TS Congress : తెలంగాణకు విచ్చేస్తున్న ‘డీకే’.. ఈ పెను సవాళ్ల సంగతేంటి.. ఈ 5 హామీలతో కేసీఆర్‌ను ఢీ కొంటారా..?
ABN, First Publish Date - 2023-06-17T20:53:40+05:30
డీకే శివకుమార్.. (DK Shivakumar) డీకే.. (DK) ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించడం వెనుక ఆయన వ్యూహాలు ఎన్నో ఉన్నాయి.. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, పార్టీ అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దడం వంటి అనేక అంశాల్లో డీకేకు మంచి పట్టుందని హైకమాండ్ గుర్తించింది..
డీకే శివకుమార్.. (DK Shivakumar) డీకే.. (DK) ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించడం వెనుక ఆయన వ్యూహాలు ఎన్నో ఉన్నాయి.. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, పార్టీ అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దడం వంటి అనేక అంశాల్లో డీకేకు మంచి పట్టుందని హైకమాండ్ గుర్తించింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డీకేకు.. తెలంగాణ కాంగ్రెస్ (TS Congress) బాధ్యతలను కూడా అప్పగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు ముగియగా.. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుందని గత రెండు మూడ్రోజులుగా పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల అబ్జర్వర్‌గా నియమించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. డీకే తెలంగాణకు వస్తారు సరే.. ఇక్కడ పార్టీలో పరిస్థితులను ఎలా చక్కబెడతారు..? ఆయన ముందున్న సవాళ్లు ఏంటి..? ఆయన కర్ణాటక ఫార్ములానే ఇక్కడ అమలు చేస్తారా..? లేకుంటే ఆయన టార్గెట్ వేరే ఉందా..? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
వస్తారు సరే.. ఇవన్నీ ఎలా..?
వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) అహర్నిశలు కష్టపడుతున్నారు. అయితే.. నేతల్లో మాత్రం ఎవరిదారి వారిదే అన్నట్లుగా పరిస్థితులున్నాయ్. ఎందుకంటే.. పార్టీని వివాదాలు, విబేధాలు, అసంతృప్తి ఎప్పుడూ వెంటాడుతుంటాయ్. రాష్ట్ర నేతలు ఎప్పుడేం మాట్లాడతారో..? ఎలా యూటర్న్ తీసుకుంటారో..? ఎప్పుడు గుడ్ బై చెప్పేసి వేరే గూటికి చేరతారో..? ఏ ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు తలెత్తుతాయో..? ఎవరు అసమ్మతి గళం వినిపిస్తారో తెలియని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే మూడ్రోజులు మంచిగా ముచ్చటగా ఉంటే ఆ తర్వాత ఇక ఆ నేతల మధ్య ఏదో ఒక విషయంలో కచ్చితంగా గొడవ జరుగుతుంది. దీనికి తోడు ఎవరికివారే ప్రకటనలు చేసేస్తుంటారు.. పార్టీ లైన్ దాటేసి మరీ మాట్లాడేస్తుంటారు.. ఇదీ టీ. కాంగ్రెస్ పరిస్థితి. ఈ పరిణామాల మధ్య ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ తెలంగాణకు వస్తే ఏం చేస్తారు..? పరిస్థితులను ఎలా చక్కబెడతారు..? అనేవి ఆయన ముందున్న అతిపెద్ద సవాళ్లు. మరీ ముఖ్యంగా.. టికెట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన.. ఆ తర్వాత నెలకొనే పరిస్థితులు కూడా పెద్ద టాస్కే.! అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిజంగా ఈ సమస్యలను పరిష్కరించడంలో డీకే సక్సెస్ అయితే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదేమో.
రంగంలోకి దిగిపోయారుగా..!
కాంగ్రెస్‌లో పరిస్థితులను చక్కబెట్టడానికి డీకే ఇప్పటికే రంగంలోకి దిగేశారు. పార్టీలో చేరికల నుంచి ట్రబుల్ షూటింగ్ వరకు అన్నీ ఇక ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయని ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన భేటీని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లో చేరికపై బెంగళూరుకు పిలిపించుకొని మరీ డీకే రహస్య సమావేశం నిర్వహించారు. ఈ భేటీ తర్వాతే ఆ ఇద్దరూ మనసు మార్చుకోవడం, ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం లాంటివి చేశారట. అంతేకాదు.. చేరికలపై నిత్యం తెలంగాణ ముఖ్యనేతలతో డీకే టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఎందుకంటే.. తెలంగాణలో అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను సాధించాలంటే రాష్ట్ర, నియోజకవర్గ స్థాయుల్లో ప్రభావం చూపగల ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం తప్పనిసరి అని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఆర్థికంగా, సంస్థాగతంగా బలంగా ఉన్న అధికార బీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే.. చేరికల ద్వారా నియోజకవర్గ స్థాయిలో పార్టీని పటిష్ఠం చేయక తప్పదన్న నిశ్చితాభిప్రాయానికి అధిష్ఠానం వచ్చింది.
హామీలు.. వ్యూహాలు ఇలా..?
కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయానికి 5 కీలక హామీలే ప్రధానం. రైతు రుణమాఫీ, ఉచిత గృహ విద్యుత్, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవే కాంగ్రెస్‌కు అఖండ విజయాన్ని తెచ్చిపెట్టాయి. అయితే ఈ పథకాలను తెలంగాణలోనూ ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు అప్పుడున్న పరిస్థితులను బట్టి.. ఉద్యోగాలు, ఉద్యమ నేతలకు పెన్షన్, పెన్షన్ పెంపు.. ఇలా అన్ని వర్గాల వారికి న్యాయం చేసేలా ఉండే పథకాలు మేనిఫెస్టోలో పెట్టాలని అగ్రనేతలు సమాలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇవేకాదు ఏం చేసైనా సరే.. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలన్నదే లక్ష్యంగా డీకే వ్యూహాలు రచిస్తారట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మునుపటితో పోలిస్తే బీజేపీ బలహీనపడటం, బీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం కూడా కాంగ్రెస్‌కు అన్నివిధాలుగా కలిసొచ్చే అంశాలని వ్యూహకర్త సునీల్ కనుగోలు (Sunil Kanugolu) భావిస్తున్నారట. అందుకే ఈ విషయాలన్నీ ‘పే సీఎం’ (Pay CM) కర్ణాటకలో (Karnataka) ఎలాగైతే జనాల్లోకి తీసుకెళ్లారో.. అలాగే ఇక్కడ కూడా పక్కాగా ప్లాన్ చేశారట. వీటికి తోడు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీల (Priyanka Gandhi) తెలంగాణ పర్యటన నెలలో రెండు, మూడుసార్లు ఉండేలా పక్కా ప్రణాళిక రచిస్తున్నారని తెలియవచ్చింది. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komati Reddy Venkata Reddy).. ప్రియాంకతో ప్రత్యేకంగా భేటీ అయ్యి పదిరోజులకోసారి రాష్ట్రంలో పర్యటించాలని కోరిన విషయం తెలిసిందే.
మొత్తానికి చూస్తే.. ఓ వైపు రేవంత్, ఇంకోవైపు వ్యూహకర్త పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్న ఈ పరిస్థితుల్లో డీకే కూడా వీరికి తోడైతే కచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అంతేకాదు రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న ట్రబుల్స్‌ను పరిష్కరించడం ట్రబుల్ షూటర్ డీకేకు పెద్ద విషయమే కాదని నేతలు చెప్పుకుంటున్నారు. రాజకీయ చాణక్యుడిగా పేరున్న గులాబీ బాస్ కేసీఆర్‌ను తట్టుకుని.. డీకే, రేవంత్, సునీల్ ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
BRS Candidates : హ్యాట్రిక్ కొట్టడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ సీక్రెట్ సర్వే.. 80 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితా.. ప్రకటన ఎప్పుడంటే..
******************************
TS Congress : తెలంగాణలో సీన్ రివర్స్.. ఊహకందని రీతిలో కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రేవంత్.. ఈ రెండే టార్గెట్..!
******************************
TS Congress : పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత.. ముహూర్తం ఫిక్స్.. ఓహో ఇన్నిరోజుల ఆలస్యం వెనుక అసలు కథ ఇదీ..!
******************************
Janasena : పదే పదే పవన్ నోట అదే మాట.. ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.. సమాచారం ఎవరిచ్చారో..?
******************************
AP Police : ఆనంపై అటాక్.. ఎంపీ ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్‌పై పోలీసుల కామెడీ కథలు.. నమ్మకం లేదు దొరా..!
******************************
Updated Date - 2023-06-17T21:09:47+05:30 IST