ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New Parliament Building : రాష్ట్రపతిని పక్కనెట్టి మరీ మోదీ చేతుల మీదుగానే ఎందుకు..? నాడు తిట్టిపోశారుగా.. ఇప్పుడు చేస్తున్నదేంటో..!?

ABN, First Publish Date - 2023-05-23T20:45:44+05:30

అసలే ఎన్నికల టైమ్.. అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు..! అధికారంలో ఉన్న పార్టీలు అంతా మా ఇష్టం, మేం చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తుండగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసలే ఎన్నికల టైమ్.. అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు..! అధికారంలో ఉన్న పార్టీలు అంతా మా ఇష్టం, మేం చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం దేశంలో రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం పతాక స్థాయికి చేరిందనే విమర్శలు గుప్పిస్తున్నాయ్. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ (Modi Sarkar) కూడా ఇదే పంథాలో వెళ్తోందని.. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నుంచి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బీజేపీ అధికారంలో లేని చోట ఒకలా.. ఉన్నచోట మరోలా వ్యవహరిస్తూ అవకాశం ఉన్న ప్రతిసారి తన ద్వంద్వ వైఖరిని చాటుకుంటున్నదని రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ఇందుకు ఉదాహరణ.. మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building). మే-28న ప్రారంభించాలని కేంద్రం ఉవ్విళ్లూరుతోంది. అయితే.. భవనం భూమిపూజ మొదలుకుని.. రేపో మాపో ప్రారంభానికి నోచుకుంటున్నంత వరకూ అంతా వివాదాస్పదంగానే ఉంది. అదలా ఉంచితే.. ఇప్పుడు ఆహ్వానం విషయంలో పెద్ద రచ్చే జరుగుతోంది..? అప్పట్లో తెలంగాణలో కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్‌ను పిలవలేదని నానా యాగీ చేసిన బీజేపీ (BJP).. ఇప్పుడు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని (President of India) పిలవకపోవడం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది..! ఇంతకీ ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయ్..? మోదీ సర్కార్ ఎందుకు ఇలా చేస్తోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం..

మోదీ.. ఇదేందీ.. ఎందుకిలా..!?

దేశానికి మూల స్తంభాల్లో ఒకటైన పార్లమెంట్‌ కొత్త భవనం అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. నిజంగా దేశ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టమనే చెప్పుకోవాలి. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తే అంతా బాగుండేది కానీ.. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకోవడంతో రచ్చ రచ్చ అవుతోంది. దీనికి కారణం.. మోదీ ఈ కొత్త భవనాన్ని ప్రారంభించడమే. దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu). అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతికి.. పార్లమెంట్ భవన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు. ఆఖరికి మాజీ రాష్ట్రపతిని కూడా ఆహ్వానించలేదు. వారెవర్నీ పిలవకపోవడం ఒక ఎత్తయితే.. ప్రధానమంత్రి మోదీనే ఈ భవనాన్ని ప్రారంభించనుండటం గమనార్హం. దీంతో ఈ విషయాన్ని పట్టుకున్న కాంగ్రెస్, ప్రతిపక్షాలు.. రాష్ట్రపతికి ఆహ్వానం లేకపోవడం మోదీ సర్కార్ అవమానించడమేనని ధ్వజమెత్తుతున్నాయి. ఇంత భారీ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రపతి కార్యాలయ ఔచిత్యాన్ని పదేపదే మోదీ ప్రభుత్వం అవమానిస్తోందని కాంగ్రెస్‌ కన్నెర్రజేస్తోంది. ఇలా ఇదొక్క ప్రారంభోత్సవమే కాదు.. భూమి పూజ మొదలుకుని అన్నింటిలోనూ మోదీ సర్కార్ ప్రవర్తించిన తీరుతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అదిగో ప్రతిపక్షాలు అలా చేస్తున్నాయ్.. ఇలా చేస్తున్నాయ్ అని పదే పదే విమర్శలు చేసే మోదీ.. ఇప్పుడెందుకిలా చేస్తున్నారు..? ఇదేందయ్యా మోదీ..? సోషల్ మీడియా వేదికగా (Social Media) సామాన్య ప్రజలు సైతం మండిపడుతున్నారు.

అప్పుడు అలా.. ఇప్పుడిలా..!

తెలంగాణలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్‌గా (Governer Vs Govt) చాలా రోజులుగా పరిస్థితులున్నాయ్. సందర్భం వచ్చినప్పుడల్లా గవర్నర్.. సమయం వచ్చినప్పుడల్లా కేసీఆర్ సర్కార్ (KCR Govt) ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించుకుంటున్నాయ్.. ఇదే పరిస్థితి ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలియట్లేదు. కొత్త సచివాలయం (TS New Secretariat Building) ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు (Tamilisai Soundararajan) ఆహ్వానం పంపలేదు.. పంపినా బహుశా రారేమో.. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయ్ మరి!. దీంతో పంతానికి పోయి మరీ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం పంపలేదని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఉన్న బీజేపీ నేతలు.. కేసీఆర్ సర్కార్‌పై దుమ్మెత్తిపోశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడంతా కొత్త సచివాలయం చుట్టూనే రాజకీయాలు జరిగాయి.

నాడు తిట్టిపోసిన ఇదే బీజేపీ.. ఇప్పుడు ఏం చేసింది..? అంటే ఇది ద్వంద వైఖరి కాదా..? అని బీజేపీ తీరుపై బీఆర్ఎస్ (BRS) సహా ప్రతిపక్షాలన్నీ ఒంటికాలిపై లేస్తున్నాయ్. అంతేకాదు.. ఇదంతా ప్రజాధానంతో కట్టి.. ఇప్పుడేదో మోదీ సొంత నిధులతో కట్టినట్లుగా ప్రవర్తించడం ఎంతవరకు సబబు..? అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా అయితే.. బీజేపీ వీరాభిమానులు.. ఇతర పార్టీల కార్యకర్తల మధ్య ఓ రేంజ్‌లో కౌంటర్లు పేలుతున్నాయి. నిద్రలేచింది మొదలుకుని పడుకునే వరకూ మహిళలకు పెద్ద పీట వేశాం.. ప్రజాస్వామాన్ని కాపాడుతున్నామని చెప్పుకునే బీజేపీ.. ఇప్పుడు ఏం చేస్తోంది..?.. ప్రొటోకాల్ సంగతి అటుంచితే.. రాష్ట్రపతికి కనీసం గౌరవం ఇవ్వకపోవడం, అందులోనూ మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా..? అని సామాన్యుడు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితి. పక్కనోళ్లు ఏదైనా చేస్తే వేలెత్తి చూపించే బీజేపీ.. ఇప్పుడు ఎందుకిలా చేస్తుందో కమలనాథులకే తెలియాలి మరి.

మోదీ చేతుల మీదుగానే..!?

ఇప్పుడు అసలే ఎన్నికల టైమ్.. పైగా పార్లమెంట్ నిర్మాణం జరిగింది బీజేపీ హయాంలో.. అలాంటప్పుడు ఆ క్రెడిట్ మొత్తం బీజేపీదేనని కమలనాథులు (BJP Leaders) భావిస్తున్నారట. ఇలాంటి పార్లమెంట్ భవనాన్ని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తే పార్టీకి వచ్చే మైలేజ్.. కమలనాథుల్లో వచ్చే కిక్కే వేరట. అందుకే ఆహ్వానం పంపింది లోక్‌సభ సెక్రటరీయే అయినా.. పెద్దల సూచన మేరకే ఇలా ప్రారంబోత్సవం జరపాలని మోదీకి ఆహ్వానం అందిందట. నరేంద్ర మోదీ (Narendra Modi) తానే పార్లమెంట్ ప్రారంభించాలని భావించారు కాబట్టే.. రాష్ట్రపతికి పిలుపు వెళ్లలేదనే విమర్శలు వస్తున్నాయ్. పోనీ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, సోషల్ మీడియాలో ఈ రేంజ్‌లో విమర్శలు వస్తున్నా.. మోదీ చేత ప్రారంభం ఎందుకు..? ఒకవేళ రాష్ట్రపతిని పిలిచినా.. రాష్ట్రపతే ప్రారంభిస్తే వచ్చే ఇబ్బంది ఏమిటి..? అనేది మాత్రం బీజేపీ చెప్పకపోవడం.. కనీసం సరైనా వివరణ కూడా ఇచ్చుకోలేని స్థితిలో కమలనాథులు ఉండటం గమనార్హం.

మొత్తమ్మీద చూస్తే.. పార్లమెంట్ అనేది ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు.. ప్రజలందరిదీ, అన్ని పార్టీలదీ. ప్రధాని ఒక పార్టీకి ప్రతినిధి.. అదే రాష్ట్రపతి అయితే ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి గనుక రాజకీయాలకు తావులేకుండా రాష్ట్రపతి ప్రారంభిస్తేనే బాగుంటుందన్నది చాలా మంది అభిప్రాయం. అంతేకాదు.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగితే ప్రజాస్వామ్య విలువలకు తావివచ్చినట్లు ఉంటుంది. ఇంకా నాలుగైదు రోజులు సమయం ఉంది గనుక ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మోదీ సర్కార్ ఆహ్వానం పంపితే బాగుంటేదేమోనని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Avinash CBI Enquiry : విచారణకు రాలేనన్న ఎంపీ అవినాష్.. హుటాహుటిన కర్నూల్‌కు సీబీఐ బృందం.. ఏం జరుగుతుందో అని వైసీపీలో నరాలు తెగే ఉత్కంఠ..!

******************************

Dimple Vs DCP : డింపుల్ హయాతీ వర్సెస్ డీసీపీ ఎపిసోడ్‌లో రెండు నెలలుగా అసలేం జరిగింది.. హీరోయిన్ ఏం చేయబోతున్నారు..!?

******************************
Avinash Vs CBI : ‘తగ్గేదేలే’.. రావాల్సిందే అంటున్న సీబీఐ.. విచారణ నుంచి తప్పించుకోవడానికి ఎంపీ అవినాష్ ప్లాన్ ఇదేనా..!

******************************

YSRCP : ఎంపీ వల్లభనేని బాలశౌరికి సొంత పార్టీ నుంచే ఇంత అవమానమా.. ఈ ఇన్విటేషన్ చూశాక ముఖ చిత్రమేంటో..!


*****************************

Updated Date - 2023-05-23T22:26:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising