ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Singareni Election: ఐఎన్‌టీయూసీని ఓడించారు సరే.. సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌ పరిస్థితి ఏంటి?

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:56 PM

సింగరేణి ఎన్నికల్లో మొత్తం 13 సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీకి మినహా ఇతర సంఘాలు ఒక్క డివిజన్‌ను కూడా దక్కించుకోలేకపోయాయి. మిగతా సంఘాల మాట ఎలా ఉన్నా బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌ కనుమరుగవ్వడం సింగరేణి వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సుదీర్ఘ వాయిదా అనంతరం ఎట్టకేలకు సింగరేణి ఎన్నికలు ముగిశాయి. ముందునుంచి ఊహించినట్టుగానే కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఎన్‌టీయూసీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మొత్తం 11 డివిజన్లలో ఐఎన్‌టీయూసీ 6, ఏఐటీయూసీ 5 డివిజన్లను గెలుచుకున్నాయి. 3 వేల పైచిలుకు మెజారిటీ సాధించిన ఏఐన్‌టీయూసీ గుర్తింపు సంఘంగా, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్‌టీయూసీ అవతరించాయి. బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌ పలు డివిజన్లలో మద్ధతు ఇవ్వడం ఏఐటీయూసీకి బాగా కలిసొచ్చింది. మెజారి సాధించడంలో దోహదపడింది. అయితే మొత్తం 13 సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ మినహా ఇతర సంఘాలు ఒక్కటంటే ఒక్క డివిజన్‌ను కూడా దక్కించుకోలేకపోయాయి. మిగతా సంఘాల మాట ఎలా ఉన్నా బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌ కనుమరుగవ్వడం సింగరేణి వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్‌ డివిజన్లలో, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోల్‌బెల్ట్‌ ప్రాంతం రామగుండం-1, రామగుండం-2 డివిజన్లలో ఏఐటీయూసీ విజయం సాధించింది. తద్వారా సింగరేణి కాలరీస్‌లో ఏడవ పర్యాయం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘనవిజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్‌, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, రామగుండం-3, భూపాలపల్లి డివిజన్లలో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. ఈ డివిజన్లలో టీబీజీకేఎస్‌ కనీసం ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఎక్కడా ప్రభావం కూడా చూపలేకపోయింది.


వ్యూహం సరే.. ఏం సాధించినట్టు?

సింగరేణి ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ మరింత బలపడుతుదని భావించిన బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించిన హస్తంపార్టీని మట్టి కరిపించడమే లక్ష్యంగా సింగరేణి ఎన్నికల చివరి క్షణంలో అడుగులు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కాదని పక్కకు నెట్టిన సీపీఐ అనుబంధ సంఘం ఏఎన్‌టీయూసీకి మద్ధతు తెలిపింది. కీలకమైన డివిజన్‌లలో మద్దతు ఇస్తున్నట్టు తీర్మానాలు కూడా చేశారు. దీంతో సింగరేణి ఎన్నికల్లో ఎర్రజెండా రెపరెపలాడడానికి సాయపడింది. ఇక్కడివరకు అంతా బాగానే అనిపిస్తున్నా బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌ సింగరేణిలో కనుమరుగైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2012, 2017 గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపు ద్వారా సుదీర్ఘకాలంపాటు గుర్తింపు సంఘంగా కొనసాగిన టీబీజీకేఎస్ ప్రస్తుత ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క డివిజన్‌ను కూడా దక్కించుకోలేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ఓడించాలనుకున్న బీఆర్ఎస్ లక్ష్యం నెరవేరి ఉండొచ్చు. కానీ ఆ పార్టీకి కలిగిన ప్రయోజనం ఏంటో ఆ పార్టీకే తెలియాలి.


నిజానికి టీబీజీకేఎస్‌ ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్య రీతిలో కనుమరుగైంది. ఎన్నికల్లో పోటీకి నామినేషన్‌ వేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో క్యాడర్‌లో నైరాశ్యం కనిపించింది. టీబీజీకేఎస్‌ నేతలు పెద్దగా ఆసక్తిని ప్రదర్శించలేదు. అధిష్ఠానం కలగజేసుకున్నప్పటికీ పెద్దగా స్పందన కనిపించలేదు. దీంతో చాలా మంది కీలక నేతలు ఆ సంఘానికి గుడ్‌బై చెప్పి ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీల్లో చేరారు. కొన్ని ఏరియాల్లో టీజీబీకేఎస్‌ నేతలు ఏఐటీయూసీకి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశారు. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో గనుల వద్ద ఎక్కడా కూడా గులాబీ జెండా కనిపించలేదు. ఆ సంఘం ఎన్నికల చిహ్నమైన బాణం గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించినవారు కూడా పెద్దగా కనిపించలేదు. దీంతో ప్రచారంలో కూడా గులాబీ జెండాల సందడి కనిపించలేదు.

నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం పొత్తుతో పోటీ చేసిన కాంగ్రెస్, సీపీఐ అనుబంధ సంఘాలు సింగరేణి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డాయి. ఇక పొత్తుకు సరేమిరా అన్న బీఆర్ఎస్ పార్టీనే ఇప్పుడు సీబీఐ అనుబంధ ఏఎన్‌టీయూసీకి మద్ధతు ప్రకటించడం ఆసక్తికర పరిణామమని సింగరేణి వర్గాలు చర్చించుకుంటున్నాయి. రానున్న రోజుల్లో సింగరేణిలో టీబీజీకేఎస్‌ భవితవ్యం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

Updated Date - Dec 28 , 2023 | 01:02 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising