Aadhaar card: ఎన్నారైలకు ఆధార్ కార్డు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ABN, First Publish Date - 2023-10-29T08:15:13+05:30
ఆధార్ కార్డు (Aadhaar card) అంటే భారత్‌లో తెలియని వ్యక్తి ఉండరు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసే ఆధార్ కార్డు అనేది మన దగ్గర ముఖ్యమైన పౌరసత్వ ధృవీకరణ పత్రం.
Aadhaar card for NRIs: ఆధార్ కార్డు (Aadhaar card) అంటే భారత్‌లో తెలియని వ్యక్తి ఉండరు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసే ఆధార్ కార్డు అనేది మన దగ్గర ముఖ్యమైన పౌరసత్వ ధృవీకరణ పత్రం. మన దేశంలో నివాసితులకు ఒక గుర్తింపుగా, అలాగే చిరునామా పత్రం వలే పనిచేస్తుంది. ఇది 12 అంకెలు కలిగిన ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇక ఎన్నారైలు కూడా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా భారతీయ పౌరులు ఎలాగైతే బయోమెట్రిక్ సమాచారం ద్వారా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారో.. అలాగే ఎన్నారైలు కూడా దరఖాస్తు చేసుకుని కార్డు పొందవచ్చు. ఈ ఆధార్ నమోదు ప్రక్రియలో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫొటోతో కూడిన బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటా తీసుకోవడం జరుగుతుంది. ఎన్నారైలతో పాటు వారి పిల్లలు కూడా ఆధార్ పొందేందుకు ఈ బయోమెట్రిక్ వివరాలనే ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఎన్నారైల ఆధార్ నమోదు ప్రక్రియ ఎలా ఉంటుంది? ఆధార్ పొందడానికి వారికి కావాల్సిన ధృవ పత్రాలు ఏంటి? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నారైలు ఆధార్ పొందడానికి కావాల్సినవి..
* భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి
* తప్పనిసరిగా భారతీయ మొబైల్ నంబర్ కలిగి ఉండాలి. ఎన్నారైల అంతర్జాతీయ మొబైల్ నంబర్‌లకు ఆధార్ కార్డ్ జారీ చేయబడదు. అందుకే భారతదేశంలో యాక్టివ్ మొబైల్ నంబర్ ఉండాలి.
* ఇమెయిల్ ఐడీ ఉండాలి
Qatar Weird Laws: 8 మంది భారతీయులకు ఉరిశిక్ష విధించిన ఖతర్‌లో.. చట్టాలు మరీ ఇంత కఠినమా..? అసలు ఏమేం చేయకూడదంటే..!
ఆధార్ నమోదు విధానం ఇలా..
చెల్లుబాటయ్యే భారతీయ పాస్‌పోర్ట్ (Indian Passport) ను కలిగి ఉన్న ఎన్నారై ఏదైనా ఆధార్ నమోదు కేంద్రం నుంచి ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం కింది స్టెప్స్ ఫాలో కావాలి..
* మొదట దగ్గరలోని ఏదైనా ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి
* ఎన్నారైగా నమోదు చేసుకోవడానికి ఆధార్ కేంద్రం నిర్వాహకుడికి తెలియజేయాలి
* ఆధార్ కేంద్రంలో అందుబాటులో ఉన్న ఎన్‌రోల్‌మెంట్ ఫారంలో వివరాలను నింపాలి
* గుర్తింపు రుజువుగా పాస్‌పోర్ట్ తీసుకెళ్లాలి
* యూఐడీఏఐ పత్రాల జాబితాను అనుసరించి మీ పాస్‌పోర్ట్ చిరునామా, పుట్టిన తేదీ రుజువుగా ఉపయోగించడాన్ని ఎంచుకోవచ్చు. లేదా దీని కోసం కొన్ని ఇతర చెల్లుబాటయ్యే పత్రాలను కూడా ఇవ్వవచ్చు
* దీని తర్వాత బయోమెట్రిక్ సమాచారం తీసుకుంటారు
* చివరగా మీ అప్లికేషన్ సమర్పించడానికి ముందు ఒకసారి స్క్రీన్‌పై అన్ని వివరాలను (ఇంగ్లీష్, స్థానిక భాషలో) సరి చూసుకోవడం బెటర్
* నమోదు ప్రక్రియ పూర్తైన తర్వాత మీ 14 అంకెల ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, తేదీ, సమయ స్టాంప్‌ను కలిగి ఉన్న నమోదు స్లిప్‌ను ఆపరేటర్ నుంచి తీసుకోవాలి
నోట్: ఎన్నారైల పిల్లలు కూడా ఆధార్ పొందవచ్చు. వీళ్లు కూడా పాస్‌పోర్ట్ పత్రాన్ని అందించడం తప్పనిసరి. అలాగే తల్లిదండ్రులు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.
India-UAE travel: యూఏఈ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. మీ లగేజీలో ఈ వస్తువులుంటే.. ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్..!
Updated Date - 2023-10-29T08:18:40+05:30 IST