ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

UK Visa: భారతీయ యువ వృత్తి నిపుణులకు బ్రిటన్ గుడ్‌న్యూస్

ABN, First Publish Date - 2023-07-26T10:18:45+05:30

భారతీయ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు బ్రిటన్ గుడ్‌న్యూస్ (Good News) చెప్పింది.

లండన్: భారతీయ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు బ్రిటన్ గుడ్‌న్యూస్ (Good News) చెప్పింది. రెండేళ్లపాటు అక్కడే ఉంటూ చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి వీలు కల్పించే యూకే-ఇండియా యువ వృత్తి నిపుణుల పథకం (Young Professionals Scheme) కింద రెండో బ్యాలట్‌ను రిషి సునాక్ ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. బ్యాలట్ జూలై 27 (గురువారం) మధ్యాహ్నం 1.30గంటలకు ముగుస్తుంది. ఈ పథకం కింద దాదాపు 3వేల మంది భారతీయ ఉన్నత విద్యావంతులు 2023 ఏడాదికి గాను యూకేలో ఎంట్రీకి వీసా పొందే వెసులుబాటు ఉంది. 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగిన భారతీయ పౌరులు (Indian Citizens) దీనికి అర్హులు. ఇక ఫిబ్రవరిలో జరిగిన మొదటి బ్యాలట్‌లోనే చాలా స్థానాలు భర్తీ కాగా, మిలిగిన స్థానాలను రెండో బ్యాలట్‌లో భర్తీ చేయనున్నారు.


బ్యాలెట్‌లో విజయవంతమైన అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి తదుపరి ఆహ్వానంలో ఇచ్చిన గడువులోగా వారి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా ఒక నెల వ్యవధిలో ఉంటుంది. అలాగే, వారు తమ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ఆరు నెలల్లోపు యూకే (UK) కి వెళ్లాలి. ఇక దరఖాస్తు రుసుము సుమారు రూ. 27వేలుగా ఉంది. అదనపు ఖర్చులు రూ. 98వేలు. అంతేగాక ఆరోగ్య సంరక్షణ సర్‌ఛార్జ్‌తో పాటు దరఖాస్తుదారు తన వ్యక్తిగత బ్యాంక్ సేవింగ్ ఖాతాలో రూ. 2.60లక్షలు కలిగి ఉన్నట్లు రుజువు కావాలి. కాగా, జకార్తాలో 2022 నవంబర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ (Indian Prime Minister Narendra Modi), బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ స్కీమ్ అమలులోకి వచ్చింది.

Kuwait: మళ్లీ తెరపైకి జనాభా అసమతుల్యత.. ప్రవాసుల కోటాపై ఎంపీల కీలక ప్రతిపాదన..!


Updated Date - 2023-07-26T10:20:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising