NRI: పాపం.. ఎన్నారై టెకీ.. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన యువతి.. నిలువునా ముంచేసిన వైనం..!
ABN, First Publish Date - 2023-08-01T11:51:09+05:30
ఓ ఎన్నారై టెకీ (NRI Techie) ని మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమైన ఓ యువతి నిలువునా ముంచేసింది. బ్లాక్ మెయిల్ (Blackmail) చేస్తూ.. ఒకటికాదు రెండుకాదు ఏకంగా రూ. 1.14కోట్లు కొట్టేసింది. అంతటితో ఆమె ఆగలేదు.
NRI: ఓ ఎన్నారై టెకీ (NRI Techie) ని మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమైన ఓ యువతి నిలువునా ముంచేసింది. బ్లాక్ మెయిల్ (Blackmail) చేస్తూ.. ఒకటికాదు రెండుకాదు ఏకంగా రూ. 1.14కోట్లు కొట్టేసింది. అంతటితో ఆమె ఆగలేదు. ఇంకా తనకు డబ్బులు కావాలని ఎన్నారైని వేధించింది. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. లండన్‌లోని ఓ సంస్థలో పని చేస్తున్న ఓ టెకీ ట్రైనింగ్ కోసం కర్నాటక రాజధాని బెంగళూరు వచ్చాడు. ఇక్కడే పెళ్లిచేసుకోవాలనే ఆలోచనతో ఓ మ్యాట్రీమోనీలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అలా అతడి వివరాలు మ్యాట్రిమోనీ (Matrimony) ద్వారా తెలుసుకున్న శాన్వి అరోరా అనే మహిళ అతనికి పరిచయమైంది. దాంతో కొన్ని రోజులు ఇద్దరూ ఫోన్‌లో బాగా మాట్లాడుకోవడం, చాటింగ్ చేయడం చేశారు.
ఇదే అదునుగా భావించిన కన్నింగ్ లేడీ.. జూలై 7వ తేదీన అతనికి ఆమె వీడియో కాల్ చేసి, న్యూడ్ చాటింగ్ చేసింది. ఆ సమయంలో అతని న్యూడ్ వీడియోను తన ఫోన్‌లో రికార్డు చేసుకుంది. మరుసటి రోజు ఆ వీడియోను అతనికి వాట్సాప్ (WhatsApp) చేసింది. అప్పటి నుంచి ఆ వీడియోను అడ్డుపెట్టుకుని టెకీని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టింది. అలా ఇప్పటివరకు ఏకంగా రూ.1.14 కోట్ల తన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. ఇంకా డబ్బు కావాలంటూ శాన్వి వేధింపులు ఎక్కువ కావడంతో ఎన్నారై స్థానిక వైట్‌ఫీల్డ్ పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి పోలీసులు ఖాతాలో ఉన్న రూ.80 లక్షలు డ్రా చేసుకోకుండా కట్టడి చేశారు. ప్రస్తుతం శాన్వి అరోరా పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Beware: ప్రవాసులూ బీ కేర్‌ఫుల్.. కువైత్, సౌదీలో ఉండగా ఈ తప్పు మాత్రం చేయొద్దు..
Updated Date - 2023-08-01T11:51:09+05:30 IST