Balineni Row : మరోసారి అసంతృప్తి వెళ్లగక్కిన బాలినేని.. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇస్తూనే వైఎస్ జగన్ గురించి ఇలా..!
ABN, First Publish Date - 2023-05-15T23:29:04+05:30
ఇప్పటికే ప్రోటోకాల్ వివాదం, కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామాతో నానా రచ్చ జరుగుతుండగా నిన్న, మొన్న ఏకంగా ఆయన పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా..
ప్రకాశం జిల్లా కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే ప్రోటోకాల్ వివాదం, కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామాతో నానా రచ్చ జరుగుతుండగా నిన్న, మొన్న ఏకంగా ఆయన పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించి పార్టీ మారే ప్రసక్తే లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చేసుకున్నారు. తాజాగా.. ఒంగోలు కాకుండా వేరే నియోజకవర్గం నుంచి పోటీచేస్తు్న్నారని సొంత పార్టీలోనే రూమర్స్ వచ్చాయి. దీంతో ఒంగోలు నియోజకవర్గానికి చెందిన అభిమానులు, అనుచరులు, ద్వితియ శ్రేణి నేతలు గందరగోళానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బాలినేని దీనిపై స్పష్టత ఇచ్చేందుకు మంగళవారం నాడు మీడియా మీట్ నిర్వహించి వివరణ ఇచ్చుకున్నారు.
అసలేం జరిగింది..!?
ప్రకాశం జిల్లా వైసీపీలో ఇంటిపోరు రోజురోజుకూ ముదురుతోందే తప్ప ఇప్పట్లో ఆగేలా లేదు. ఆ మధ్య సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డే స్వయంగా రంగంలోకి బాలినేనితో మాట్లాడినప్పటికీ ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు. అయితే బాలినేని ఇలా ఉండటానికి కర్త, కర్మ, క్రియ అంతా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అని శ్రీనివాస్ అభిమానులు, అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకూ పైన చెప్పిన వివాదాలే నడిచినా తాజాగా ఒంగోలు నియోజకవర్గం వదిలి.. గిద్దలూరు, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేస్తున్నట్లు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ తాను అంటే పడని వర్గం వారు ప్రచారం చేస్తున్నారన్నది బాలినేని వర్గం చెబుతున్న మాట. దీంతో మీడియా ముందుకు వచ్చిన బాలినేని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
ఎవరికీ భయపడను..!
‘ ఈ మధ్య అయిన వాళ్లే నాపై కుట్ర చేస్తున్నారని బాధపడ్డాను. నాకు అయినవాళ్లు లేరు గియిన వాళ్లు లేరు.. నాకు కావాల్సింది కార్యకర్తలే. మా నాయకుడు జగన్ ని తప్ప ఎవరినీ లెక్క చేయను. ఏ విషయంలోనూ నేను రాజీపడను. నేను మార్కాపురం, గిద్దలూరు, దర్శి వెళ్తానని.. అక్కడ్నుంచే పోటీచేస్తానని కొంత మంది మాట్లాడుతున్నారు. నేను రాజకీయ జీవితం ప్రారంభించింది ఒంగోలులోనే.. ఒంగోలులోనే ఉంటాను.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ్నుంచే పోటీచేస్తాను. వైఎస్ జగన్ బటన్ నొక్కి ప్రజలకు సేవ చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ నేను అహర్నిశలు శ్రమిస్తున్నాను. కార్యకర్తల్ని సొంతంగా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉంది. ఎన్నికలు అంటే నేను ఎప్పుడు సీరియస్ గానే ఉంటాను. నిరంతరం ప్రజల్లో ఉండి గెలుపునకు ప్రయత్నం చేస్తాన్నా. 1999 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎప్పుడు కూడా రాజీ లేని రాజకీయాలు చేశాను. నాకు అయిన వారే నన్ను రాజకీయంగా అణగ దొక్కెందుకు ప్రయత్నిస్తున్నారు. వారి కంటే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే నాకు ముఖ్యం. కార్యకర్తల కోసం ఎవరినైనా ఎదిరించేందుకు సిద్ధం. సీఎం జగన్ కూడా పార్టీ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి’ అని మరోసారి అసంతృప్తిగానే బాలినేని మాట్లాడారు.
మొత్తానికి చూస్తే.. బాలినేని తాజా కామెంట్స్‌తో ఈ ఎపిసోడ్ ఇంటితో ఆగేలా లేదని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా కార్యకర్తలను జగన్ పట్టించుకోవాలని వ్యాఖ్యానించడంతో ఈ కామెంట్స్ ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మీడియా ముందుకొచ్చినప్పుడల్లా ఏదో ఒక కామెంట్ చేస్తున్న బాలినేని విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో చూడాలి మరి..!
******************************
ఇవి కూడా చదవండి..
******************************
DK Vs Sidda For CM Chair : ఢిల్లీ వెళ్లకముందే.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ బాంబ్ పేల్చిన డీకే శివకుమార్.. ఈ ఒక్క మాటతో..
******************************
BJP Vs Congress : కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. రేవంత్ రెడ్డికి టచ్‌లో బీజేపీ ఎంపీ..!
******************************
Updated Date - 2023-05-15T23:32:59+05:30 IST