ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dubai: కాస్మెటిక్ క్లినిక్ నుంచి బొటాక్స్ ఇంజెక్షన్స్ దొంగిలించిన మహిళకు జైలు, దేశ బహిష్కరణ..!

ABN, First Publish Date - 2023-04-04T09:45:22+05:30

తాను పనిచేసే కాస్మెటిక్ క్లినిక్ (Cosmetic Clinic) నుంచి ఖరీదైన సౌందర్య సాధనాలు దొంగిలించిన ఓ మహిళకు దుబాయి క్రిమినల్ కోర్టు (Dubai Criminal Court) రూ. 4.70లక్షల జరిమానా, మూడు నెలల జైలు శిక్ష విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దుబాయి: తాను పనిచేసే కాస్మెటిక్ క్లినిక్ (Cosmetic Clinic) నుంచి ఖరీదైన సౌందర్య సాధనాలు దొంగిలించిన ఓ మహిళకు దుబాయి క్రిమినల్ కోర్టు (Dubai Criminal Court) రూ. 4.70లక్షల జరిమానా, మూడు నెలల జైలు శిక్ష విధించింది. అంతేగాక ఆమె శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని (Deported) సంబంధిత అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 34 ఏళ్ల ఓ మహిళ దుబాయిలో స్థానికంగా ఉండే ఓ కాస్మెటిక్ క్లినిక్‌లో పని చేస్తోంది. ఈ క్రమంలో ఆమె కొంతకాలంగా అక్కడి సౌందర్య సాధనాలను దొంగలిస్తోంది. ఒకరోజు క్లినిక్ ఓనర్, ప్లాస్టిక్ సర్జెన్‌కు అనుమానం రావడంతో క్లినిక్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

దాంతో ఆమె చోరీ బయటపడింది. సదరు మహిళ క్లినిక్ నుంచి విలువైన బొటాక్స్ ఇంజెక్షన్స్, ఇతర సౌందర్య ఉత్పత్తులను తస్కరించినట్లు గుర్తించారు. ఆమె దొంగలించిన సౌందర్య సాధనాల విలువ సుమారు 21వేల దిర్హమ్స్ (రూ.4.71లక్షలు) వరకు ఉంటాయని సర్జెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దుబాయి క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు. తాజాగా న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చింది. మహిళకు రూ. 4.70లక్షల జరిమానా, 3నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

Airfares: యూఏఈ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం బెటర్.. లేకుంటే మీ జేబుకు చిల్లే..!


Updated Date - 2023-04-04T09:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising