ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: అమెరికాలోని భారతీయ కుర్రాళ్లూ.. మీరిది విన్నారా..? ఇక్కడ నిరుద్యోగులకు ఫ్రీగా దుస్తులు ఉతికి.. ఇస్త్రీ చేసి మరీ ఇస్తారట..!

ABN, First Publish Date - 2023-04-16T16:37:59+05:30

అమెరికాలో నిరుద్యోగుల పట్ల ఓ వ్యక్తి మానవత్వాన్ని చూపిస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలో నిరుద్యోగుల పట్ల ఓ వ్యక్తి మానవత్వాన్ని చూపిస్తున్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు (Unemployed) తనవంతు సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ఇంతకీ నిరుద్యోగులకు అతడు చేస్తున్న సాయం ఏంటో తెలుసా? ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులకు.. ఆ రోజు వారు వేసుకుని వెళ్లే డ్రెస్‌ను ఉతికి, ఇస్త్రీ చేసి ఇవ్వడం. యూఎస్‌లోని ఓక్లహోమాలో (Oklahoma) ఉండే ఓ లాండ్రీ షాపు యజమాని ఇలా నిరుద్యోగులకు తనకు తోచిన సాయం చేస్తున్నాడు. ఆ షాపు పేరు ఆర్చర్ క్లీనర్స్ (Archer Cleaners). దీనికోసం తన షాపు ముందు ప్రత్యేకంగా ఓ బోర్డు కూడా ఏర్పాటు చేయించాడతడు. దానిపై ఇలా రాయించాడు.. "మీరు నిరుద్యోగులైతే, ఇంటర్వ్యూ కోసం మీకు మంచి దుస్తులు ఉండి, వాటిని శుభ్రం చేయవలసి వస్తే, మేము దానిని ఉచితంగా శుభ్రం చేస్తాము!". దీని కింద ఓ మంచి లైన్ కూడా కనిపిస్తుంది. అదే.. "కఠినమైన సమయాల్లో మీరు ఉత్తమంగా కనిపించడంలో మేము మీకు సహాయం చేస్తాము."

ఈ బోర్డు తాలూకు ఫొటోను 'గుడ్‌న్యూస్ మూవ్‌మెంట్' (Good News Movement) వారు తమ ఇన్‌స్టాగ్రాం (Instagram) పేజీలో పోస్ట్ చేశారు. దీనికి "మానవత్వం: దయ ప్రపంచం నలుమూలల విస్తరిస్తోంది. ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నందుకు ఆర్చర్ క్లీనర్స్ వారికి ధన్యవాదాలు. ఆర్చర్ క్లీనర్‌లు ఓక్లహోమాలోని పలు ప్రాంతాల్లో తమ బ్రాంచీలను కలిగి ఉన్నారు. వారి వ్యాపారానికి మద్దతు ఇద్దాం" అనే క్యాప్షన్ కూడా జోడించారు. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఆర్చర్ క్లీనర్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అమెరికాలో భారతీయులు (Indians) భారీ సంఖ్యలోనే ఉంటారనే విషయం తెలిసిందే. అగ్రరాజ్యంలో చదువులు పూర్తై ఉద్యోగాల వేటలో ఉన్న ఎన్నారై కుర్రాళ్లకు (NRI Youth) ఇది నిజంగా బంపరాఫర్ అనే చెప్పాలి.

UAE visa reforms: ఇకపై యూఏఈలోకి ఎంట్రీ చాలా ఈజీ.. అమల్లోకి కొత్తగా 11 ఎంట్రీ పర్మిట్స్..!


Updated Date - 2023-04-16T16:37:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising