Home » Singareni Election
మేజర్ మినరల్స్‌కు సంబంధించిన గనుల వేలంపై పీడముడి పడింది. కొన్ని గనుల వేలానికి కేంద్రం అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరేళ్లుగా ఎలాంటి స్పందనా లేదు. ఏదైనా మేజర్ మినరల్‌కి సంబంధించిన గనుల వేలం ప్రక్రియ చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గనుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది.
సింగరేణిలో కారుణ్య నియామకాల గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకాల ఉద్యోగార్థుల వయోపరిమితిని పెంచాలని కార్మికులు దీర్ఘకాలంగా కోరుతుండగా.. ఇటీవలే వారికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
సింగరేణి మాజీ సీఎండీ ఎన్ శ్రీధర్ (Sridhar) కు కేంద్ర ప్రభుత్వం (Central Govt) షాక్ ఇచ్చింది. ఎన్ఎండీసీ సీఎండీగా శ్రీధర్ నియామక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. గత ఏడాది మార్చి 18వ తేదీన పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ సెలక్షన్ బోర్డ్ సీఎండీ పోస్ట్ కోసం 7 మందిని ఇంటర్వ్యూ చేసింది.
సింగరేణి ఎన్నికల్లో మొత్తం 13 సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీకి మినహా ఇతర సంఘాలు ఒక్క డివిజన్‌ను కూడా దక్కించుకోలేకపోయాయి. మిగతా సంఘాల మాట ఎలా ఉన్నా బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ కనుమరుగవ్వడం సింగరేణి వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సాధారణ ఎన్నికలను తలపించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్త్ మధ్య లెక్కింపు జరుగుతోంది.
సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ సమాప్తమైంది. కాగా సాయంత్రం 4 గంటల సమయానికి 90 శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. పెద్ద సంఖ్యలో కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ నమోదయ్యిందనే వివరాలు అందాల్సి ఉంది.