ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly Elections 2023 : మంత్రి సబిత- తీగల చెట్టాపట్టాల్.. అరగంట పాటు రహస్య సమావేశం..!

ABN, First Publish Date - 2023-08-13T20:26:47+05:30

అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ చిత్రవిచిత్రాలు జరిగిపోతున్నాయ్!. బద్ధ శత్రువులు అన్నవాళ్లు.. మిత్రులైపోతున్నారు..! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న మాట అక్షరాలా నిజం చేస్తున్నారు నేతలు!..

అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ చిత్రవిచిత్రాలు జరిగిపోతున్నాయ్!. బద్ధ శత్రువులు అన్నవాళ్లు.. మిత్రులైపోతున్నారు..! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న మాట అక్షరాలా నిజం చేస్తున్నారు నేతలు!. ఇక అసలు విషయానికొస్తే.. బీఆర్ఎస్ ముఖ్యనేతలైన.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra reddy) - మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy) ఒక్కటయ్యారా..? తమలో తాము గొడవ పడితే అసలుకే మోసం వస్తుందని గ్రహించారా? ఇకపై ఇద్దరం కలిసే అడుగులు ముందుకేయాలని నిర్ణయించుకున్నారా..? అంటే తాజాగా జరిగిన ఓ పరిణామాన్ని బట్టి ఇదంతా అక్షరాలా నిజమేనని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఏమిటా పరిణామం..? పార్టీ మారాలనుకున్న.. టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారుతానని అధిష్టానానికే అల్టిమేటం జారీచేసిన తీగల ఇంత సడన్‌గా ఎలా మారిపోయారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.


ఇదీ అసలు కథ..!

2014 ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో టీడీపీ (Telugudesam) తరఫున 30,784 ఓట్ల మెజార్టీతో గెలిచిన తీగల.. బీఆర్ఎస్ (BRS) తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన సబితా ఇంద్రారెడ్డి కూడా ‘కారు’ పార్టీలో చేరారు. ఇద్దరూ ఒకే గూటిలో ఉండటంతో ఒకరంటే ఒకరికి అస్సలు పడట్లేదు. సబితకు మంత్రి పదవి కూడా ఇవ్వడంతో తీగలకు మరింత ఆగ్రహం తెప్పించినట్లయ్యింది. దీంతో నియోజకవర్గంలో రోజురోజుకూ తీగల కృష్ణారెడ్డి ప్రభావం తగ్గిపోయింది. మంత్రి అనుచరులే నియోజకవర్గంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుండటంతో తీగల వర్గం సైలెంట్ అయిపోయింది. మరోవైపు.. మంత్రి కొడుకు పటోళ్ల కార్తీక్ రెడ్డి కూడా షాడో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో హల్ చల్ చేస్తుండటంతో తీగల.. ఆయన వర్గానికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేయాలని భావించారు కూడా. ఆ మధ్య ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలే చేసుకున్నారు. దీంతో తీగల అనుచరులు, కార్యకర్తలు ఆందోళనలో చెందారు. అంతేకాదు.. ఫైనల్‌గా తనకు టికెట్ ఇస్తే సరే లేకుంటే పార్టీ మారుతానని హైకమాండ్‌కే అల్టిమేటం జారీ చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పెద్దల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో (TPCC Chief Revanth Reddy) ఉన్న సాన్నిహిత్యంతో తీగల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని.. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని టాక్ నడిచింది.

ఇప్పుడేమో ఇలా..?

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ‘కారు’ దిగే ఆలోచనను తీగల విరమించుకున్నారట. ఒకే పార్టీలో ఉన్న మనం ఒకరిపై ఒకరం బురదజల్లుకోవడం మానితే బాగుంటుందని.. లేకుంటే మొదటికే మోసం వస్తుందని భావించారట. ఇకపై ఇద్దరూ కలిసి ఒకేథాటిపైకి వచ్చి టికెట్ ఎవరికిచ్చినా సరే బీఆర్ఎస్ జెండా ఎగరేయాలన్నదే అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నారట. అందుకే.. ఆదివారం నాడు బడంగ్‌పేట్‌లో ఇన్నాళ్లు ఉప్పు-నిప్పులా ఉన్న ఈ ఇద్దరు నేతలు కలిశారు. ఓ కార్యక్రమంలో ఇద్దరూ కలిసే పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సబిత, తీగల ఇద్దరూ ఏకాంతంగా కలుసుకున్నారు. అరగంటపాటు ఇద్దరూ రహస్యంగా చర్చించుకున్నారు కూడా. ‘టికెట్ ఎవరికిచ్చినా నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాల్సిందేనని.. ఆ తర్వాత టికెట్ దక్కనివారికి అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇస్తుంది.. ఇందులో ఎలాంటి సందేహాలు, అనుమానాలు అక్కర్లేదు. ఇక నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు, అసంతృప్తి వద్దు.. కలిసి ముందుకెళ్దాం.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం’ అని సబిత, తీగల ఇద్దరూ ఓ నిర్ణయానికొచ్చారట. అయితే.. భేటీ తర్వాత బయటికొస్తూ.. ‘జై సబితమ్మ.. జై జై సబితమ్మా..’ అని స్వయంగా తీగల నినదించారట. దీంతో ఇరు వర్గీయులు ఈలలు, కేకలతో కాసేపు కార్యక్రమంలో హోరెత్తించారట. దీన్ని బట్టి చూస్తే ఇద్దరూ కలిసిపోయారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చన్న మాట.

మొత్తానికి చూస్తే.. ఇద్దరూ కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం.. రహస్యంగా చర్చించడాన్ని బట్టి చూస్తే.. తీగల కారు దిగే ఆలోచనను విరమించుకున్నట్లే. మరోవైపు.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే సబితా ఇలా సమావేశం అయ్యారనే టాక్ కూడా నడుస్తోంది. ఇద్దరూ కలిసిపోయారు సరే.. టికెట్ ఎవరికొస్తుందో ఏమిటో అన్నది ఇరు వర్గీయుల్లో ఆందోళన మొదలైందట. ఏమో చివరికి ఏమైనా జరగొచ్చని తీగల అనుచరులు చెప్పుకుంటున్నారట. ఏం జరుగుతుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


TS Politics : చంద్రశేఖర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్.. ఎక్కడ్నుంచి పోటీచేస్తారంటే..!?


Rushikonda Construction : అబ్బే సెక్రటేరియట్ కాదు.. రుషికొండ నిర్మాణాలపై మరోసారి మాటమార్చిన వైసీపీ..!


Telangana BJP : బీజేపీ కీలక నేతలంతా నియోజకవర్గాలు మార్చేశారుగా.. ఎవరెక్కడ్నుంచి పోటీచేస్తారంటే..!?


TS Assembly Elections 2023 : బీఆర్ఎస్ తొలి జాబితా తేదీ మళ్లీ మారింది.. కేసీఆర్‌కు ‘లక్’ కలిసొచ్చేనా..!?


BRS : ఐదుసార్లు సర్వే చేయించినా ఆ మంత్రిపై నెగిటివ్‌గానే ఫలితం.. టికెట్ లేనట్టే..!?


AP Politics : ఏపీ ఎన్నికల ముందు వైఎస్ జగన్‌కు ఇంత భయమెందుకో..!?



Updated Date - 2023-08-13T20:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising