ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSRCP : ఎంపీ వల్లభనేని బాలశౌరికి సొంత పార్టీ నుంచే ఇంత అవమానమా.. ఈ ఇన్విటేషన్ చూశాక ముఖ చిత్రమేంటో..!

ABN, First Publish Date - 2023-05-21T22:56:31+05:30

అవును.. ఎంపీ వల్లభనేని బాలశౌరిని (MP Balashowry Vallabbhaneni) వైసీపీ అధిష్టానం (YSRCP High Command) ఘోరంగా అవమానించింది..! వ్యక్తిని పక్కనెట్టినా కనీసం ఎంపీ అనే హోదాకు కూడా కనీస గౌరవం ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారం విజయవాడతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవును.. ఎంపీ వల్లభనేని బాలశౌరిని (MP Balashowry Vallabbhaneni) వైసీపీ అధిష్టానం (YSRCP High Command) ఘోరంగా అవమానించింది..! వ్యక్తిని పక్కనెట్టినా కనీసం ఎంపీ అనే హోదాకు కూడా కనీస గౌరవం ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారం విజయవాడతో (Vijayawada) పాటు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్కే అయ్యింది..! మేయర్ కంటే ఎంపీ స్థాయి ఎక్కువో తక్కువో అనేది కూడా అధికార పార్టీకి తెలియని పరిస్థితి..! పోనీ ఇదేమైనా కొత్తనా అంటే.. అస్సలు కానేకాదు.. అయినా సరే ఇప్పుడు జరిగిన తాజా వ్యవహారంతో రచ్చ రచ్చ అయ్యే పరిస్థితులు మాత్రం మెండుగానే కనిపిస్తున్నాయి. ఇంతకీ ఎంపీకి జరిగిన అవమానం ఏంటి..? పదే పదే ఎందుకిలా జరుగుతోంది..? ఈ వ్యవహారం బాలశౌరి, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) దాకా వెళ్లిందా..? అనే ఇంట్రస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం..

అసలేం జరిగింది..!?

మచిలిపట్నంలోని బందరు పోర్టు నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం ఉదయం పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమిపూజ చేసి, పైలాన్ ఆవిష్కరించనున్నారు. అనంతరం పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. ఆహ్వాన పత్రికలే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. సోమవారం జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి రెండు రకాల ఆహ్వాన పత్రికలు ముద్రించబడ్డాయి. ఇందులో ఒకటి మచిలీపట్నం నియోజకవర్గం వైసీపీ తరఫున.. ఇంకొకటి జిల్లా కలెక్టర్ పేరుతో ఆహ్వాన పత్రికలు ముద్రించారు. ఈ రెండు పత్రికలూ వివాదాస్పదంగా మారాయి. ఈ రెండింటిల్లోనూ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి గౌరవం దక్కలేదు. ఎంపీ స్థాయిని తక్కువ చేసేలా ఫొటో, పేరు ముద్రించడం గమనార్హం. పార్టీ పరంగా ముద్రించిన ఆహ్వాన పత్రికలో చిన్నపాటి ఫోటోకే ఎంపీ పరిమితం అవ్వగా.. ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టును హైలైట్ చేయడంతో బాలశౌరి అభిమానులు, అనుచరులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ప్రోటోకాల్ పాటించరా..!?

ఇవన్నీ ఒక ఎత్తయితే.. అధికారిక ఆహ్వాన పత్రికలో ఎంపీ పేరు ప్రోటోకాల్ ప్రకారం ముద్రణకు నోచుకోలేదు. విశిష్ట అతిథుల పేర్లలో చివరి పేరుగా ఎంపీ బాలశౌరి పేరు ఉంది. ఈయన పేరుపైన నగర మేయర్ పేరు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. అంటే ఎంపీ కంటే మేయర్ ఎక్కువన్నది వైసీపీ ప్రభుత్వం ఉద్దేశమేమో..!. ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధి విషయంలో కనీసం ప్రొటోకాల్ పాటించకపోవడంతో ఈ పత్రికలు చూసిన జనాలంతా బాబోయ్.. ఇదేం పద్ధతి..? అని అంటుండగా.. వైసీపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత అనేది ఉండదా..? సొంత పార్టీ నేతలే అవాక్కవుతున్న పరిస్థితి. ఇప్పుడీ వ్యవహారం ఒక్క విజయవాడలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం, పేర్ని నాని తీరుపై ఎంపీ అభిమానులు, అనుచరులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇంత జరుగుతున్నా వైసీపీ అధిష్టానం నుంచి ఇంతవరకూ స్పందించకపోవడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ కూడా హర్ట్ అయ్యారట. సోమవారం జరిగే కార్యక్రమానికి వెళ్తారా లేదా అనేది కూడా డౌటేనని అభిమానులు చెప్పుకుంటున్నారట.

మొత్తానికి.. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తన కుమారుడు పేర్ని కిట్టును మచిలిపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా హైకమాండ్ దృష్టిలో పడటానికి కిట్టును ముందు ఉంచుతున్నారట. ఇవాళ ఇన్విటేషన్ కార్డుల్లో కూడా తన ఫొటో చిన్నదిగా.. కిట్టు ఫొటో పెద్దగా.. తాటికాయంత అక్షరాలా వేయడం వెనుక ప్లాన్ ఇదేనట. ఇక.. పదేపదే ఇలా ఎంపీని టార్గెట్ చేయడం వెనుక చాలా పెద్ద కథే ఉందట. చాలా రోజులుగా బాలశౌరి-నాని మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులున్నాయ్. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్న రోజులు కూడా ఉన్నాయ్. రానున్న రోజుల్లో ఇంకా ఎన్నెన్ని జరుగుతాయో మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Avinash Vs CBI : ‘తగ్గేదేలే’.. రావాల్సిందే అంటున్న సీబీఐ.. విచారణ నుంచి తప్పించుకోవడానికి ఎంపీ అవినాష్ ప్లాన్ ఇదేనా..!

******************************

Avinash CBI Enquiry : విచారణకు రాలేనన్న ఎంపీ అవినాష్.. హుటాహుటిన కర్నూల్‌కు సీబీఐ బృందం.. ఏం జరుగుతుందో అని వైసీపీలో నరాలు తెగే ఉత్కంఠ..!

******************************

Avinash Vs CBI : ఉదయం నుంచి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. అవినాష్‌పై సీబీఐ సీరియస్.. హెడ్‌క్వార్టర్స్‌ నుంచి క్లియర్ కట్‌‌గా ఆదేశాలు.. ఏ క్షణమైనా..!?

******************************
Avinash In Viveka Case : ఎంపీ అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ ఇచ్చిన డాక్టర్లు

******************************

AP Politics : వైసీపీ నేతలను మించిపోయిన రాపాక.. వైఎస్‌ జగన్‌‌ను ఈ రేంజ్‌లో ప్రసన్నం చేసుకోవడం వెనుక..!

******************************

Updated Date - 2023-05-21T23:12:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising