ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chikoti ED Enquiry : ఈడీ విచారణ తర్వాత ఏబీఎన్‌తో మాట్లాడుతూ చికోటి ప్రవీణ్ కీలక ప్రకటన.. సర్వత్రా ఉత్కంఠ..!

ABN, First Publish Date - 2023-05-15T23:55:08+05:30

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.సోమవారం నాడు ఈడీ విచారణ పూర్తయిన తర్వాత ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.సోమవారం నాడు ఈడీ విచారణ పూర్తయిన తర్వాత ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ఈయన కామెంట్స్‌పై ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ప్రకటనతో అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. బీఆర్ఎస్ నేతలు కూడా ఈ విషయాలను నిశితంగా గమనిస్తున్నారు. సోమవారం నాడు లాయర్లతో కలిసి ప్రవీణ్ ఈడీ కార్యాలయానికి వెళ్లిన చికోటిని థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో కోట్ల రూపాయల లావాదేవీలపై ప్రవీణ్‌ను 7 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని చెబుతూనే తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేశారు.

ఏబీఎన్‌తో మాట్లాడుతూ కీలక ప్రకటన..!

థాయిలాండ్ గాంబ్లింగ్ కేసులో ఈరోజు నేను విచారణకు హాజరయ్యాను. నకిలీ సర్టిఫికెట్స్‌తో నాకు ఇన్విటేషన్ పెట్టారు. లగ్జరీ కారుల కొనుగోలు అంశం ప్రస్తుతం ఐటి శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. త్వరలో రాజకీయ అరంగేట్రం చేస్తాను. త్వరలో ప్రకటిస్తాను. ఏ ఆపార్టీ అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేను. నన్ను రాజకీయాల్లోకి రాకుండా ఇలాంటి రూమర్స్ చేస్తున్నారు. ఈడీ దర్యాప్తు సంస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మళ్ళీ ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని అధికారులు చెప్పారు. థాయిలాండ్‌కు నాతో వైసీపీ నాయకులు వచ్చారు అనేది అవాస్తవం. ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చారు.. నేను ఎవరిని కూడా ఆహ్వానించలేదు. నేను ఒక ఆటగాడిగా వెళ్లి మోసపోయాను. నాకు వ్యతిరేకులు కావాలనే బ్లేమ్ చేస్తున్నారు. నేను 50 లక్షలు థాయిలాండ్ పోలీసులకు ఇచ్చి బయట పడ్డాను ఆరోపణలు చేశారు. థాయిలాండ్‌లో రూల్స్ ఎలా ఉంటాయో అందరికి తెలిసినవే. నాతో పాటు ఈవెంట్‌కి హాజరైన డీసీసీబీ అధ్యక్షుడు చిట్టి దేవేందర్ రెడ్డి, మాధవరెడ్డిని నేను తీసుకెళ్లలేదు. వారు వ్యక్తి గతంగా హాజరయ్యారు. నాకు ఇంటర్ నేషనల్ లెవల్‌లో ఆటగాళ్ల పరిచయాల కోసం మాత్రమే థాయిలాండ్‌కు వెళ్ళానుఅని చికోటి చెప్పుకొచ్చారు.

మొత్తానికి చూస్తే.. ఇన్నిరోజులుగా చికోటిపై వస్తున్న విమర్శలు, ఆరోపణలకు చికోటి స్ట్రాంగ్‌గానే రియాక్టయ్యారు. అంతేకాదు.. తన పొలిటికల్ ఫ్యూచర్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారన్నది తెలుసుకోవడానికి ఔత్సాహికుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికైతే ఆయన బీజేపీలో చేరతారనే వార్తలు మాత్రం గుప్పుమంటున్నాయి. అయితే చికోటి ఎప్పుడెలాంటి ట్విస్ట్ ఇస్తారో ఏంటో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Balineni Row : మరోసారి అసంతృప్తి వెళ్లగక్కిన బాలినేని.. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇస్తూనే వైఎస్ జగన్ గురించి ఇలా..!

*****************************

DK Vs Sidda For CM Chair : ఢిల్లీ వెళ్లకముందే.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ బాంబ్ పేల్చిన డీకే శివకుమార్.. ఈ ఒక్క మాటతో..

******************************

BJP Vs Congress : కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. రేవంత్ రెడ్డికి టచ్‌లో బీజేపీ ఎంపీ..!

******************************

Updated Date - 2023-05-16T00:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising