ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN Case : మళ్లీ హస్తినకు నారా లోకేష్.. చంద్రబాబుతో ములాఖత్ అయిన మరుసటిరోజే ఎందుకు..?

ABN, First Publish Date - 2023-10-07T11:46:02+05:30

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును (Nara Chandrababu) అక్రమంగా సీఐడీ అరెస్ట్ చేసిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) ఎలా మారిపోతున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా...

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును (Nara Chandrababu) అక్రమంగా సీఐడీ అరెస్ట్ చేసిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) ఎలా మారిపోతున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వైసీపీ గ్రాఫ్ (YSRCP Graph) ఎక్కడ్నుంచి ఎక్కడికి పడిపోయిందో అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే పలు ప్రముఖ సంస్థలు చేసిన సర్వేల్లో టీడీపీ గ్రాఫ్ (TDP Graph) ఊహించని రీతిలో పెరిగిపోయిందనే విషయం తేలిపోయింది. దీంతో వైసీపీ కంగుతిన్నది. అనవసరంగా చంద్రబాబును టచ్ చేశామా..? ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోయిందనే సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) సైతం ఆలోచనలో పడిన పరిస్థితి. ఇక అసలు విషయానికొస్తే.. ‘నాన్న నిర్దోషి’ అని నిరూపించడానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చేయాల్సిన కార్యక్రమాలన్నీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఒకసారి హస్తినకు వెళ్లొచ్చిన లోకేష్.. (Lokesh Delhi Tour) జాతీయ మీడియాతో వరుస ఇంటర్వ్యూలు, రాష్ట్రపతితో భేటీ, పలువురు ఢిల్లీ పెద్దలు, పలు పార్టీల అధినేతలు, ముఖ్యనేతలతో భేటీ అయ్యి ఏపీలో పరిస్థితులు, ప్రతిపక్షాలపై వైఎస్ జగన్ సర్కార్ (Jagan Govt) ప్రవర్తిస్తున్న తీరు, పార్లమెంట్‌లో ఎంపీలు మాట్లాడాల్సిన విషయాలపై దిశానిర్దేశం, చంద్రబాబు అక్రమ అరెస్టులపై నిశితంగా వివరించారు. దీంతో జాతీయ స్థాయిలో భారీగా చంద్రబాబుకు మద్దతు లభించింది.


మళ్లీ ఢిల్లీకి..!

మొదటిసారి ఢిల్లీకి వెళ్లినప్పుడే ఏ క్షణమైనా లోకేష్‌ను అరెస్ట్ చేస్తారని వార్తలు రావడం, తప్పించుకుని తిరుగుతున్నాడని, భయపడుతున్నారని.. వైసీపీ పుకార్లు సృష్టించడం ఇవన్నీ జరిగాయి. ఆఖరికి ఢిల్లీలో ఉండగానే సీఐడీ నోటీసులు ఇవ్వడం.. అక్టోబర్-10న (సోమవారం నాడు) విచారణకు ఇవ్వాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. అయితే.. లోకేష్ భయపడుతున్నారనే వార్తలతో ఆగ్రహానికి లోనైన రాజమండ్రికి వచ్చారు. ఆ మరుసటిరోజే రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. సుమారు 45 నిమిషాలపాటు జరిగిన ఈ ములాఖత్‌లో పలు విషయాలపై లోకేష్‌కు బాబు దిశానిర్దేశం చేసినట్లు తెలియవచ్చింది. అంతేకాదు.. బెయిల్ విషయంలో ఎలా ముందుకెళ్లాలి..? జాతీయ స్థాయిలో ఇంకా ఏమేం చేయాలి..? ఎవరెవరితో మాట్లాడాలి..? అచ్చు తప్పులు చేస్తున్న ప్రభుత్వ తీరును ఎలా ఎండగట్టాలి..? ఇలా అన్ని విషయాలపైనా చినబాబుకు బాబు పలు సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం. దీంతో ములాఖత్ అయిన మరుసటి రోజే బాబు చెప్పిన విషయాలన్నీ ఆచరణలో పెట్టడానికి రెండోసారి ఢిల్లీకి బయల్దేరుతున్నారు లోకేష్. శనివారం మధ్యాహ్నం రాజమండ్రి నుంచి ఢిల్లీకి లోకేష్ పయనమవుతున్నారు. రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి.. పదో తారీఖున నేరుగా విజయవాడలోని సీఐడీ ఎదుట విచారణకు హాజరవుతారని తెలుస్తోంది.

ఢిల్లీలో ఏం చేయబోతున్నారు..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో (Amit Shah) జరిగిన భేటీలో.. రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? బాబు అరెస్టు పర్యవసానాలపై జగన్‌తో చర్చించడం, అరగంటసేపు జరిగిన చర్చలో.. ఈ అరెస్ట్ వెనుక కేంద్రం హస్తం ఉందనే ఆరోపణలతో షా ఆందోళన చెందడం ఇవన్నీ జరిగాయి. అంతేకాదు అతి త్వరలోనే చంద్రబాబు అరెస్టుపై సీఐడీ, జగన్ ప్రభుత్వం నుంచి నివేదికలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో లోకేష్ ఢిల్లీకి వెళ్లడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు.. షాతో లోకేష్ భేటీ అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మరోవైపు.. చంద్రబాబు బెయిల్, నిర్దోషిగా బయటికి తీసుకురావడానికి న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. సోమవారం నాడు విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా చంద్రబాబు పిటిషన్లపై విచారణ జరగబోతోంది. బాబుకు అనుకూలంగానే తీర్పు వస్తుందని టీడీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అదేరోజే లోకేష్ సీఐడీ ఎదుట హాజరుకాబోతున్నారు. దీంతో అటు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ.. ఇటు లోకేష్ విచారణతో టీడీపీ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి


YS Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేక్.. వాట్ నెక్స్ట్..!?


KCR Health : కేసీఆర్‌కు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్..


YSRTP : వైఎస్సార్టీపీ విలీనంపై డైలామాలో షర్మిల.. సాయంత్రం ఏం ప్రకటన చేయబోతున్నారు..!?


Updated Date - 2023-10-07T11:51:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising