ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS MLC Kavitha: అరెస్ట్‌పై కవితలో కలవరపాటు.. శాసనమండలిలో కనిపించిన ఈ దృశ్యాలే సాక్ష్యం..!

ABN, First Publish Date - 2023-02-12T15:55:07+05:30

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో (Delhi Liquor Scam) ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారా? వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు అరెస్ట్‌తో కవితలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో (Delhi Liquor Scam) ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారా? వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు (YCP MP Magunta Son) అరెస్ట్‌తో కవితలో గుబులు మొదలైందా..? అరెస్ట్ తప్పదని కవితలో భయం మొదలైందా..? ఈ కేసులో వరుసగా అరెస్టులు చేస్తున్న ఈడీ (Enforcement Directorate) దూకుడుతో బీఆర్‌ఎస్‌లో (BRS) కలవరం మొదలైందా..? శాసనమండలిలో కేటీఆర్ (KTR) మాట్లాడుతుండగా కవిత (Kavitha) ముభావంగా కనిపించడం ఆమెలో కలవరపాటుకు సంకేతమా..? లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ తప్పదా..? శాసనమండలిలో కేటీఆర్, కవిత అంత సీరియస్‌గా మాట్లాడుకుంది లిక్కర్ స్కాం కేసులో ఎలా ముందుకెళ్లాలనేనా..? ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు, తాజా అరెస్ట్‌లు, కవిత కలవరపాటుపై ప్రత్యేక కథనం.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆది నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినిపిస్తూనే ఉండటం, సోషల్ మీడియాలో కవిత అరెస్ట్ తప్పదని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో బీఆర్‌ఎస్‌లో కూడా కలవరపాటు మొదలైంది. కవితలో రేగిన కల్లోలం శాసనమండలి సాక్షిగా స్పష్టంగా కనిపించింది. శాసనమండలిలో కేటీఆర్, కవిత పక్కపక్కనే కూర్చుని సీరియస్‌గా మాట్లాడుకుంటున్న దృశ్యాలు లిక్కర్ స్కాం కేసులో కలవరపాటును బహిర్గతం చేశాయి. పైగా.. కేటీఆర్ శాసనమండలిలో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆ వెనుకే కూర్చున్న కవిత ఎంతో ముభావంగా కనిపించారు. ఆమె ముఖంలో భయం, తత్తరపాటు స్పష్టంగా కనిపించాయి.

న్యాయపరంగా ముందుకెళ్లి ఈ కేసు నుంచి ఎలా బయటపడాలనే కసరత్తు చేసిన కవితకు ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యేలా తాజా పరిణామాలు ఉండటంతో ఆమెలో ఆందోళన మొదలైందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఫిబ్రవరి 8న సీబీఐ అరెస్టు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబుకు సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. బుచ్చిబాబును 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించిన సీబీఐ శనివారం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టింది. జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధింపుతో పోలీసులు ఆయనను తిహార్‌ జైలుకు తరలించారు. ఈ పరిణామం.. లిక్కర్ స్కాం కేసులో అప్పటివరకూ ధీమాగా ఉన్న కవితలో నైరాశ్యానికి మరో కారణమైంది.

పైగా.. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ వైసీపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్‌రెడ్డి మాగుంటను శనివారం ఈడీ అరెస్టు చేసింది. అనంతరం ఢిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచింది. రాఘవ్‌ను దర్యాప్తు సంస్థ 10 రోజుల కస్టడీకి కోరగా అందుకు జడ్జి అనుమతించారు. రాఘవ్‌రెడ్డిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే సమయంలో ఆయన తండ్రి శ్రీనివాసులురెడ్డి కోర్టుకు వచ్చారు. కాగా, ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశాయి. వారిలో రాఘవ్‌ సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్‌ వ్యాపారి అభిషేక్‌ బోయినపల్లి, అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ పి.శరత్‌చంద్రారెడ్డి, ఆడిటర్‌ బుచ్చిబాబు ఉన్నారు. ఈ రెండు పరిణామాలు.. కవితకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్‌రెడ్డి ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మరోసారి ఆరోపించడం గమనార్హం. శ్రీనివాసులురెడ్డి, రాఘవ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, అరబిందో శరత్‌చంద్రారెడ్డిలతో కూడిన సౌత్‌ గ్రూప్‌ ద్వారా రూ.100 కోట్ల ముడుపులను ఆప్‌ నేతల తరఫున విజయ్‌నాయర్‌ స్వీకరించారని తెలిపింది. ఈ గ్రూప్‌నకు అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేసింది.

సౌత్‌ గ్రూప్‌ భాగస్వాములు ఆప్‌ నేతలతో కలిసి కుట్రకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఇందులో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన పెద్ద నాయకులు తమ ప్రమేయాన్ని గోప్యంగా ఉంచడానికి డమ్మీలను, ప్రాక్సీలను ప్రయోగించారని.. సౌత్‌ గ్రూప్‌ సభ్యులు, వారి ప్రతినిధులు తరచూ సమావేశం అవుతుండేవారని పేర్కొంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఎమ్మెల్సీ కవితలో అరెస్ట్‌పై కంగారు మొదలైందని బీజేపీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తోంది. ఏదేమైనా.. ఏపీ అధికార పార్టీ ఎంపీ కుమారుడి అరెస్ట్‌తో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ తప్పదన్న ప్రచారం మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌ అయింది.

Updated Date - 2023-02-12T15:55:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising