US Visas: భారతీయులకు పండగలాంటి వార్త.. ఈ ఏడాది మనోళ్లకు భారీగా వీసాలు..!
ABN, First Publish Date - 2023-04-23T12:32:47+05:30
వీసాల విషయంలో భారతీయులకు (Indians) అగ్రరాజ్యం అమెరికా తీపి కబురు చెప్పింది.
ఎన్నారై డెస్క్: వీసాల విషయంలో భారతీయులకు (Indians) అగ్రరాజ్యం అమెరికా తీపి కబురు చెప్పింది. భారతీయులకు వీసాలు (Visas) జారీ చేయడంలో జాప్యం జరుగుతోందని గుర్తించిన అధికారులు ఆ గడువుని తగ్గించే దిశగా చర్యలు వేగవంతం చేశారు. దీనిలో భాగంగా యునైటెడ్ స్టేట్స్ (United States) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది భారతీయులకు 10 లక్షలకు పైగా వీసాలను జారీచేసే ప్రణాళికలో ఉన్నామని ప్రకటించింది. అలాగే విద్యార్థి వీసాల (Student Visas) జారీలో ఇకపై ఎలాంటి జాప్యం జరగకుండా అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే ఇండియన్ స్టూడెంట్స్ (Indian Students) అందరికీ విద్యార్థి వీసాల ఆమోద ప్రక్రియను పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చింది. దీంతో పాటు భారతీయులు అధికంగా కోరుకునే హెచ్-1బీ (H-1B), ఎల్ వర్క్ వీసాల (Work Visa L) మంజూరుకు ప్రయారిటీ ఇస్తోందని అమెరికా విదేశాంగశాఖ సహాయ కార్యదర్శి డోనాల్డ్‌లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "భారత్, యూఎస్‌ల ఆర్థిక వ్యవస్థలకు కీలకమైన వర్క్ వీసాలకు మేం ప్రాధాన్యం ఇస్తున్నాం. వీటి జారీకి భారత్‌లోని కొన్ని కాన్సులేట్‌లలో 60రోజుల కన్నా తక్కువ సమయమే పడుతోంది" అని అన్నారు. ఇక కొన్ని నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల పునరుద్ధరణకు పిటిషన్‌దారు స్వయంగా హాజరు కావాల్సి ఉండగా, ఇలాంటి వాటిని దేశీయంగానే రెన్యువల్ చేసే ప్రక్రియను ఈ ఏడాది చివరలో ప్రయోగాత్మకంగా తిరిగి అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఐటీ ఉద్యోగులకు (IT Employees) కీలకమైన వీసాలు ఎక్కువగా జారీ చేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. భారత్ నుంచే కాకుండా డ్రాగన్ కంట్రీ చైనాకు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌ని (Software Professionals) కూడా అమెరికన్ కంపెనీలు భారీ సంఖ్యలో నియమించుకుంటున్నాయి. ఇక అగ్రరాజ్యంలో స్థానికంగా ఉన్న ప్రొఫెషనల్స్ కంటే కూడా భారత్, చైనా నుంచి వచ్చిన వారే అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వీసాలకే యూఎస్ అధిక ప్రాధాన్యతను ఇస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
H-1B Visa: అలా చేస్తే యూఎస్‌కు భారీగా భారత ఐటీ నిపుణులు వస్తారు.. భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడి సూచన
Updated Date - 2023-04-23T12:32:47+05:30 IST