TS Polls : కాంగ్రెస్-సీపీఐ మధ్య కుదిరిన సయోధ్య.. డీల్ సెట్ చేసిన రేవంత్!!
ABN, First Publish Date - 2023-11-06T17:52:43+05:30
అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Polls) ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ (Congress).. ఇందుకు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సద్వినియోగం చేసుకుంటోంది. నిన్న మొన్నటి వరకూ సీపీఐ, సీపీఎం (CPI, CPM) పార్టీలు కాంగ్రెస్‌తో కటీఫ్ అయ్యి.. ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే...
అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Polls) ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ (Congress).. ఇందుకు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సద్వినియోగం చేసుకుంటోంది. నిన్న మొన్నటి వరకూ సీపీఐ, సీపీఎం (CPI, CPM) పార్టీలు కాంగ్రెస్‌తో కటీఫ్ అయ్యి.. ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. కొన్ని నియోజకవర్గాల్లో కమ్యునిస్టుల ప్రభావితం చేస్తారని విశ్వసించిన కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి.. సీపీఐతో సోమవారం నాడు చర్చలు జరిపింది. స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) సీపీఐ ఆఫీసుకు వెళ్లి.. కీలక నేతలు కూనంనేని సాంబ శివరావు, చాడ వెంకటరెడ్డిలతో చర్చలు జరిపారు. సుమారు గంటపైగా జరిపిన ఈ చర్చలతో కాంగ్రెస్‌తో పొత్తుపై సీపీఐ ఓకే అన్నది.
డీల్ ఇలా..!!
సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెంతో పాటు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం అంగీకారం తెలిపింది.ఈ చర్చల అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీపీఐతో కాంగ్రెస్ పార్టీ చర్చలు సఫలం అయ్యాయి. AICC ఆదేశాలతో చర్చలు జరిపామని.. చివరికి ఒప్పందానికి వచ్చామన్నారు. తమతో కలిసి నడవడానికి సీపీఐ సిద్ధమైందన్నారు. కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీచేస్తుందని.. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సీపీఐ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అధిష్టానం ఓకే అన్నది కానీ.. నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నెల క్రితం అలా.. ఇప్పుడిలా..!
ఈ చర్చల అనంతరం సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘నెల క్రితం నిచ్చితార్థం అయింది. ఇప్పుడు పెళ్లి ముహూర్తం కుదిరింది. కేసీఆర్ చేతిలో నుంచి తెలంగాణని విముక్తి చేయడం మా లక్ష్యం. ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పాలన బాగుంది. రాజకీయాలకు మతాన్ని జోడిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లీస్ మూడు ఒక్కటే. బీజేపీ, బీఆర్ఎస్ మద్య బంధం ఉంది కాబట్టే కవితని అరెస్ట్ చేయడం మానేశారు. బండి సంజయ్‌కు బండి కట్టి ఇంటికి పంపారు. కేసీఆర్ నియంతృత్వ పొకడకి వ్యతిరేకంగా పోరాడాలి. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఫామ్ హౌజ్ పాలనకి వ్యతిరేకంగా పోరాడాలి’ అని నారాయణ చెప్పుకొచ్చారు.
పొత్తు అనివార్యం..
మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు అనివార్యం అయిందన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సానుకూల పవనాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అనుకూల వాతావరణంను చూసి ఇతర పార్టీలు ఆర్టిఫీషియల్‌గా నడుచుకుంటున్నాయి. మునుగోడులో కూడా మేము బీజేపీని ఓడించడానికి పొత్తు పెట్టుకున్నాం. ప్రశ్నించే గొంతుక అసెంబ్లీలో ఉండాలి. తెలంగాణ ప్రజలు ఊపిరి పీల్చుకునే పరిస్తితి లేదు. తమ బాధలు చెప్పుకునే పరిస్తితి తెలంగాణలో లేదు. ప్రశ్నించే గొంతుకులను బీఆర్ఎస్ ప్రభుత్వం నొక్కేసింది. కేంద్రంలో నిరంకుశ పాలన ఉంటే అదే స్థాయిలో బీఆర్ఎస్ ఇక్కడ ఉంది. సీపీఎంతో కూడా ఏదో ఒక అవగాహన వస్తుందని అనుకుంటున్నాం. భవిష్యత్‌లో ఈ స్నేహం ఇలానే కొనసాగాలని అనుకుంటున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో కలిసి వెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది’ అని కూనంనేని చెప్పుకొచ్చారు.
మొత్తానికి చూస్తే.. సీపీఐ-కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరిందన్న మాట. అతి త్వరలోనే సీపీఎం నేతలతోనూ కాంగ్రెస్ హైకమాండ్, రేవంత్ రెడ్డి చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే 17 మంది అభ్యర్థులను, మేనిఫెస్టోను కూడా ప్రకటించిన పరిస్థితుల్లో కాంగ్రెస్ జరిపే చర్చలు ఏ మాత్రం వర్కవుట్ అవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
TS Elections : ఎన్నికల ముందు మాజీ మంత్రి రాజీనామా.. బీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్
Updated Date - 2023-11-06T17:58:01+05:30 IST