ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HariramaJogaiah: ఏపీని జగన్‌ సర్కార్‌ దోచుకుంటోంది..జగన్‌ పోవాలి.. పవన్‌ రావాలి

ABN, First Publish Date - 2023-03-12T17:27:32+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JAGANMOHANREDDY)పై మాజీ మంత్రి హరిరామజోగయ్య (HariramaJogaiah) విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JAGANMOHANREDDY)పై మాజీ మంత్రి హరిరామజోగయ్య (HariramaJogaiah) విమర్శలు గుప్పించారు. జగన్‌ పోవాలి.. పవన్‌ రావాలి అనేదే కాపు సంక్షేమ సేన లక్ష్యమని ఆయన అన్నారు. కాపు సేన ఏ ఇతర కులాలకు వ్యతిరేకం కాదని, జనసేనతో కలిసి పనిచేయాలని తమ కోరిక అని హరిరామజోగయ్య తెలిపారు. ఏపీని జగన్‌రెడ్డి సర్కార్‌ దోచుకుంటోందని, నిరంకుశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని హరిరామజోగయ్య పిలుపునిచ్చారు. దీనిపై అందరూ ఐక్యతతో పోరాడాలని హరిరామజోగయ్య పేర్కొన్నారు.

ఇటీవల తాను మరణించైనా కాపులకు రిజర్వేషన్లు సాధిస్తానని హరిరామజోగయ్య (Chegondi Harirama Jogaiah) స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వానికి ఆయన ఓ సారి అల్టిమేటం కూడా జారీ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమరణదీక్షకు దిగారు. ఆయన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన అనేక పోరాట రూపాలను ఎంచుకుంటున్నారు. కాపులకు రిజర్వేషన్‌ (Reservation)పై జోగయ్య హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. కాపులకు రిజర్వేషన్‌పై న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటా కింద కాపులకు 5శాతం రిజర్వేషన్‌ ప్రత్యేకించాలని విజ్ఞప్తి చేశారు. కాపుల్లో వెనకబడినవారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాపులకు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద రిజర్వేషన్లు కల్పించకుండా.. సీఎం జగన్‌ అడ్డుపడుతున్నారని పిటిషన్‌లో హరిరామ జోగయ్య పేర్కొన్నారు.

అగ్రవర్ణాలకు కేటాయించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 5 శాతం కాపులకు ఇస్తూ గత ఏడాది డిసెంబరు 31లోపు ఉత్తర్వులు ఇవ్వాలని కోరినా స్పందన లేదని, దీనిపై జోగయ్య ఆమరణ దీక్షకు దిగారు. పోలీసు ఉన్నతాధికారులు జోగయ్యకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల ద్వారా ఆమరణ దీక్షపై పునరాలోచించాలని చెప్పి చూశారు. 86 ఏళ్ల వృద్ధాప్యంలో ఆమరణ దీక్ష వద్దని చెప్పినా జోగయ్య తన నిర్ణయం మారబోదని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పలు పార్టీలలోని కాపు సామాజికవర్గం సీనియర్‌ నాయకులు జోగయ్యను కలిసి జరిగే పరిణామాలపై చర్చించారు. అయినా దీక్ష నిర్ణయాన్ని విరమించుకోవడానికి జోగయ్య సేమిరా అన్నారు. పైగా తనను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారని ప్రకటించారు. దీంతో తన నివాసంలోనే జోగయ్య దీక్షకు దిగారు. హరిరామజోగయ్య పాలకొల్లులో చేపట్టిన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-03-12T17:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising