ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత సేఫ్.. ఎక్కడా కనిపించని పేరు.. క్లీన్ చిట్ వచ్చేసినట్లేనా..!?

ABN, First Publish Date - 2023-05-27T17:43:00+05:30

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) సేఫ్‌గా బయటపడినట్లేనా..? అతి త్వరలోనే కవితకు క్లీన్‌చిట్ కూడా వచ్చేస్తుందా..?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) సేఫ్‌గా బయటపడినట్లేనా..? అతి త్వరలోనే కవితకు క్లీన్‌చిట్ కూడా వచ్చేస్తుందా..? ఇన్నిసార్లు విచారించిన తర్వాత కూడా కవిత విషయంలో స్పష్టమైన ఆధారాల్లేవా..? ఈ స్కామ్‌లో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ మోత మోగగా.. ఇకపై ఎక్కడా కవిత పేరు వినిపించదు.. కనిపించదా..? అంటే తాజా పరిణామాలను కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇదే అక్షరాలా నిజమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంత సడన్‌గా ఢిల్లీ వేదికగా ఏం జరిగింది..? తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ఏంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం..

అసలేం జరిగింది..!?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుపై శనివారం నాడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అనుబంధ ఛార్జ్‌షీట్‌పై విచారణ జరిగింది. అయితే ఈ ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమనాదీప్ ధల్‌లపై అభియోగాలు మోపుతూ సీబీఐ పేర్కొంది. అయితే ఈ ఛార్జ్‌షీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడా కనిపించలేదు. కవిత విషయంలో దర్యాప్తు సంస్థల దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవా..? లేకుంటే మరేదైనా కారణమా..? అని ఢిల్లీ వేదికగా చర్చలు నడుస్తోంది. గతానికి భిన్నంగా సీబీఐ తాజా ఛార్జ్‌షీటులో ఎక్కడా కవిత పేరు కనపడలేదు. అయితే.. కవితను అన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ ఇప్పటివరకు సీబీఐ ప్రశ్నించిన వారి జాబితాలో కూడా కవిత పేరు లేకపోవడం గమనార్హం. దీంతో కవితకు దాదాపు క్లీన్ చిట్ వచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. మనీష్ సిసోడియా, అర్జున్ పాండే, బుచ్చిబాబు, అమన్‌దీప్ ధల్‌లకు మాత్రం ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్- 25న సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీట్‌ను ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్నది. ఇవాళ విచారణకు రాగా కవిత పేరు లేదనే విషయం వెలుగుచూసింది. సుదీర్ఘ విచారణ అనంతరం తదుపరి విచారణ జూన్-02కి కోర్టు వాయిదా వేసింది.

సీబీఐ ఛార్జ్‌షీటు‌లో కూడా లేదుగా..!

కాగా.. సుమారు 5,700 పేజీలతో రెండో ఛార్జ్‌షీటును సీబీఐ దాఖలు చేసింది. మొదటి ఛార్జ్‌షీటు నవంబర్-25న దాఖలు చేయగా.. ఆ తరువాత డిసెంబర్-11న కవితను హైదరాబాద్‌లో సీబీఐ ప్రశ్నించింది. ఇప్పటివరకు ప్రశ్నించిన 89 మంది వివరాలను ఛార్జ్ షీట్‌లో సీబీఐ ప్రస్తావించింది. అయితే.. కవిత పేరు ఎందుకు రాలేదు..? కవిత విషయంలో స్పష్టమైన ఆధారాల్లేవా..? లేకుంటే మరో కారణం ఏమైనా ఉందా..? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు.. మే-4న నాలుగో అనుబంధ అభియోగపత్రాన్ని ఈడీ దాఖలు చేసింది. 270 ప్రధాన పత్రాలు సుమారు రెండువేల అనుబంధ పేజీలతో నాలుగవ అదనపు ఛార్జ్‌షీటు ఈడీ దాఖలు చేసింది. అయితే దీనిపై మే-30న పరిగణనలోకి తీసుకోవడంపై ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వెలువరించనున్నది. ఈ రెండు ఛార్జ్‌షీట్లలోనూ ప్రధానంగా మనీష్ సిసోడియాపైనే సీబీఐ, ఈడీ అభియోగాలు నమోదు చేసింది. అయితే ఈడీ తాజా ఛార్జ్‌షీట్‌లోనూ కవితపై సర్వసాధారణ అభియోగాలనే మోపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో కవితను సీబీఐ, ఈడీ పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. నిందితులను కవిత కలిశారని.. సమావేశం కూడా అయ్యారని.. మాట్లాడారని ఇలా పలు అభియోగాలనే గతంలో దర్యాప్తు సంస్థలు మెపాయి. తాజా అభియోగపత్రంలో ఈడీ పునరుద్ఘాటించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇటు ఈడీ ఛార్జ్‌షీటులోనూ లేదు..!

అయితే.. ముడుపుల వ్యవహారానికి సంబంధించి కూడా ఈడీ ఛార్జ్‌షీటులో కవిత పేరు ఎక్కడా లేనట్లు విశ్వసనీయ సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ప్రశ్నించిన వారి జాబితాలోనూ లేని కవిత పేరు లేనట్లు సమాచారం. అయితే.. గతంలో మూడు సార్లు కవితను ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అదిగో అరెస్ట్ చేస్తారు.. ఇదిగో అరెస్ట్ చేస్తారని ఢిల్లీ వేదికగా అప్పట్లో హైటెన్షన్ వాతావరణమే నెలకొంది. కవిత పేరు పలుమార్లు ప్రస్తావించినప్పటికీ ఈడీ ప్రశ్నించిన వారి జాబితాలో కవిత పేరు లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయ్. నిందితులతో ఆమె పలుమార్లు హైదరాబాద్, ఢిల్లీలో సమావేశమయ్యారని.. తాను కవిత బినామీనని అరుణ్ పిళ్ళై కూడా చెప్పారనే సాధారణ అభియోగాలనే మరోసారి ఈడీ మోపినట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి చూస్తే.. అటు సీబీఐ, ఇటు ఈడీ ఛార్జ్‌షీటులో కానీ కనీసం విచారించిన వారి జాబితాలో కూడా కవిత పేరు రాకపోవడం పలు అనుమానాలకు తావిచ్చే విషయమని సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు కవిత సేఫ్.. అని బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. అయితే ఫైనల్‌గా కవిత విషయంలో సీబీఐ, ఈడీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి. ఒకవేళ క్లీన్ చిట్ ఇచ్చే పరిస్థితుంటే ఇన్నిరోజులు విచారణ పేరుతో ఇబ్బందిపెట్టిన కవితకు దర్యాప్తు సంస్థలు ఏం చెప్పబోతున్నాయన్నది కూడా ఆసక్తికర విషయమే.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Modi Vs Kcr : కర్ణాటక ఫలితాలు, గవర్నర్ వ్యవస్థను ప్రస్తావించి మరీ కేంద్రంపై కేసీఆర్ ఫైర్..

******************************

BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?

******************************

Jagan In YS Viveka Case : పెను సంచలనం.. వివేకా హత్యకేసులో సీఎం వైఎస్ జగన్ పేరు..

******************************

TS Politics : తెలంగాణ బీజేపీకి ఊహించని ఝలక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కీలక నేత.. స్క్రిప్ట్ మారుతోందే..!

******************************

Updated Date - 2023-05-27T17:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising