ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dastagiri ABN Interview: ఆ రాత్రి ఏం జరిగింది..? పూసగుచ్చినట్టు వివరించిన దస్తగిరి..!

ABN, First Publish Date - 2023-04-18T17:53:18+05:30

వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారి బెయిల్‌పై బయట ఉన్న నాలుగో నిందితుడైన షేక్ దస్తగిరి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) అప్రూవర్‌గా మారి బెయిల్‌పై బయట ఉన్న నాలుగో నిందితుడైన షేక్ దస్తగిరి (A4 Dastagiri) ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ (ABN Exclusive Interview) ఇచ్చాడు. ఇదే కేసులో భాస్కర్ రెడ్డి అరెస్ట్ (Bhaskar Reddy Arrest), సీబీఐ విచారణతో (Viveka Case CBI Enquiry) కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో దస్తగిరి ఈ ఇంటర్వ్యూలో (Dastagiri ABN Interview) కొన్ని కీలక విషయాలను బయటపెట్టాడు. రాజకీయం కోసమే వివేకా హత్య జరిగిందని ABNతో దస్తగిరి చెప్పాడు.

ఇది కూడా చదవండి: YS Viveka Murder Case: తెలంగాణ హైకోర్టులో అవినాశ్రెడ్డి, సునీత లాయర్ల మధ్య వాగ్వాదం

కడప ఎంపీ టికెట్ అవినాశ్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయం జరిగిందని, కానీ.. ప్రజల దృష్టిలో ఎంపీ అంటే వివేకా అని దస్తగిరి తెలిపాడు. ఎంపీ టికెట్ కోసం వివేకా, అవినాశ్‌ మధ్య వివాదం జరిగిందని, కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య జరిగిందని దస్తగిరి చెప్పడం గమనార్హం. కదిరిలో గొడ్డలి కొన్నామని, పులివెందులలో కొనవద్దని ఎర్ర గంగిరెడ్డి అన్నారని, పులివెందులలో గొడ్డలి కొంటే అనుమానం వస్తుందని చెప్పినట్లు దస్తగిరి చెప్పాడు. అందుకే కదిరిలో కొన్నామని, ముందే అనుకున్న ప్రకారం వివేకా ఇంటికి వెళ్లామని.. సునీల్‌ యాదవ్‌ మొదట పిడికిలితో వివేకాపై దాడి చేశాడని తెలిపాడు.

ఇది కూడా చదవండి: CM Jagan: ఢిల్లీలో తగ్గిన సీఎం జగన్ పరపతి.. పట్టించుకోని మోదీ, అమిత్ షాలు

పిడిగుద్దులు గుద్దడంతో వివేకా కుప్పకూలాడని, తర్వాత సునీల్‌ యాదవ్‌ కత్తితో దాడి చేశాడని ABNతో దస్తగిరి చెప్పాడు. డ్రైవర్ తనను పిలిచి హత్య చేయబోయాడని వివేకాతో లెటర్ రాయించుకున్నామని.. తనకు ఈ డీల్‌లో రూ.కోటి అడ్వాన్స్ ఇచ్చారని.. సునీల్‌యాదవ్‌ తనకు డబ్బు ఇచ్చాడని ABNతో ఇంటర్వ్యూలో దస్తగిరి బయటపెట్టాడు. వివేకాను హత్య చేస్తే రూ.40 కోట్లు వస్తాయని ఎర్రగంగిరెడ్డి అన్నాడని, హత్య సమయంలో డిస్టబెన్స్ కావొద్దనే కుక్కను చంపామని వివేకా హత్య కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న దస్తగిరి ఏబీఎన్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఏం జరిగిందో పూసగుచ్చినట్లు వివరించాడు.

Updated Date - 2023-04-18T17:59:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising