ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: ఎన్నారై తెలుగుదేశం, జనసేన గల్ఫ్ వారి జూమ్ మీటింగ్

ABN, First Publish Date - 2023-10-10T13:36:54+05:30

గల్ఫ్‌లో ఎన్నారై టీడీపీ కార్యవర్గాలు గతేడాది ఏర్పడి పార్టీతో అనుసంధానమై, గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ ఆధ్వర్యంలో విస్తృతంగా పని చేస్తున్నాయి. అలాగే జనసేన పార్టీ కోసం గల్ఫ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులతో పదిరోజుల క్రితం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గల్ఫ్ కార్యవర్గాన్ని నియమించారు.

NRI: గల్ఫ్‌లో ఎన్నారై టీడీపీ కార్యవర్గాలు గతేడాది ఏర్పడి పార్టీతో అనుసంధానమై, గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ ఆధ్వర్యంలో విస్తృతంగా పని చేస్తున్నాయి. అలాగే జనసేన పార్టీ కోసం గల్ఫ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులతో పదిరోజుల క్రితం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గల్ఫ్ కార్యవర్గాన్ని నియమించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయనకు సంఘీభావం తెయజేశారు. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం, జనసేన పొత్తును ప్రకటించారు. జనసేన, తెలుగుదేశం కలిసి పనిచేయాలని, ఉమ్మడి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఆయన పిలుపు మేరకు గల్ఫ్‌లోని తెలుగుదేశం శ్రేణులు, జనసైనికులు కూడా కలిసి పనిచేయాలని ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఎన్నారై తెలుగుదేశం గల్ఫ్ నాయకులు, జనసేన గల్ఫ్ నాయకులతో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వివిధ గల్ఫ్ దేశాల ఎన్నారై తెలుగుదేశం ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్స్ సుధాకర్ కుదరవల్లి, తులసి కుమార్, కౌన్సిల్ మెంబర్స్ వెంకట్ కోడూరి, హరిబాబు తక్కిలపాటి, హరిబాబు నల్లి, ఖాదర్ బాషా, సత్య మలిరెడ్డి అధ్యక్షులు ఖాలిద్ సైఫుల్లా, విశ్వేశ్వర రావు, నాగేంద్ర బాబు, ఈశ్వర్ నాయుడు, రఘునాథ్ బాబు, మొహమ్మద్ ఇమాం, రమణ, జనసేన గల్ఫ్ జాతీయ కన్వీనర్స్ త్రిమూర్తులు కేసరి, రాందాస్, శ్రీకాంత్, రామచంద్ర నాయక్, చంద్ర శేఖర్, వివిధ దేశాల ప్రాంతీయ కన్వీనర్స్ భాస్కర్ రావు, నగేష్, మూర్తి, అంజన కుమార్, సూర్యనారాయణ రాజేష్ లింగయ్య, రాయుడు, భరత్, నాని అడ్డాల, వీరమహిళలు పాల్గొని ఒకరికొకరు పరిచయం చేసుకుని క్లుప్తంగా ప్రసంగించారు. అందరూ ముక్తకంఠంతో మనమంతా కలిసి మెలిసి పనిచేసి 2024లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రదేశ్‌లో తేవాలని అన్నారు. జనసేన గల్ఫ్ జాతీయ కన్వీనర్స్ త్రిమూర్తులు, రాందాస్ ఈ జూమ్ మీటింగ్‌ను ఏర్పాటు చేసిన రాధాకృష్ణకి పాల్గొన్న అందరికి దన్యవాదాలు తెలియజేశారు.

Updated Date - 2023-10-10T13:36:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising