Ambati Rayudu In Politics : అంబటి రాయుడు కాదు బాబోయ్.. బూతుల రాయుడు.. ఇంత పచ్చిగానా.. ఓహో వైసీపీకి నచ్చింది ఇందుకేనా..?
ABN, First Publish Date - 2023-06-13T16:33:04+05:30
అవును.. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఒక్కసారిగా బూతుల రాయుడుగా మారిపోయాడు..! నడిరోడ్డుపై నానా రచ్చ చేసి ఓ పెద్దాయనపై దాడి చేయబోయాడు..! అంతటితో ఆగలేదు నోటికొచ్చినట్లు పచ్చి బూతులు మాట్లాడేశాడు..! ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) వేదికగా తెగ వైరల్ అవుతోంది...
అవును.. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఒక్కసారిగా బూతుల రాయుడుగా మారిపోయాడు..! నడిరోడ్డుపై నానా రచ్చ చేసి ఓ పెద్దాయనపై దాడి చేయబోయాడు..! అంతటితో ఆగలేదు నోటికొచ్చినట్లు పచ్చి బూతులు మాట్లాడేశాడు..! ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) వేదికగా తెగ వైరల్ అవుతోంది. రాయుడు ఇంతలా ఎందుకు రెచ్చిపోయాడు..? సామాన్యుడిపైన అది కూడా చిన్న, పెద్దా అని లేకుండా ఇంత అహంకారం ఎందుకు ప్రదర్శించాడు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
అసలేం జరిగిందంటే..?
అంబటి రాయుడు తన కారులో వెళ్తున్నాడు.. ఇంతలో ఏం జరిగిందనేది క్లారిటీగా తెలియట్లేదు కానీ.. ఒక్కసారిగా రెచ్చిపోయాడు. దారిలో వెళ్తున్న ఒక పెద్దాయన్ను బూతులు తిట్టాడు.. అంతటితో ఆగలేదు కారు దిగి మరీ పెద్దాయన్ను కొట్టబోయాడు. అక్కడున్న జనాలు అటు పెద్దాయన్ను.. ఇటు రాయుడిని ఆపడానికి యత్నించారు.. ఆపే కొద్దీ మరింత రెచ్చిపోయి అమ్మనా బూతులు తిట్టేశాడు. ఎంతలా తిట్టేశారంటే.. ఆ పదాలు రాయలేని పరిస్థితి. తనను తిట్టిన రాయుడిపై.. ఆ పెద్దాయన కూడా సహనం కోల్పోయి బూతులు తిట్టాల్సి వచ్చింది.! అరే.. ఒరే.. అమ్మా.. అని ఇద్దరూ తిట్టిపోసుకున్నారు. ఇదంతా మార్నింగ్ వాకింగ్ టైమ్‌లో జరుగుతున్నట్లు అక్కడున్న పరిస్థితులను బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. వాకింగ్ ట్రాక్ దగ్గర ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు.. అది కాస్త ఇంటికెళ్లే టైమ్‌లో కూడా తిట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే విషయం క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ వీడియో గతంలో ఎప్పుడో జరిగిందనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
వీడియోపై ఎందుకింత చర్చ..?
ఈ మధ్యనే క్రికెట్‌కు (Cricket) గుడ్ బై చెప్పేసిన రాయుడు.. రాజకీయాల్లో (Ambati Rayudu In Politics) వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అనుకుంటున్నాడు. వైసీపీలో చేరి గుంటూరు నుంచి ఎంపీగా (Guntur MP) పోటీచేస్తారని ఆ మధ్య ప్రచారం జరగ్గా ఇటీవలే సీఎం వైఎస్ జగన్ రెడ్డిని (CM YS Jagan Reddy) కలవడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది. రాజకీయాల్లో చాలా ఓపిక, సహనం.. అన్నింటికి మించి ప్రజలను మెప్పించి.. గెలిచిన తర్వాత అభివృద్ధి చేసి చూపించే గుణాలుండాలని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. కానీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోను బట్టి చూస్తే అవన్నీ అంబటికి అస్సలు లేనేలేవని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. విమర్శలు, ప్రతి విమర్శలు అంతకుమించి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తిట్లు చాలా కామన్ అయిపోయాయి. అయితే సెలబ్రిటీ అయ్యుండి.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రాయుడు ఇలా నడిరోడ్డుపై సామాన్యుడి పట్ల ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో చూసిన జనాలు.. ఈయన ‘అంబటి రాయుడు’ కాదు బాబోయ్ ‘బూతుల రాయుడు’గా మారిపోయాడేంటి..? అని ఆయన అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఈ వీడియోను టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అసలు ఇలాంటి వారు రాజకీయాల్లోకి రావడానికి అర్హులా..? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇందుకే వైసీపీకి నచ్చిందేమో..?
వైసీపీలో ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలకు బూతు నేతలు అని పేరుంది.. అందులో ఒకరు మాజీ మంత్రి.. మరొకరు ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.. వీరితో పాటు ఒకరిద్దరు బూతుల్లో పీహెచ్‌డీ చేశారనే విమర్శలు ప్రజలు, ప్రతిపక్షాల నుంచి బోలెడెన్ని సార్లు వచ్చాయి. ఇప్పుడు రాయుడు వైసీపీ (Rayudu YSRCP) కండువా కప్పుకోబోతుండటంతో వీడియో నెట్టింట్లో పోస్ట్ చేసి.. ‘చూశారుగా.. బూతులు మాట్లాడటంలో ఆరితేరిన వారంతా వైసీపీలోనే చేరతారు..’ అని సామాన్య ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీలోకి రావాలంటే ఇలా బూతులు మాట్లాడాలని తెలిసి.. రాయుడు ఇలా ప్రవర్తించి ఉండొచ్చని కొందరు.. ఇలా బూతులు మాట్లాడుతాడు కాబట్టే వైసీపీ అధిష్టానానికి రాయుడు నచ్చి ఉంటాడని మరికొందరు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడీయన వైసీపీలో చేరగానే బూతు నేతల జాబితాలోకి చేరుతారని.. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
మొత్తానికి చూస్తే.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఈ రేంజ్‌లో ఉంటే పూర్తిగా పాలిటిక్స్‌లోకి వస్తే బూతు రాయుడిని జనాలు భరిస్తారా..? అసలు ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావడం అవసరమా..? అని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా అసలు ఈ వీడియో ఎప్పటిది..? అసలేం జరిగింది..? అనే దానిపై రాయుడు ఇంతవరకూ స్పందించకపోవడం గమనార్హం.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
Janasena : జనసేన కండువా కప్పుకున్న ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. చేరిక సరే ఈసారైనా పోటీచేస్తారా..?
******************************
TS Congress : కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్న వేళ సీన్ రివర్స్.. ఎందుకిలా..?
******************************
Mudragada : రీ-ఎంట్రీకి సిద్ధమైన ముద్రగడ.. ఎంపీగా బరిలోకి దింపే యోచనలో వైసీపీ.. ఇంత నమ్మకద్రోహం చేసినా ఎందుకీ సాహసం..!?
******************************
TS Politics : రేవంత్ రెడ్డి సక్సెస్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కేసీఆర్ అత్యంత సన్నిహితుడు రాజీనామా..
*****************************
Updated Date - 2023-06-13T16:46:40+05:30 IST