ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSRCP : ఏప్రిల్-3న ఏం జరగబోతోందో ఒక్కరోజు ముందే పూసగుచ్చినట్లుగా చెప్పేసిన పేర్ని నాని.. ఇదే నిజమైతే..!

ABN, First Publish Date - 2023-04-02T18:20:49+05:30

పేర్ని నాని (Perni Nani) మీడియా ముందుకొచ్చి.. అసలు ఏప్రిల్-03న ఏం జరగబోతోందనే విషయాలను ఒక్కరోజు ముందే పూసగుచ్చినట్లుగా చెప్పేశారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఏప్రిల్-3 వైసీపీకి బిగ్ డే (April-3 Big Day) .. ఈ రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బిగ్ డెసిషన్స్ తీసుకుంటారు.. ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి..? ఎవరెవర్ని పక్కనపెట్టాలనే విషయాలపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.. వీటన్నింటికీ మించి ఏపీ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై (Early Elections) కూడా ఇదే రోజున ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.. దీంతో పాటు మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Reshuffle) ఉంటుందని పక్కాగా ముగ్గురు, నలుగురు మంత్రుల పదవులు కూడా ఊడతాయి.. ఇవీ గత నాలుగైదు రోజులుగా అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో.. ఇటు సోషల్ మీడియాలో (Social Media) పెద్దఎత్తున వస్తున్న వార్తలు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇదిగో.. ఫలానా మంత్రులు కేబినెట్ నుంచి ఔట్ అవుతున్నారు.. వీరంతా కేబినెట్‌లోకి వస్తున్నారని జాబితా కూడా ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో వామ్మో.. ఏప్రిల్-3న అంతుందా..? అని వైసీపీ శ్రేణులే ఒకింత షాకయ్యాయి. పైగా వీటన్నింటికీ తోడు ఈ మధ్యనే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఒకరిద్దరు మంత్రులను క్యాంప్ ఆఫీసుకు పిలిపించి స్వయంగా జగన్ మోహన్ రెడ్డే మాట్లాడటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఇవాళ ఉదయం (ఏప్రిల్-2) వరకు కూడా రేపు ఏం జరుగుతుందనేది అటు ఎమ్మెల్యేలకు కానీ.. ఇటు మంత్రులకు గానీ ఎలాంటి సమాచారం లేదు. ఆదివారం మధ్యాహ్నం మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని (Perni Nani) మీడియా ముందుకొచ్చి.. అసలు ఏప్రిల్-03న ఏం జరగబోతోందనే విషయాలను ఒక్కరోజు ముందే పూసగుచ్చినట్లుగా చెప్పేశారు.

ఏప్రిల్-3న జరిగేది ఇదే..!

ఏప్రిల్-3న గడప గడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapa Ku Mana Prabutvam) కార్యక్రమంపై సమీక్ష మాత్రమే జరుగుతుంది. మంత్రి వర్గంలో మార్పు జరిగే ప్రసక్తే లేదు. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్‌తోనే ఎన్నికలు జరుగుతాయి. ఈ క్యాబినెట్‌తోనే 2024 ఎన్నికల్లో గెలుస్తున్నాం. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో రేటింగ్, వ్యూస్ కోసమే మంత్రివర్గంలో మార్పు అనే వార్తలు వస్తున్నాయి. పార్టీ ఇచ్చిన పని సక్రమంగా నిర్వర్తించకపోతే సీఎం వైఎస్ జగన్ కోప్పడకుండా ఎలా ఉంటారు..?’ అని నాని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు.. తమకు పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న టీడీపీ నేతల కామెంట్స్‌పై కూడా నాని రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలు టచ్‌లో ఉండటానికి ఇదేమైనా గేర్ బండా..? టచ్‌లో ఉంటే తీసుకుని వెళ్లండని పేర్ని సెటైర్లేశారు.

ముందస్తుపై కూడా..!

‘టీడీపీ వాళ్లు ఈ మధ్య.. వై నాట్ పులివెందుల అంటున్నారు. అలాంటి వారందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) పులివెందులలో (Pulivendula) పోటీ చేసే దమ్ముందా?. పులివెందుల నుంచి పోటీ చేస్తే మీరో, మేమో తేలిపోతుంది. ఎవరెన్ని చెప్పుకున్నా.. ఎన్ని అనుకున్నా.. 2024లో మళ్లీ జగన్ ప్రభుత్వమే రాబోతోంది. గత ఎన్నికల్లో ఐదేళ్ల పాలనకు ప్రజలు మాకు అవకాశం కల్పించారు. కచ్చితంగా 2024 మార్చి తర్వాతే ఎన్నికలు ఉంటాయి. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా కార్యకర్తలు కలిసిరావడంలేదు.. అందరూ వ్యతిరేకమైపోతున్నారు. ఎన్నికలు వస్తున్నాయని హడావుడి చేస్తే అయినా కార్యకర్తలు వస్తారేమోనని చంద్రబాబు ఆలోచనఅని నాని చెప్పుకొచ్చారు.

175 స్థానాల్లో పోటీచేసే దమ్ముందా..?

21 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగితే 4 గెలిచారు. ఈ మాత్రానికే ఎవరెస్ట్ ఎక్కినట్టుగా టీడీపీ భావిస్తోంది. ఇక జన్మలో గెలుపు చూడలేరనే భావనతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ సరే.. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా..?. అసలు, 175 నియోజకవర్గాల్లో (175 Assembly Constituencies) బరిలో దింపేందుకు అభ్యర్థులు ఉన్నారా?. టీడీపీకి 38 నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులే లేరు. 10 మందిని కలుపుకుంటే కానీ పోటీ చేయలేని పరిస్థితి చంద్రబాబుది. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా, ఎంతమందిని పోగేసుకొచ్చినా జగన్‌ను ఏమీ చేయలేరు. 175 నియోజకవర్గాల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు?. బీజేపీలో ఉండి టీడీపీ జెండా మోస్తున్న వారికి ఎన్ని సీట్లు ఇస్తున్నారు?. 2019లో బీజేపీ మ్యానిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తాం అన్నారు. తమ ప్రభుత్వం వస్తే కర్నూలు రాజధాని (Kurnool Capital) అని పవన్ గతంలో చెప్పలేదా..?. ప్రజల్లో ఎవరు ఏంటో తేల్చుకొనేందుకు సిద్దం. సినిమా డైలాగులు రాసుకొచ్చి మాట్లాడటం కాదు.. ప్రజల్లో పోటీకి సిద్దం కావాలి అని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు పేర్ని నాని సవాల్ విసిరారు.

మొత్తానికి చూస్తే.. వైసీపీ కీలక సమావేశానికి ముందురోజే అసలేం జరుగుతుందో పేర్ని నాని చెప్పేశారు. ఇదే నిజమైతే మాత్రం ఇప్పుడు జగన్ కేబినెట్‌లో ఉన్నవారంతా హ్యాపీగా ఫీలవుతారు. కానీ కాస్త అటు ఇటు జరిగితే మాత్రం పరిస్థితులు ఎలా ఉంటాయోనని అటు మంత్రుల్లో.. ఇటు ఎమ్మెల్యేల్లో టెన్షన్ అయితే మొదలైంది. వాస్తవానికి సీఎం వైఎస్ జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. అనూహ్యంగా ఎలాంటి సంచలన ప్రకటనలు చేస్తారో ఎవరికీ ఊహకు అందదు. మరి ఫైనల్‌గా సోమవారం నాడు ఏం జరుగుతుందో.. సమావేశంలో భాగంగా జగన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారో.. తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

****************************

ఇవి కూడా చదవండి

*****************************

YSRCP : ఏప్రిల్-3 చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు.. వైఎస్ జగన్ బిగ్ డెసిషన్స్ తీసుకుంటారా.. ఆ ఎమ్మెల్యేలకు ఊహించని ఝలక్ ఇవ్వబోతున్నారా..!?

******************************

Jagan Team 3.0 : వైఎస్ జగన్ కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు.. ఈసారి ఊహించని రీతిలో ట్విస్ట్‌లు ఉంటాయా..!?

******************************

Jagan Team 3.0 : ఏపీ కేబినెట్‌లో మళ్లీ మార్పులు.. ఆ ఇద్దరు మాజీ మంత్రులను తీసుకునే యోచనలో వైఎస్ జగన్..!

******************************


Updated Date - 2023-04-02T18:38:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising