MLC Kavitha ED Enquiry : 10 గంటలపాటు ప్రశ్నల వర్షం.. ముగిసిన కవిత మూడోరోజు ఈడీ విచారణ.. ఏమేం అడిగారంటే..
ABN, First Publish Date - 2023-03-21T21:06:01+05:30
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) మూడో రోజు ఈడీ విచారణ (Kavitha Third Day ED Enquiry) ముగిసింది. మంగళవారం నాడు ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. మొత్తం 10 గంటలకు పైగా కవితను ఇవాళ కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కవితపై రెండోరోజు ఈడీ అధికారులు 20 ప్రశ్నలు సంధించగా.. ఇవాళ 15 ప్రశ్నలు అడిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈడీ విచారణ గంటలు గడుస్తున్న కొద్దీ బీఆర్ఎస్ క్యాడర్ టెన్షన్ అమాంతం పెరిగిపోయింది. ఆఖరికి కవిత ఈడీ కార్యాలయం నుంచి చిరునవ్వుతో బయటికి రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు హ్యాపీగా ఫీలయ్యాయి.
ఇవాళ ప్రశ్నలు ఇలా..!
కవిత, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు.. ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పేర్లున్న అందరి ఫోన్లు, కాల్ డేటాను ఇదివరకే ఈడీ సేకరించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎవరెవరు ఎన్ని ఫోన్లు వాడారు..? అనేదానిపై ఐఎంఈఐ నంబర్లతో సహా ఈడీ వివరాలు బయటపెట్టింది. దీంతో ఇవాళ ఆ ఫోన్లనే అధికారులకు అందజేయాలని కవితను సోమవారం నాడు ఈడీ అధికారులు ఆదేశించారు. దీంతో కవిత ఆ పది ఫోన్లను ఈడీకి సమర్పించారు. ఆ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాక.. అధికారులు అడిగిన ఫోన్లు ఇవేనా కాదా..? కవిత అవే ఫోన్లు తీసుకొచ్చారా..? లేదా అనేదానిపై ఇవాళ మొత్తం సెల్ ఫోన్ల గురించే విచారణ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే కొన్ని ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు.. ఈడీ అధికారుల దగ్గరున్న డేటాకు మ్యాచ్ కాలేదని తెలియవచ్చింది. కాగా.. సెప్టెంబర్ 2021 నుంచి ఆగస్టు 2022 వరకు కవిత 10 ఫోన్లు వాడినట్లు, ధ్వంసం కూడా చేసినట్లు ఈడీ అభియోగం ఉంది. ఈ కేసులో మొత్తం 36 మంది 170 ఫోన్లు మార్చారని ఈడీ అభియోగాలు ఉన్నాయి. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌లో కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ స్పష్టంగా తెలిపింది. అందుకే ఈడీ అభియోగం మేరకు కవిత 10 ఫోన్లను ఇవాళ అధికారులుకు ఇచ్చేశారు.
టెన్షన్.. టెన్షన్.. చివరికిలా..!
మంగళవారం ఉదయం 11.00 గంటలకే ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లారు. మొదట నివాసం దగ్గర ప్రెస్‌మీట్ ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో రద్దయ్యింది. నివాసం దగ్గర మీడియాకు ఈడీ అడిగిన మొబైల్ ఫోన్లను కవిత చూపించారు. ఆ తర్వాత ఈడీ కార్యాలయం దగ్గర కూడా మరోసారి మీడియాకు సీల్డ్ కవర్‌లో ఉన్న ఫోన్లను కవిత చూపించారు. ఆ తర్వాత మొదటి అరగంటపాటు వివరాలు నమోదు, సంతకాలు తీసుకున్నాక ఈడీ అధికారుల ఎదుట కవిత హాజరయ్యారు. 11.30 గంటల నుంచి సాయంత్రం 9.30 గంటలు దాటినా కవిత బయటికి రాకపోవడంతో హస్తిన వేదికగా హైటెన్షన్ నెలకొంది. ఇటు ఈడీ కార్యాలయంలో అసలేం జరుగుతోందో అర్థం కాక బీఆర్ఎస్ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అడ్వకేట్‌కు ఈడీ నుంచి పిలుపు రావడంతో కవితను అరెస్ట్ చేసేస్తారేమో అని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. చివరికి 9.30 గంటల ప్రాంతంలో కవిత బయటికి రావడంతో బీఆర్ఎస్ క్యాడర్ హ్యాపీగా ఫీలయ్యింది.
ఎప్పటికప్పుడు ఇలా..!
మరోవైపు.. ఈడీ కార్యాలయం ఏం జరుగుతోందని ఎప్పటికప్పుడు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న సీఎం కేసీఆర్ నివాసం నుంచి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు.. ఇతర ముఖ్యనేతలు ఎప్పటికప్పుడు తమ ప్రతినిధులను సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. ఆ విషయాలన్నీ కేసీఆర్‌కు మినిట్ టూ మినిట్‌లాగా అప్డేట్స్ ఇస్తున్నట్లు తెలియవచ్చింది. మరోవైపు.. కవితను అరెస్ట్ చేయొచ్చని ఇదివరకే మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ తర్వాత ఏం చేయాలి..? ఎలా ముందుకెళ్లాలి..? నిరసన కార్యక్రమాలు ఎలా చేపట్టాలి..? అనేదానిపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులకు ఇప్పటికే కేసీఆర్ కీలక ఆదేశాలు కూడా జారీచేసినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే.. మరో రెండ్రోజుల్లో కవితను సీబీఐ కూడా విచారించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ఢిల్లీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకూ మొత్తం మూడుసార్లు విచారించిన ఈడీ.. ఇక సీబీఐ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
MLC Kavitha ED Enquiry : ఎక్కడ చూసినా కవిత ఫోన్ల గురించే చర్చ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పాత కామెంట్స్.. అసలేమన్నారంటే..
******************************
MLC Kavitha ED Enquiry : కవిత మీడియాకు చూపించిన మొబైల్ ఫోన్లను కాస్త జూమ్ చేస్తే...!!
******************************
MLC Kavitha ED Enquiry : విచారణలో రివర్స్ అటాక్.. కవిత ప్రశ్నలకు ఈడీ అధికారులు నీళ్లు నమిలారా.. కొసమెరుపు ఏమిటంటే..!
******************************
Kavitha ED Enquiry : విచారణకు వెళ్లే ముందు ఈడీకి కవిత సంచలన లేఖ.. ఇందులో లాజిక్ ఏమిటంటే..?
******************************
Kavitha ED Enquiry : ఈడీ విచారణకు వెళ్తూ పాత ఫోన్లు చూపించిన కవిత.. బీఆర్ఎస్ శ్రేణుల్లో పెరిగిపోయిన టెన్షన్..
******************************
MLC Kavitha ED Enquiry : విచారణకు వెళ్లే ముందు కవిత కీలక సమావేశం.. ఈడీ ఆఫీసు చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు.. కీలక పరిణామాలుంటాయా..!?
******************************
Updated Date - 2023-03-21T21:44:12+05:30 IST