ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Big Breaking : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సునీతారెడ్డి

ABN, First Publish Date - 2023-05-10T19:04:59+05:30

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (YS Viveka Murder Case) కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే పలుమార్లు దేశ అత్యున్నత న్యాయస్థానం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (YS Viveka Murder Case) కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే పలుమార్లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును (Supreme Court) వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి (YS Sunitha Reddy) మరోసారి సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ఇలా జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి (Erra Gangi Reddy) బెయిల్ రద్దు ఉత్తర్వులలో షరతును సుప్రీంలో సునీతారెడ్డి సవాలు చేశారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు జులై-01న మళ్లీ విడుదల చేయాలని సీబీఐ కోర్టుకు ఉత్తర్వు ఇచ్చింది.

ఎందుకంటే..?

వివేకా హత్య కేసులో జూన్-30న దర్యాప్తు ముగించాలని సుప్రీం ఆదేశించినందువల్ల జులై-01న గంగిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. జులై-01న మళ్లీ బెయిల్‌పై గంగిరెడ్డిని విడుదల చేయాలన్న అంశంపై సునీత సుప్రీంను ఆశ్రయించారు. బెయిల్‌ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన ఉదంతాలున్నాయని, సాక్ష్యులను కూడా బెదిరించే అవకాశాలున్నాయని పిటిషన్‌లో సునీతారెడ్డి పేర్కొన్నారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పిటీషన్‌లో ఆమె రాసుకొచ్చారు. పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించగా వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో అనేదానిపై జనాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి..!

కాగా.. వివేకా కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి మే-05న కోర్టులో లొంగిపోయాడు. ఎర్ర గంగిరెడ్డికి జూన్- 2 వరకూ నాంపల్లి సీబీఐ కోర్టు రిమాండ్ విధించింది. గంగిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. వివేకాను హత్య చేస్తే నాలుగు కోట్లు ఇస్తామని దస్తగిరికి గంగిరెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. నాలుగు కోట్ల రూపాయల వ్యవహారం వెనుక భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ చేయనుంది. ఎర్ర గంగి రెడ్డి బెయిల్ పై బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో హైకోర్టు బెయిల్ రద్దు చేసింది. మరి కొద్ది సేపటిలో చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. ఎర్ర గంగి రెడ్డిని 72 సార్లు సీబీఐ విచారించింది. వివేకా హత్య కేసులో గంగిరెడ్డిని ఏపీ పోలీసులు 2019 మార్చి- 28న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 90 రోజులు గడచినా చార్జిషీట్‌ దాఖలు చేయకపోవడంతో అదే ఏడాది జూన్‌ 27న గంగిరెడ్డికి డీఫాల్ట్‌ బెయిల్‌ వచ్చింది.

రిమాండ్ పొడిగింపు..

కాగా.. వివేకా హత్యకేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల రిమాండ్‌ను కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. మే-10తో గతంలో విధించిన రిమాండ్ ముగియగా ఈ ఇద్దర్నీ సీబీఐ కోర్టు ముందు హాజరుపరచగా జూన్-02 వరకు రిమాండ్ పొడిగించింది. దీంతో మళ్లీ భాస్కర్ రెడ్డి, ఉదయ్‌లను చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు.వైఎస్ భాస్కర్ రెడ్డిని ఏప్రిల్-16న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Jaganannaku Chebudam : 1902కు కాల్ చేస్తే డైరెక్టుగా వైఎస్ జగనే మాట్లాడుతారని అనుకుంటున్నారా.. అయితే మీ కంటే..!

******************************

Nellore Politics : నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామం.. టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యేకు లైన్ క్లియర్..!

******************************

Telangana Election 2023 : రేవంత్ మాస్టర్ ప్లాన్.. ప్రియాంక పర్యటన ముగిసిన గంటల వ్యవధిలోనే.. ఇదేగానీ జరిగితే..!!

******************************

Updated Date - 2023-05-10T19:14:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising