YSRCP Meeting : టెన్షన్ టెన్షన్‌గా కీలక సమావేశానికి వెళ్లిన ఎమ్మెల్యేలు.. టికెట్లు ఎవరెవరికో తేల్చి చెప్పేసిన సీఎం జగన్..
ABN, First Publish Date - 2023-04-03T18:24:23+05:30
సమావేశంలో ఏం జరిగింది..? వైఎస్ జగన్ ఏమేం మాట్లాడారు..? ఎమ్మెల్యే టికెట్లపై ఏం చెప్పారు..? జగన్ కామెంట్స్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా ఫీలయ్యారు..? అనే విషయాలపై ప్రత్యేక కథనం..
అవును.. 20 నుంచి 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) టికెట్లు ఇవ్వట్లేదు.. ఏప్రిల్-3న ఎవరెవరికి టికెట్లు.. ఎవరెవరికి హ్యాండిస్తారనే దానిపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.. మంత్రివర్గ విస్తరణ ( AP Cabinet Reshuffle) కూడా ఉంటుంది.. ఇదిగో ఫలానా వారు కేబినెట్ నుంచి ఔట్ అవుతారు.. కేబినెట్‌లోకి ఇన్ అయ్యేది వీళ్లేనంటూ కొందరి పేర్లతో జాబితాను కూడా ఇదే.. ఇవీ వైసీపీ కార్యకర్తలు, కొందరు నేతలు సోషల్ మీడియా (Socail Media) వేదికగా చేసిన కామెంట్స్. అటు సోషల్ మీడియాలో సొంత పార్టీ శ్రేణులు.. ఇటు మీడియాలో వస్తున్న వార్తలతో ఏప్రిల్-3న ఏం జరుగుతుందో.. జగన్ నుంచి ఏమేం ప్రకటనలు వినాల్సి వస్తుందో అని వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ టెన్షన్‌గానే తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన గడపగడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Prabhutvam) వర్క్ షాప్‌నకు హాజరయ్యారు. అసలు సమావేశంలో ఏం జరిగింది..? వైఎస్ జగన్ ఏమేం మాట్లాడారు..? ఎమ్మెల్యే టికెట్లపై ఏం చెప్పారు..? జగన్ కామెంట్స్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా ఫీలయ్యారు..? అనే విషయాలపై ప్రత్యేక కథనం..
జగన్ ఏమన్నారు..?
గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఈ సమావేశంతో జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ‘60 మందికి నేను ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వట్లేదని రూమర్స్ వస్తున్నాయి. నేను రిలీజ్ చేయని లిస్టు కూడా తయారుచేస్తున్నారు. ఇదే పనిగా పెట్టుకుని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇంత కంటే దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని కూడా ప్రచారం చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంతకు మించి ఉంటాయి. రూమర్లు వస్తున్నాయనే మాట మనకు తెలిసి ఉండాలి. వాటిని తిప్పికొట్టాలి. సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం. కేడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి. రాజకీయాల్లో నేను నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే రాజకీయం అంటే మానవ సంబంధాలు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను. ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోను. మీతో పనిచేయించి మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ కార్యక్రమాలు. ఈ అడుగులన్నీ కూడా దానికోసమే. సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలి. సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలి. గృహసారథులను, సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను పూర్తి చేసుకోవాలి’ అని ఈ సమావేశంలో సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల రియాక్షన్ ఇదీ..!
జగన్ ఏం ప్రకటనలు చేస్తారో.. ఆయన దగ్గర ఏమేం నివేదికలు ఉన్నాయో అని చాలా మంది ఎమ్మెల్యేలు టెన్షన్ టెన్షన్‌గా సమావేశానికి హాజరయ్యారు. అయితే.. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోనని జగన్ చెప్పడంతో సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలంతా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నంత శాసన సభ్యుల ముఖాల్లో చిరునవ్వు కనిపించాయి. కొందరు ఎమ్మెల్యేలు అయితే చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా కనిపించారు. హమ్మయ్యా.. ఇప్పటికైతే తామంతా సేఫ్ జోన్‌లోనే ఉన్నామంటూ ఎమ్మెల్యేలు ఊపిరిపీల్చుకున్నారు. ఎంత టెన్షన్ టెన్షన్‌గా ఎమ్మెల్యేలు సమావేశానికి వెళ్లారో బయటికొచ్చేటప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీలవుతూ వచ్చారు.
మొత్తానికి చూస్తే.. ఎమ్మెల్యేలంతా ఇప్పటికైతే హ్యాపీ. వైఎస్ జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ ఊహకందని విషయం. దీంతో ఎన్నికల సీజన్ ప్రారంభమయ్యే సరికి జగన్ ఏం బాంబ్ పేల్చుతారో అనే టెన్షన్ మాత్రం ఎమ్మెల్యేల్లో అలానే ఉందట. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.
******************************
ఇవి కూడా చదవండి
******************************
YSRCP Meeting : ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ కీలక సమావేశం తర్వాత.. బొత్సపై ఏబీఎన్ ప్రశ్నల వర్షం.. మంత్రి రియాక్షన్ చూశారో...!
******************************
YSRCP : ప్రత్యక్ష రాజకీయాలకు చెవిరెడ్డి గుడ్ బై.. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు.. ఓహో ఇందుకేనా..!?
*****************************
YSR Congress : ఎంపీ విజయసాయిరెడ్డి అవసరం ఇక వైసీపీకి లేదా.. వరుస ఝలక్‌లతో YS Jagan ఇస్తున్న సంకేతాలేంటి.. ఆ ఒక్క ఘటనతో..!?
****************************
YSRCP : వైసీపీ ఎమ్మెల్యేల్లో నరాలు తెగే ఉత్కంఠ.. సరిగ్గా ఇదే టైమ్‌లో సంచలన ప్రకటన చేసిన చెవిరెడ్డి.. ఇంత ధైర్యమేంటో..!?
*****************************
YSRCP : ఏప్రిల్-3న ఏం జరగబోతోందో ఒక్కరోజు ముందే పూసగుచ్చినట్లుగా చెప్పేసిన పేర్ని నాని.. ఇదే నిజమైతే..!
*****************************
YSRCP : ఏప్రిల్-3 చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు.. వైఎస్ జగన్ బిగ్ డెసిషన్స్ తీసుకుంటారా.. ఆ ఎమ్మెల్యేలకు ఊహించని ఝలక్ ఇవ్వబోతున్నారా..!?
******************************
Jagan Team 3.0 : వైఎస్ జగన్ కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు.. ఈసారి ఊహించని రీతిలో ట్విస్ట్‌లు ఉంటాయా..!?
******************************
Jagan Team 3.0 : ఏపీ కేబినెట్‌లో మళ్లీ మార్పులు.. ఆ ఇద్దరు మాజీ మంత్రులను తీసుకునే యోచనలో వైఎస్ జగన్..!
*****************************
Updated Date - 2023-04-03T18:31:55+05:30 IST