Kuwait: ప్రవాసులు బీకేర్‌ఫుల్.. భారీగా పెరిగిన ట్రాఫిక్ జరిమానాలు.. ఆపై జైలు శిక్ష కూడా..!
ABN, First Publish Date - 2023-11-08T09:18:45+05:30
రోజురోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కువైత్ ట్రాఫిక్ విభాగం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చట్టాన్ని సవరించి జరిమానాలను భారీగా పెంచింది.
కువైత్ సిటీ: రోజురోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కువైత్ ట్రాఫిక్ విభాగం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చట్టాన్ని సవరించి జరిమానాలను భారీగా పెంచింది. ఈ మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ (General Traffic Department) కీలక ప్రకటన చేసింది. దీనిలో భాగంగా ఇకపై వేగ పరిమితిని మించి డ్రైవింగ్ చేస్తే మాత్రం భారీగా సమర్పించుకోవాల్సిందే. ఇలా స్పీడ్ లిమిట్‌ను క్రాస్ చేసే వాహనదారులు ఇకపై 500 కువైటీ దిర్హమ్స్ (రూ. 1.34లక్షలు) జరిమానా కట్టాల్సి ఉంటుంది. అలాగే మూడు నెలల వరకు జైలు శిక్ష కూడా ఉంటుంది. ఇక డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే 300 కేడీ (రూ.80వేలు) ఫైన్, 3నెలల జైలు ఉంటుంది. అలాగే విధుల్లో పాడయిపోయిన వాహనాలు డ్రైవ్ చేసేవారికి కూడా ఇదే జరిమానా, శిక్ష వర్తిస్తాయని ట్రాఫిక్ విభాగం తెలియజేసింది.
NRI: లేడీ ఎన్నారై సంచలన ఆరోపణలు.. తండ్రి మరణానికి ఎయిర్‌లైన్స్ కారణమంటూ..
ఇక వాహనాల అద్దాలకు ఎలాంటి రంగులు ఉండకూడదు. ఒకవేళ ఉంటే మాత్రం అలాంటి వాహనదారులకు 200 కువైటీ దినార్ల (రూ. 53,927) జరిమానా, 2నెలల జైలు శిక్ష వేస్తారు. ఎవరైనా వాహనాలు రన్నింగ్‌లో ఉన్నప్పుడు తమ పిల్లలు, పెంపుడు జంతువులను కిటికీలు లేదా ఓపెన్ టాప్ గుండా బయటికి అనుమతించడం చేస్తే వారికి 75 దినార్ల (రూ.20వేలు) జరిమానా విధించడం జరుగుతుంది. ఇక డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ముందు సీట్లలో కూర్చోబెట్టిన వారికి 100 నుంచి 200 కేడీల ఫైన్ ఉంటుంది. అలాగే ఎవరైనా ప్రైవేట్ కార్లలో పర్మిట్ లేకుండా ప్రయాణికులకు తరలిస్తే 200 నుంచి 500 దినార్ల వరకు జరిమానా ఉంటుంది. ఈ కొత్త జరిమానాలు, శిక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని ఈ సందర్భంగా జనరల్ ట్రాఫిక్ విభాగం వెల్లడించింది.
Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు 3 సులువైన మార్గాలు.. అది కూడా నాన్-రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా..
Updated Date - 2023-11-08T09:18:46+05:30 IST