CM Jagan: జగన్ కళ్లు చల్లబడ్డాయా? ముసిముసినవ్వుల అర్థం అదేనా?
ABN, First Publish Date - 2023-09-28T14:18:44+05:30
తనకు నచ్చని వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే చూసి పరమానందం పొందడం కొందరినైజం!. ప్రత్యర్థుల కష్టాలనే సంతోషకర క్షణాలను భావించి మురిసిపోతూ ముసిముసి నవ్వులు చిందిస్తుంటారు!. గత రెండు రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రవర్తిస్తున్న తీరుని గమనిస్తే ఆయన కూడా ఈ వర్గానికే చెందుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే..
తనకు నచ్చని వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే చూసి పరమానందం పొందడం కొందరినైజం!. ప్రత్యర్థుల కష్టాలనే సంతోషకర క్షణాలను భావించి మురిసిపోతూ ముసిముసి నవ్వులు చిందిస్తుంటారు!. గత రెండు రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రవర్తిస్తున్న తీరుని గమనిస్తే ఆయన కూడా ఈ వర్గానికే చెందుతారనే అభిప్రాయాలు కలగక మానవు. జగన్ ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలను ఎగతాళి చేస్తూ మాట్లాడడం... అది విని సీఎం జగన్ సంతోషంతో మురిసిపోవడమే ఇందుకు కారణమవుతోంది. గతంలోనూ పలు అసెంబ్లీ సెషన్లలో ఇలాంటి దృశ్యాలే ఆవిష్కృతమైనప్పటికీ ఈసారి పాలకపక్ష అధినేత ఇంకాస్త సంతోషంగా కనిపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత రెండు మూడు రోజులు అసెంబ్లీలో కనిపించిన దృశ్యాలే ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
రాజధాని అమరావతి, ఇన్నిర్ రింగ్ రోడ్ అక్రమ కేసులపై మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడడం.. అది విని జగన్మోహన్ రెడ్డి నవ్వడం గడిచిన రెండు రోజులు అసెంబ్లీలో ఈ తరహా దృశ్యాలే కనిపించాయి. అధినేత మెప్పు పొందేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతినేత చంద్రబాబు, లోకేష్‌పై ఆరోపణలు గుప్పించడం స్పష్టం అర్థమైంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి మంత్రులు మాట్లాడినప్పుడల్లా సీఎం జగన్ చప్పట్లతో మరింత ప్రోత్సహిస్తున్నట్టు కనిపించారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, ధర్మాన ప్రసాదరావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడిప్పుడు సీఎం జగన్ పగలబడ నవ్వుతూ కనిపించారు. సంతోషంతో పొంగిపోతున్న హావభావాలను ఆయన ప్రదర్శించారు. ఇక అసెంబ్లీ సమావేశాలు రోజులు తరబడి కొనసాగినా సీఎం జగన్ ఒక్కసారి కూడా నోరువిప్పలేదు. ఏ అంశంపైనా మాట్లాడలేదు. చంద్రబాబు అరెస్టుపై మాట్లాడుతారమోనని ఆ పార్టీ వర్గాలు కూడా భావించినా అలా జరగలేదు. చంద్రబాబుపై సానుభూతి పెరుగుతున్న వేళ మాట్లాడకపోవడమే మంచిదని భావించారేమోనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్య కారణాలతో మాట్లాడడంలేదని పైపైకి అందరినీ నమ్మించారనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.
రాష్ట్రంలోని సమస్యలు, సవాళ్లపై కూలంకశంగా చర్చించి, పరిష్కారాలు కనుగొనాల్సిన చోటును ముఖస్తుతి, వెకిలి నవ్వులకు కేంద్ర స్థానంగా మార్చేశారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ప్రజాధనంతో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలను వృథా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అడ్డుతగులున్నారనే కారణంతో విపక్ష సభ్యులను సస్పెండ్ చేసి ఇష్టానుసారం వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది. పసలేని, అసలేమీ లేని అమరావతి, ఇన్నిర్ రింగ్ రోడ్ కేసులంటూ అంటూ సభాసమయాన్ని ఉపయోగించలేకపోయారని జనాలు తిట్టిపోస్తున్నారు. చంద్రబాబు అక్రమంగా అరెస్టవ్వడంతో కళ్లు చల్లబడ్డాయా? నవ్వులు, మురిసిపోవడాలే ఇందుకు సంకేతమా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి జగన్ అండ్ కో వైఖరిలో మార్పు ఎప్పుడొస్తుందో వేచిచూడాలి.
Updated Date - 2023-09-28T14:28:58+05:30 IST