ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dubai to India: దుబాయి నుంచి స్వదేశానికి వస్తున్న కూతురు.. తల్లిని ఏం గిఫ్ట్ తేవాలని అడిగితే.. ఆమె అడిగిందేంటో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-07-20T10:05:09+05:30

మనోళ్లు ఎవరైనా విదేశాల్లో ఉండి.. సెలవులపై స్వదేశానికి వస్తున్నారంటే.. మనల్ని ఏవైనా గిఫ్టులు తీసుకురావాలా? అని అడుగుతారు.

ఎన్నారై డెస్క్: మనోళ్లు ఎవరైనా విదేశాల్లో ఉండి.. సెలవులపై స్వదేశానికి వస్తున్నారంటే.. మనల్ని ఏవైనా గిఫ్టులు తీసుకురావాలా? అని అడుగుతారు. దాంతో మనం కూడా ఏదో చెప్పడం, వారు తీసుకురావడం కామన్. ఇదిగో ఇలాగే దుబాయిలో ఉండే ఓ కూతురు ఇండియాకు వస్తున్న క్రమంలో తన తల్లితో ఏదైనా గిఫ్ట్ తీసుకురావాలా? అని అడిగింది. దాంతో ఆ తల్లి అడిగిన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఏముంటది ఏదో విలువైన వస్తువు తీసుకురమ్మని చెప్పి ఉంటది అని అనుకుంటే మీరు పొరబడినట్టే. ఎందుకంటే ఆమె కూతురిని అడిగిన గిఫ్ట్.. 10కిలోల టమాటా తీసుకురమ్మని. అవును మీరు విన్నది నిజమే. దాంతో ఆ కూతురు కూడా తల్లి కోరికను మన్నించి దుబాయి నుంచి ఇండియాకు 10 కిలోల టామాటలు పట్టుకువచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోదరి ట్వీట్ చేయడంతో బయటకు వచ్చింది. దాంతో ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

'రెవ్స్' (Revs) అనే ట్విట్టర్ ఖాతాలో ఈ విషయం పోస్ట్ అయింది. "సోదరి పిల్లలకు వేసవి సెలవులు ఉండడంతో స్వదేశానికి వస్తోంది. దాంతో తల్లికి దుబాయి నుంచి ఏదైనా గిఫ్ట్ తీసుకురావాలా? అని అడిగిందామె. అప్పుడు నా తల్లి అడిగిన గిఫ్ట్.. ఓ 10కిలోల టమాటలు తీసుకురమ్మని. ప్రస్తుతం సోదరి 10కిలోల టమాటలు ప్యాక్ చేసి సూట్‌కేసులో సర్దుకుంది" అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో తన సోదరి టమాటోలను పెర్ల్‌పేట్ నిల్వ జాడిలో ప్యాక్ చేసి, వాటిని సూట్‌కేస్‌లో వేసుకుని దుబాయి నుండి ఇండియాకి ప్రయాణించిందని ఆమె వెల్లడించింది.

Henley Passport Index 2023: మెరుగైన భారత పాస్‌పోర్ట్ ర్యాంక్.. ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చంటే..

కాగా, గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా టమాటా ధరలు (Tomatoes price) మండిపోతున్నాయి. ఆకాశన్నంటుతున్న టామాటా ధరలు సామాన్యుల జేబులను గుల్ల జేస్తున్నాయి. దీంతో ఇప్పటికే చాలా మంది టమాటలు కొనడం కూడా మానేశారు. కూరలలో వాటి ప్రత్యామ్నాయాలతో సరిపెట్టుకుంటున్నారు. ఇక ఇటీవల మధ్య ప్రదేశ్‌లో టామాటా ఏకంగా దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. భార్యకు చెప్పకుండా భర్త కూరలో రెండు టమాటలు వేయడంతో ఆమె అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఈ వార్త బయటకు రావడం, పోలీసులు వెతికి ఆమెను భర్తకు అప్పగించడంతో వారి కథ సుఖాంతమైంది.

NRI: భారతీయ అమెరికన్ వైద్యుడికి యూఎస్‌లో కీలక పదవి.. ఎవరీ డా. బిమల్‌జీత్ సింగ్..?


Updated Date - 2023-07-20T10:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising