ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Politics : బీఆర్ఎస్‌‌కు ఊహించని షాక్.. కాంగ్రెస్‌లోకి బిగ్ షాట్.. పార్టీలో చేరకముందే సర్వే చేయగా..?

ABN, First Publish Date - 2023-08-08T20:45:45+05:30

తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తున్నాయ్.. దీంతో ఏ పార్టీలో టికెట్లు (MLA Tickets) దొరుకుతాయ్..? ఏ పార్టీ తరఫున అయితే గెలిచే అవకాశాలున్నాయ్..? అని సర్వేలు (Surveys) చేయించుకొని మరీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు జంపింగ్‌లు షురూ చేశారు. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) ఈనెల 12న లేదా 13న 87 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితాను ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి...

తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తున్నాయ్.. దీంతో ఏ పార్టీలో టికెట్లు (MLA Tickets) దొరుకుతాయ్..? ఏ పార్టీ తరఫున అయితే గెలిచే అవకాశాలున్నాయ్..? అని సర్వేలు (Surveys) చేయించుకొని మరీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు జంపింగ్‌లు షురూ చేశారు. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) ఈనెల 12న లేదా 13న 87 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితాను ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరోవైపు.. 25 నుంచి 30 మంది సిట్టింగ్‌లను మార్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో పలువురు సిట్టింగ్‌లు, మాజీలు.. ఆఖరికి ఒకరిద్దరు మంత్రులు సైతం కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కొనుగోలు చేసిన సర్వేలో బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేత, బిగ్ షాట్‌ ఒకరు కచ్చితంగా గెలుస్తారని తేలిదంట. బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ తరఫున పోటీచేస్తే పరిస్థితేంటని మరోసారి సర్వేచేయగా విజయదుందుభీ మోగిస్తారని తేలిపోయిందట. సీన్ కట్ చేస్తే.. ఆ కీలక నేత కారు దిగి కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడానికి సిద్ధమైపోయారట.


ఇదీ అసలు కథ..!

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టికెట్లు వచ్చే పరిస్థితిలేని.. వేరే పార్టీలో నుంచి వచ్చిన సిట్టింగ్‌లను చూసిన అధికార పార్టీ నేతలు, మాజీలు జంపింగ్‌లకు సిద్ధమైపోయారని తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలక నియోజకవర్గమైన నకిరేకల్ (Nakrekal) మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని తెలియవచ్చింది. ఇటీవల సునీల్ కొనుగోలు (Sunil Kanugolu) చేసిన రహస్య సర్వేలో వేమల వీరేశం వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తేలిందట. అయితే.. ప్రస్తుతం ఆయన గులాబీ పార్టీలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమర్తి లింగయ్య కూడా కారెక్కారు!. ఈయన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి శిష్యుడు. అయినప్పటికీ ఆయన్ను కాదని నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్లు ప్రకటించి వెళ్లారు. ఏమాత్రం అభివృద్ధి చేశారనేది నియోజకవర్గ ప్రజలకే తెలియాలి మరి. ఈ ఎన్నికల్లో చిరుమర్తికే టికెట్ వచ్చే ఛాన్స్ ఉందట. ఈయనతో పాటు మరొకర్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే.. సరిగ్గా ఇదే టైమ్‌లో నకిరేకల్‌లో పరిస్థితేంటి..? కాంగ్రెస్ ఎన్నోస్థానంలో ఉంది..? ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు..? అని సర్వే చేయగా.. జనలంతా వీరేశంకే ఓటేశారట. ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడం.. కాంగ్రెస్ స్థానం కావడంతో ఈ పార్టీ తరఫున ఆయన పోటీచేస్తే మరింత మెజార్టీ పెరుగుతుందే కానీ తగ్గదని తేలిందట. అంటే.. కాంగ్రెస్ సర్వేలో బీఆర్ఎస్ నేతకు మార్కులు పడ్డాయన్న మాట.

ఏం జరుగుతుందో..!?

కాంగ్రెస్‌లో చేరే పరిస్థితి ఉందా..? అని జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు సంప్రదించగా.. టికెట్ హామీ ఇస్తే తప్పకుండా చేరుతానని తేల్చి చెప్పారట. ఇటు వీరేశం మనసులోని మాటను.. అటు సర్వేను అధిష్టానానికి సునీల్ కనుగోలు పంపగా.. యువనేత రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఢిల్లీ వేదికగా రాహుల్ సమక్షంలో లేదంటే నకిరేకల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. ప్రియాంక గాంధీ సమక్షంలో వీరేశం కండువా కప్పుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే అనుచరులు, అభిమానులు, ద్వితియశ్రేణి నేతలు, కార్యకర్తలతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. అక్కడ్నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ చేసుకునే పనిలో మాజీ ఎమ్మెల్యే ఉన్నారట. అయితే.. ఇదే నియోజకవర్గం నుంచి ఒకరిద్దరు నేతలు మాత్రం టికెట్ తమకు ఇచ్చి తీరాల్సిందేనని గట్టిగా పట్టు పడుతున్నారట. దీంతో రంగంలోకి దిగిన కోమటిరెడ్డి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట. ఆ మధ్య ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ నియోజకవర్గం ఖాళీగా లేదని.. అభ్యర్థులు ఫిక్స్ అయ్యారని వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారిదీశాయి. అయితే.. వీరేశంతో కలిపే ఆయన ఇలా అన్నారా..? లేకుంటే ఇలా ప్రయత్నం చేస్తున్నారని తెలిసే ఇలా అన్నారా..? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి చూస్తే.. పార్టీలో చేరకముందే చేసిన సర్వేలోనే ఈ రేంజ్‌లో ఫలితాలు వచ్చాయంటే.. ఇక అఫిషియల్‌గా కండువా కప్పుకొని బరిలోకి దిగితే పరిస్థితేంటో మరి. అయితే ఇంతవరకూ అటు వీరేశం గానీ.. ఇటు కాంగ్రెస్‌ కానీ ఎలాంటి సమాచారం బయటికి పొక్కనీవ్వట్లేదు. మరోవైపు.. ఢిల్లీ పర్యటనలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ చేరికల గురించే చర్చిస్తున్నట్లు తెలియవచ్చింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


YSRCP Targets Chiru : రీల్ ‘BRO’తో మొదలై ‘రియల్ బ్రో’ చిరు దగ్గర బ్లాస్ట్.. రేపొద్దున ఇదేగానీ జరిగితే వైసీపీ పరిస్థితి ఊహకందేనా..!?


Governor Vs KCR : అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు చెప్పి మరీ.. గవర్నర్‌పై కేసీఆర్ ఇంత అక్కసు వెళ్లగక్కారేంటో..!?


TS Politics : అసెంబ్లీలో కేసీఆర్ ఎన్నికల హామీలు.. అన్నీ శుభవార్తలే చెప్పిన సీఎం!


JP Looking At YSRCP : ‘జేపీ’ వైసీపీలో చేరుతున్నారా.. ఎంపీగా బరిలోకి దిగుతున్నారా.. ఇందులో నిజమెంత..!?


Delhi Ordinance Bill : ఢిల్లీ సర్వీసుల బిల్లు విషయంలో బీఆర్ఎస్, వైసీపీ పార్టీలు ఏ పక్షానికి ఓటేశాయంటే..!?


Punganuru Incident : చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి నిజ స్వరూపం ఇదీ.. ఈ యువకుడి మాటలు ఒక్కసారి విన్నారో..!




Updated Date - 2023-08-08T20:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising