ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics : పురంధేశ్వరి ఢిల్లీ టూర్‌తో ‘పొత్తు’ చర్చ.. శుభవార్తతోనే ఏపీకి వస్తారా..!?

ABN, First Publish Date - 2023-10-08T21:51:28+05:30

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) రోజుకో మలుపు తిరుగుతున్నాయి.! ఎన్నికలు రేపో.. మాపో అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి.! ముఖ్యంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) రోజుకో మలుపు తిరుగుతున్నాయి.! ఎన్నికలు రేపో.. మాపో అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి.! ముఖ్యంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.! బాబుతోరాజమండ్రి సెంట్రల్ జైలులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ములాఖత్ కావడం.. బయటికి వచ్చీ రాగానే టీడీపీతో కలిసి పొత్తుకు వెళ్తున్నట్లు ప్రకటించడంతో మరింత హాట్ టాపిక్ అయ్యింది. అదే మీడియా సమావేశం వేదికగా బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందని.. మూడు పార్టీలను ఒక్కటి చేసేలా ఢిల్లీలోని కమలనాథులతో కూడా మాట్లాడుతానని పవన్ చెప్పుకొచ్చారు కూడా. అంతేకాదు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలకుండా ఎందుర్కొంటామని కూడా స్పష్టం చేశారు సేనాని. దీంతో నాటి నుంచి నేటి వరకూ టీడీపీ-జనసేన రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ మధ్యనే సమన్వయ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని పవన్ ఫిక్స్ అయ్యారు.


అడుగులు ఎటు..!

పొత్తులో భాగంగా టీడీపీ-జనసేన కార్యక్రమాలు చురుగ్గా సాగిస్తుండటంతో ఇటు రాష్ట్రంలోని.. అటు కేంద్రంలోని కమలనాథులు ఆలోచనలో పడ్డారు. దీంతో ఆ రెండు పార్టీలతో కలిసి ముందుకెళ్లాలా..? లేకుంటే ఒంటరిగానే పోటీచేయాలా..? అసలు పవన్ ప్రకటనలను ఎలా తీసుకోవాలి..? అనే విషయాలపై ఇప్పటికే విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం జరిగిన రోజుల వ్యవధిలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి (Daggubati Purandeswari) ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో హుటాహుటిన ఆమె హస్తినకు వెళ్లారు. పొత్తుల విషయం తేల్చడానికే ఢిల్లీ పెద్దలు పిలిపించారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఒంటరిపోరా..? లేకుంటే టీడీపీ-జనసేనతో కలిసి ముందుకెళ్లాలా..? అనేది పురంధేశ్వరి పర్యటనతో తేలిపోతుందట. ఆదివారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో (Amit Shah) ఆమె భేటీ అయ్యారు. పొత్తుతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. సోమవారం నాడు బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో కూడా పురంధేశ్వరి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏం జరుగుతుందో..?

మొత్తానికి చూస్తే.. ఈ పర్యటనతో పొత్తుపై ఫుల్ క్లారిటీ వచ్చేయనుందని ఏపీ బీజేపీ శ్రేణులు కూడా చెప్పుకుంటున్నాయి. సోమువీర్రాజు (Somu Veerraju) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టీడీపీతో కలిసి నడిచేందుకు ఇష్టం లేదని.. వస్తే జనసేనతో కలిసి లేకుంటే ఒంటరిపోరేనని పలుమార్లు చెప్పుకొచ్చారు. అది అప్పడున్న పరిస్థితుల్లో ఆయన అన్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్‌లో చంద్రబాబు అరెస్ట్‌పై ప్రస్తావన రావడం.. ఈ అరెస్ట్ వెనుక కేంద్ర హస్తం ఉందనే వార్తలతో అమిత్ షా ఆందోళన చెందడం ఇవన్నీ చూస్తుంటే సైకిల్‌తో కలిసే కమలం అడుగులు ముందుకేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. పురంధేశ్వరి ఇటు ఏపీకి రాగానే పవన్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్తారని పెద్దలతో పొత్తులపై మాట్లాడి ఒప్పిస్తారనే చర్చ సైతం నడుస్తోంది. ఢిల్లీ నుంచి అధ్యక్షురాలు ఏం శుభవార్త పుట్టుకొస్తారో.. కమలనాథులు ఏం చెప్పి పంపుతారో చూడాలి మరి.

Judgement Day : చంద్రబాబు కేసులో రేపు ఏం జరగబోతోంది.. లోకేష్ ఏం చేస్తున్నారు.. సర్వత్రా ఉత్కంఠ..!


Updated Date - 2023-10-08T21:58:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising