమర్పించారు.
వాషింగ్టన్ డీసీలో రవి కిషోర్ లామ్, దేవి సుధా మొవ్వ, మన్దీప్ లామ్, భాను మాగులూరి, చరణ్ గుడివాడ, కృష్ణ లాం, నిరంజన్ వడ్లమూడి, లీల యడ్లపల్లి, కిషోర్ కొడాలి, శివ మొవ్వ, కృష్ణ విడియాలా, అభినవ్ నార్నె, నరేష్ కుక్కపల్లి, పవన్ గద్దే, రఘు పెండ్యాలల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చికాగోలో హేమ కానూరు, రవి కాకర, శ్రీనివాస్ పెద్దమల్లు, విజయ్ కొర్రపాటి, వెంకట్ యలమంచిలి, రఘు చిలుకూరి, చిరంజీవి గల్లా, కృష్ణ మోహన్ చల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. న్యూయార్క్ లో కార్తీక్ నాదెళ్ల, విష్ణుప్రియ పాలడుగు,మధు కుమార్ నాయుడు పరిటాల, దీపక్ రెడ్డి కూరెళ్ల, లోకేష్ ఘంటా, అన్విత ఆధ్వర్యంలో మెమొరాండం సమర్పించారు.
ఎన్నారై ఉమెన్ వింగ్, ఏపీ ఎన్నారై యూఎస్ఏ వారి ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులంతా కలిసి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా బ్యాలట్ ఓటు/ప్రాక్సీ ఓటు అవకాశాన్ని కల్పించాల్సిందిగా పీఎంవోను కోరుతూ ఇండియన్ కాన్సులెట్‌కు మెమొరాండం సబ్మిట్ చేశామని శివాని జాగర్లమూడి వెల్లడించారు. ఓటు అనేది మన ప్రతి ఒక్కరి హక్కు అని, జీవనోపాధికి ఇక్కడకు వచ్చామని చెప్పారు. ఎంతో ఉన్నత సంస్కృతి, విలువలు ఉన్న భారతదేశం మా మాతృదేశం అని చెప్పుకోవడానికి గర్వపడతామని ఆమె అన్నారు. మాతృభూమిని గౌరవించి మాతృదేశ నిర్మాణంలో ఓటు హక్కు విలువ తెలిసిన మేము, మా ప్రాథమిక హక్కు కోసం ఇలా ముందుకు వచ్చామని శివాని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రవాస భారతీయుడు కోమటి జయరాంకి ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా అట్లాంటా కాన్సులేట్‌కు సహకరించిన సుధాకర్ బొబ్బకి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని నగరాలలో ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరచిన రవి కిషోర్ లాంకి శివాని జాగర్లమూడి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
Updated Date - 2023-08-16T08:22:41+05:30 IST