Big Breaking : స్కిల్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ పొడగింపు
ABN, First Publish Date - 2023-10-19T13:07:34+05:30
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ పొడిగింపుపై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి...
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ పొడిగింపుపై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం చంద్రబాబు రిమాండ్‌పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. నవంబర్-01 వరకూ రిమాండ్ పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో టీడీపీ శ్రేణులు ఒకింత నిరాశ చెందాయి.
కోర్టులో ఏం జరిగింది..?
న్యాయమూర్తి : మీ ఆరోగ్యం ఎలా ఉంది..?
చంద్రబాబు : నాకు ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి
న్యాయమూర్తి : రాజమండ్రి సెంట్రల్ జైల్లో మెడికల్ టీం ఉందా..? ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారా..?
చంద్రబాబు : అవును చెకప్ చేస్తున్నారు
న్యాయమూర్తి : హెల్త్ రిపోర్టు సమాచారం మీకు అందుతోందా..?
చంద్రబాబు : అవును.. అందుతోంది
న్యాయమూర్తి : చంద్రబాబు మెడికల్ రిపోర్టులు అధికారులు ఎప్పటికప్పుడు కోర్టుకు అందజేయాలి
సీఐడీ, పోలీసులు : ..?
న్యాయమూర్తి : మీకు (చంద్రబాబు) ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా..?
చంద్రబాబు : జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత ఉన్న నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి
న్యాయమూర్తి : మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా... రాత పూర్వకంగా కోర్టుకు పంపండి.. వాటిని పరిశీలన చేసి... అవసరమైన ఆదేశాలు ఇస్తాం
చంద్రబాబు : అలాగేనండి.. తప్పకుండా..
న్యాయమూర్తి : ఇంకా ఏమైనా కోర్టుకు చెప్పదలుచుకున్నారా..?
చంద్రబాబు : నా ఆరోగ్యం, భద్రత అంశాలను పరిగణలోకి తీసుకోండి
న్యాయమూర్తి : హైకోర్టులో స్కిల్ కేసు పెండింగులో ఉంది.. రిమాండ్ పొడిగిస్తున్నాం
చంద్రబాబు : అలాగేనండి
చంద్రబాబుతో వర్చువల్‌గా సందేహాలు గురించి ఆరాతీసిన తర్వాత జైలు అధికారులతో న్యాయమూర్తి మాట్లాడారు. చంద్రబాబు రాసే సందేహాలకు సంబంధించి లేఖను తనకు పంపించాలని జైలు అధికారులను జడ్జి ఆదేశించారు.
Updated Date - 2023-10-19T13:36:58+05:30 IST