Delhi Liquor Case : ఈడీ నోటీసులొచ్చాక కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై ఫైనల్‌గా నిర్ణయమిదీ..!
ABN, First Publish Date - 2023-09-14T22:01:39+05:30
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కా్మ్ కేసు (Delhi Liquor Scam Case) రోజుకో మలుపు తిరుగుతోంది. గత కొన్నిరోజులుగా స్థబ్దుగా ఉన్న ఈ కేసును ఈడీ ఇప్పుడు పరుగులు పెట్టిస్తోంది. వీలైనంత త్వరగా ఈ కేసును పూర్తి చేయాలని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు త్వరలోనే కీలక వ్యక్తులను, ఇప్పటి వరకూ విచారించిన వారిని అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి..
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కా్మ్ కేసు (Delhi Liquor Scam Case) రోజుకో మలుపు తిరుగుతోంది. గత కొన్నిరోజులుగా స్థబ్దుగా ఉన్న ఈ కేసును ఈడీ ఇప్పుడు పరుగులు పెట్టిస్తోంది. వీలైనంత త్వరగా ఈ కేసును పూర్తి చేయాలని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు త్వరలోనే కీలక వ్యక్తులను, ఇప్పటి వరకూ విచారించిన వారిని అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పలువురు అప్రూవర్లుగా మారడం ఇందులో కీలకం. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. రేపు అనగా శుక్రవారం (సెప్టెంబర్-15న) నాడు విచారణకు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల (BRS MLC Kavitha) కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే.. కవిత విచారణకు హాజరు అవుతుందా లేదా అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
రియాక్షన్ ఓకేగానీ..!
నోటీసుల వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన కవిత.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలపై ఒకింత సెటైర్లేశారు. ‘మోదీ నోటీసు అందింది. రాజకీయ కక్షతోచేస్తున్న కుట్ర ఇది.. పెద్దగా వర్రీ కావాల్సింది కాదు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏదో ఒకటి చేయాలని లిక్కర్ కేసును మళ్లీ లేవనెత్తారు. గత ఏడాది కాలంగా విచారణ చేస్తున్నారు.. టీవీ సీరియల్ లాగా లాగుతున్నారు. మా లీగల్ టీమ్ దాన్ని చూసుకుంటుంది. లాయర్లు ఎలా చెబితే అలా చేస్తాను. మేం ఎవరికీ బీ-టీమ్ కాదు. తెలంగాణ ప్రజల ఏ టీమ్ మేము’ అని కవిత చెప్పుకొచ్చారు. ఇంతవరకూ అంతా ఓకేగానీ.. విచారణకు వెళ్తారా వెళ్లరా? అనేది మాత్రం చెప్పలేదు. విచారణకు వెళ్తే ఈసారి కచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని ఢిల్లీ వర్గాల సమాచారం. ఎందుకంటే ఇదివరకు విచారణకు వెళ్లినప్పుడే కవిత విషయంలో ఎలాంటి హై టెన్షన్ నెలకొందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు విచారణకు వెళ్లే యోచనలో కవిత లేనట్లు తెలిసింది. ఎందుకంటే.. ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలు ఉన్నందున విచారణకు వెళ్లే అవకాశాలు కనిపించట్లేదు. ఇప్పటికే ఈ నెల-19న హాజరయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే మాత్రం రాలేదు.
కేసీఆర్ ఏం చెప్పారు..?
ఈడీ నోటీసులు ఇచ్చిన సమయంలో కవిత నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు. అయితే.. రేపే విచారణ కావడంతో దీనిపై ఎలా ముందుకెళ్లాలి..? అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యి తర్వాత ఆయన ఆదేశాలని పాటించాలని కవిత భావించారట. దీంతో నేరుగా నిజామాబాద్ నుంచి ప్రగతి భవన్‌కు వెళ్లిన కవిత.. తన తండ్రితో భేటీ అయ్యారట. సుమారు 20 నిమిషాలపాటు నోటీసులపై ఎలా ముందుకెళ్లాలి..? రేపటి విచారణకు హాజరు కావాలా వద్దా..? అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.. దీనిపై ఎలా ముందుకెళ్లాలి..? అనేదానిపై నిశితంగా చర్చించారు. అనంతరం కీలక నిర్ణయమే తీసుకున్నారు.
ఢిల్లీకి కవిత లీగల్ సెల్..!
కేసీఆర్ సుదీర్ఘ భేటీ తర్వాత ఈడీ విచారణకు హాజరుకాకూడదని కవిత నిర్ణయించారు. శుక్రవారం నాడు కవిత లీగల్ సెల్ న్యాయవాదులు ఢిల్లీ వెళ్తున్నారు. ఈడీ అధికారులకు న్యాయవాదులు లేఖ అందించే అవకాశముంది. అయితే కవిత.. 19న కవిత ఈడీ ఎదుట హాజరుకాబోతున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే కవితను లిక్కర్ కేసులో మార్చి 16, 20, 21 తారీఖుల్లో కవితను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మొత్తం ఆరుగురు నిందితులు అప్రూవర్లుగా మారగా.. బుధవారం నాడే రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు. శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, దినోశ్ అరోరా, రామచంద్ర పిళ్లై అప్రూవర్లుగా మారారు. ఈ పరిస్థితుల్లో కవిత విచారణకు వెళ్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి
NCBN Arrest : చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. రేపు శుభవార్త ఉంటుందా..!?
Balakrishna : తగ్గేదేలే.. ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటే!
Luthra On CBN Case : కత్తి దూసి పోరాడాల్సిందే.. బాబు అరెస్ట్‌పై సిద్ధార్థ లూథ్రా ఆసక్తికర ట్వీట్
YSRCP Vs TDP : వై‘చీప్’ పాలిట్రిక్స్‌ను పసిగట్టిన టీడీపీ.. వ్యూహాత్మకంగా ‘లూథ్రా’ అడుగులు.. చంద్రబాబుకు బిగ్ రిలీఫ్!
Updated Date - 2023-09-14T22:03:50+05:30 IST