TS Assembly Polls : ఇలాగైతే కష్టమే.. తెలంగాణ కీలక నేతలకు ‘షా’ స్ట్రాంగ్ వార్నింగ్
ABN, First Publish Date - 2023-09-17T17:01:23+05:30
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలవనివ్వకూడదని అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ (Congress, BJP) చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలవనివ్వకూడదని అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ (Congress, BJP) చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు, కమలనాథులు రాష్ట్రంలో పర్యటించడం, భారీ బహిరంగ సభలు పెట్టడంతో పొలిటికల్ హీట్ (Political Heat) పెరిగిపోతోంది.
ఏం జరుగుతోంది..?
తెలంగాణ విమోచన దినోత్వవం కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) .. రాష్ట్ర కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ముఖ్యనేతలు కిషన్ రెడ్డి (Kishan Reddy), ఈటల రాజేందర్ (Etela Rajender), బండి సంజయ్ (Bandi Sanjay), సునీల్ బన్సల్‌తో (Sunil Bhansal) షా సమావేశం అయ్యారు. ఎన్నికల నేపథ్యంలో నేతలకు షా దిశా నిర్దేశం చేశారు. అయితే.. శనివారం రాత్రి బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం కావడం.. మళ్లీ ఇవాళ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ కమలనాథుల్లో సఖ్యత లేదనే విషయంగా ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలే చెబుతాయి. దీంతో ఈ విషయాలన్నీ తెలుసుకున్న షా.. కీలక నేతలు కలసి ముందుకెళ్లకుంటే పార్టీకి నష్టమని వాటిల్లుతుందని.. పద్ధతి మార్చుకోవాలని షా సీరియస్‌గా చెప్పారు. మధ్యలో ఓ ముఖ్యనేత కలుగజేసుకుని అదేమీ లేదు సార్.. అని చెప్పే ప్రయత్నం చేయగా.. అన్నీ తెలుసు మరోసారి ఇలాంటి పరిణామాలు జరగొద్దని షా.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పడేశారట. మొత్తానికి చూస్తే.. నేతల మధ్య సమన్వయం పైనే అమిత్ షా ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు.
నివేదికపై చర్చ..
ఇటీవల 119నియోజవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు పర్యటించిన విషయం తెలిసిందే. 119మంది హైకమాండ్‌కు ఇచ్చిన నివేదికపై ముఖ్యనేతలతో షా చర్చించారు. అనంతరం ముఖ్యనేతలకు షా.. సలహాలు, సూచనలు చేశారు. చేరికలు సంగతేంటి..? అని షా ప్రశ్నించగా.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత భారీగానే చేరికలు ఉంటాయని ఈటల రాజేందర్ చెప్పినట్లు సమాచారం. సుమారు గంటపాటు జరిగిన సమావేశం ముగియడంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి షా తిరుగుపయనం అయ్యారు.
Updated Date - 2023-09-17T17:05:27+05:30 IST