ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mulugu MLA Seethakka: ‘సీఎం అభ్యర్థి సీతక్క’.. ఈ ప్రచారం వెనుక ఇంత కథ ఉందా..?

ABN, First Publish Date - 2023-07-01T17:55:18+05:30

తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక మహిళా ఎమ్మెల్యే పేరు ఇటీవల ప్రముఖంగా వినిపిస్తోంది. ఆవిడే తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అని ప్రత్యర్థి పార్టీ బీఆర్‌ఎస్ సరికొత్త ప్రచారానికి కూడా తెరలేపింది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సందిగ్ధతను ప్రజల్లో గందరగోళంగా మార్చడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు (Telangana Politics) ప్రస్తుతం టీ.కాంగ్రెస్ (Telangana Congress) చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో పొంగులేటి (Ponguleti), జూపల్లి (Jupally) చేరికలు.. ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) బహిరంగ సభలు.. మరో వైపు భట్టి విక్రమార్క పాదయాత్ర.. ఇలా తెలంగాణ కాంగ్రెస్‌‌లో సందడి నెలకొంది. ఇదిలా ఉండగా.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక మహిళా ఎమ్మెల్యే పేరు ఇటీవల ప్రముఖంగా వినిపిస్తోంది. ఆవిడే తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అని ప్రత్యర్థి పార్టీ బీఆర్‌ఎస్ సరికొత్త ప్రచారానికి కూడా తెరలేపింది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సందిగ్ధతను ప్రజల్లో గందరగోళంగా మార్చడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా శ్రేణులు పనిగట్టుకుని మరీ తెరపైకి తీసుకొస్తున్న ఆ మహిళా ఎమ్మెల్యే మరెవరో కాదు. ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఈ ములుగు ఎమ్మెల్యేపై గతంలో ఇదే సోషల్ మీడియా వేదికగా ‘ఆవిడకు పబ్లిసిటీ పిచ్చి’ అని ప్రచారం చేసిన బీఆర్‌ఎస్ ఇప్పుడు ఆమె పేరును సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకొస్తూ కాంగ్రెస్‌లో అంతర్గత యుద్ధం రేగేందుకు వ్యూహ రచన చేసినట్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ముఖ్య నేతలతో రాహుల్‌గాంధీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీలో తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. ఇందులో మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలు మధుయాష్కి గౌడ్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, దామోదర్‌ రాజనర్సింహ పాల్గొన్నారు.

ఇలా తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించిన కీలక సమావేశాలకు సీతక్కకు ఆహ్వానం అందుతుండటాన్ని, రేవంత్‌ రెడ్డితో ఉన్న అన్నాచెల్లెలి అనుబంధాన్ని సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ హైలైట్ చేసింది. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీకి కూడా సీతక్క ప్రీతిపాత్రురాలని బీఆర్‌ఎస్ చెప్పుకొచ్చింది. గిరిజన ఎమ్మెల్యే కావడం కూడా సీతక్కకు కలిసొచ్చే అంశమని సామాజిక వర్గ సమీకరణలను కూడా బీఆర్‌ఎస్ తెరపైకి తీసుకురావడం కొసమెరుపు. ఇలా తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి సీతక్క అని చెప్పడానికి అనేక కారణాలున్నాయని సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ జోరుగా ప్రచారం చేస్తుండటం గమనార్హం. సీతక్క ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అభద్రతా భావాన్ని రేకెత్తేలా చేయడమే బీఆర్‌ఎస్ అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది.

కాంగ్రెస్ నేతలందరినీ కలుపుకుని పోవడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్న, కొంత సఫలమైన ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రచారాల ద్వారా కాంగ్రెస్ నేతల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బకొట్టే వ్యూహాన్ని ఒక రాజకీయ పార్టీగా బీఆర్‌ఎస్ అవలంబిస్తుండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చేరికలతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ నెలకొన్న ఈ తరుణంలోనే బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ‘సీతక్క సీఎం అభ్యర్థి’ అనే ఒక ప్రచారాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొచ్చిందని అంచనా వేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్‌ఎస్ మైండ్‌గేమ్ మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనేది జగమెరిగిన సత్యం. అయినా ఎన్నికల్లో గెలిచాకే ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు మొదలుపెడుతుందని ఇటీవల కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్పష్టమైంది. తెలంగాణలోనూ కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి దాదాపుగా అదే. ప్రత్యర్థి పార్టీల వ్యూహాల్లో భాగంగా అప్పటివరకూ ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-01T17:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising