ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని పరిణామం.. ఈ దెబ్బతో ఏమవుతుందో..?

ABN, First Publish Date - 2023-08-28T21:50:00+05:30

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) కేసు కీలక మలుపు తిరిగింది..

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) కేసు కీలక మలుపు తిరిగింది. ఈడీ (ED) అసిస్టెండ్ డైరెక్టర్ పవన్ ఖత్రీపై (Pawan Khatri) సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. లిక్కర్ కేసు విచారణలో (ED Enquiry) నిందితుడు అమన్‌సింగ్ ధల్ (AmanSingh Dhall) నుంచి రూ. 5 కోట్లు లంచం తీసుకున్నట్లు సీబీఐ అభియోగాలు మోపింది. మనీలాండరింగ్ వ్యాపారి అమన్‌దీప్ నుంచి ముడుపులు తీసుకున్నట్లు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఎయిరిండియా ఉద్యోగి దీపక్ సంగ్వాన్‌తో పాటు.. క్లారిడ్జెస్ హోటల్ సీఈవో విక్రమాదిత్యపై కూడా సీబీఐ కేసులు నమోదు చేసింది. వీరంతా నేరుపూరిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. పవన్‌కు లంచం, ఇతరత్రా ఇచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ అధికారులు వెల్లడించారు. లిక్కర్ కేసులో ఇది కొత్తకోణమే అని చెప్పుకోవచ్చు.


అనూహ్య పరిణామం..

వాస్తవానికి.. చాలారోజులు లిక్కర్ కేసు స్థబ్దుగా ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్య కొందరి పేర్లు ఈడీ దర్యాప్తు, సీబీఐ దర్యాప్తు తీసేశారన్న వార్తలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అంతేకాదు.. ఇక ఈ కేసు మూలన పడిందనుకున్న సమయంలో ఒక్కసారిగా ఈడీ అధికారులు లంచం తీసుకున్నట్లు సీబీఐ తేల్చడం అనూహ్య పరిణామమే. దీంతో కేసు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది. ఇప్పటి వరకూ ఐదు కోట్లు మాత్రమే ముడుపులు తీసుకున్నట్లు అభియోగాలు రాగా.. మున్ముందు పవన్‌ను సీబీఐ విచారిస్తే ఇంకెన్ని బయటపడతాయో అనే ఆరోపణలు లేకపోలేదు. త్వరలోనే కేసు నమోదు చేసిన వారందర్నీ సీబీఐ అధికారులు విచారణకు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోతుగా విచారిస్తే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఇంత ఎంతమంది ఉన్నారనే కీలక విషయాలు బయటికి వస్తాయని సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం.

ఎలా బయటపడింది..?

లిక్కర్ పాలసీ విచారణ సందర్భంగా.. కేసులో నిందితుడైన అమన్‌ ధల్, అతని తండ్రి బీరేందర్ పాల్ సింగ్ రూ. 5 కోట్ల లంచం ఇచ్చినట్లు ఫిర్యాదు చేయడంతో ఈ తతంగం బయటపడింది. నిందితుల జాబితా నుంచి అమన్‌దీప్‌ పేరును తొలగించడానికి చార్టడ్ అకౌంటెంట్ ప్రవీణ్ వాట్స్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఖత్రీని 2022 డిసెంబర్‌లో దీపక్ సంగ్వాన్ పరిచయం చేశారని సమాచారం. వీరంతా వసంత్ విహార్‌లోని ఐటీసీ హోటల్ వెనుక పార్కింగ్ స్థలం కలుసుకున్నట్లు తెలియవచ్చింది. అక్కడే సంగ్వాన్, ఖత్రీలకు అమన్‌దీప్ నుంచి తీసుకున్న రూ. 50 లక్షలు అడ్వాన్స్‌‌గా ఇచ్చినట్లు తేలిందని సమాచారం. ఈడీ దర్యాప్తును సీబీఐకి అప్పగించడంతో ఈ వ్యవహారాలన్నీ బయటపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి


BRS First List : 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. గెలుపు వ్యూహాల్లో ఉన్న కేసీఆర్‌కు అనూహ్య పరిణామం


KCR Revenge Politics : బీఆర్ఎస్‌ను వీడుతానన్న రేఖా నాయక్.. గంటలోపే కేసీఆర్ సర్కార్ ఝలక్


Jagan London Tour : విదేశీ పర్యటన అనుమతి కోసం హైకోర్టులో జగన్, విజయసాయి పిటిషన్.. ఎల్లుండి ఏం జరుగుతుందో..?



Updated Date - 2023-08-28T21:54:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising