AP Politics : ఐదుగురు మంత్రులకు వైఎస్ జగన్ హ్యాండిస్తున్నారా.. వైసీపీలో వణుకు..!?
ABN, First Publish Date - 2023-09-30T16:34:44+05:30
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్నాయ్.. ప్రతిపక్ష పార్టీలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy).. ఇప్పుడు సొంత పార్టీ నేతలనే పక్కనెట్టే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది...
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్నాయ్.. ప్రతిపక్ష పార్టీలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy).. ఇప్పుడు సొంత పార్టీ నేతలనే పక్కనెట్టే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది. ప్రస్తుతం తన కేబినెట్‌లో ఉన్న ఐదుగురు మంత్రులకు టికెట్లు ఇచ్చే ఆలోచన ముఖ్యమంత్రి లేదట. వీరిలో కొందరు తమకు టికెట్లు వద్దని చెప్పగా.. మరికొందరు ఎంపీలుగా పోటీచేయడానికి రంగం సిద్ధంగా ఉన్నారట. ఇంతకీ ఆ మంత్రులు ఎవరు..? ఏయే జిల్లాలకు చెందిన వారు..? అధికార పార్టీ ఎందుకీ నిర్ణయం తీసుకుంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
వైసీపీలో ఏం జరుగుతోంది..?
‘వై నాట్ 175’.. (Why Not 175) ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుస్తోంది. క్షేత్రస్థాయిలో వైసీపీకి సానుకూల సంకేతాలు చాలా బాగున్నాయి.. అందరూ నావాళ్లే.. ఒకవేళ ఈసారి టికెట్ రాకపోయినా వేరే పదవులు ఇస్తాను.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.. ఇవీ వైఎస్ జగన్ రెడ్డి పదే పదే చెబుతుండే మాటలు. ఇటీవల కేబినెట్ భేటీలోనూ ఇవే మాటలు జగన్ నోటి నుంచి వచ్చాయి. ఇప్పటికే కేబినెట్ భేటీలో కొందరు సిట్టింగులకు టికెట్లు ఇవ్వలేనని తేల్చిచెప్పేసిన జగన్.. తాజాగా మరో ఐదుగురు మంత్రులకు హ్యాండివ్వబోతున్నారని టాక్ నడుస్తున్నది. ఆ ఐదుగురిలో ఇద్దరు సీనియర్ మంత్రులను తెలియవచ్చింది. ఆ ఇద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన వారేనట. మరో ముగ్గురు జూనియర్ మంత్రులు ఉన్నారట. అయితే ఈ ఐదుగురిలో ఒకరిద్దరు తమకు ఈసారి టికెట్లు అక్కర్లేదని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరగా.. మరికొందరేమో తాము పెద్దల సభ రాజ్యసభకు వెళ్తామని జగన్‌కు తమ మనసులో మాటను బయటపెట్టారట.
ఇంతకీ ఎవరా మంత్రులు.. ఎమ్మెల్యేలు..!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సీనియర్ మంత్రులు ధర్మాన ప్రసాద్, బొత్స సత్యనారాయణ ఇద్దరూ తమకు ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీచేస్తే ఆసక్తి లేదని చెప్పినట్లు తెలియవచ్చింది. తన కుమారుడికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. తనను రాజ్యసభకు పంపాలని జగన్‌ను కోరారట ధర్మాన. ఇక బొత్స కూడా తన సతీమణి బొత్స ఝాన్సికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని జగన్ కోరగా.. ఇంతవరకూ ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదట. ఇక మిగిలిన ముగ్గురు జూనియర్ మంత్రుల్లో ఇద్దరు కోస్తా జిల్లాలకు చెందిన మహిళా మంత్రులు ఉన్నట్లు సమాచారం. ఇంకొకరు రాయలసీమకు చెందిన రెండోసారి మంత్రి పదవి పొందిన ఒకరు ఉన్నారని తెలిసింది. అయితే.. వీరిలో ముగ్గుర్ని రాజ్యసభకు.. మరో ఇద్దరికి టికెట్లు ఇవ్వలేనని జగన్ తేల్చిచెప్పేశారట. టికెట్లు ఇవ్వని నేతలకు మాత్రం ప్రాధాన్యతతో కూడిన పదవులు ఇస్తానని జగన్ మాటిచ్చారట. ఒకరిద్దరు ఎంపీలు సైతం ఎమ్మెల్యేలుగా పోటీచేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరోవైపు సీనియర్ మంత్రులకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక ఎమ్మెల్యేలు అయిన తమ పరిస్థితి ఏంటని వైసీపీలో వణుకు మొదలైందట. వైసీపీ అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించేసరికి ఇంకా జగన్ ఎన్నెన్ని పాలిట్రిక్స్ ప్లే చేస్తారో వేచి చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
CBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి హరీష్ ఆసక్తికర కామెంట్స్
YSRTP : వైఎస్సార్టీపీ విలీనంపై డైలామాలో షర్మిల.. సాయంత్రం ఏం ప్రకటన చేయబోతున్నారు..!?
TS Politics : పొంగులేటి ‘పాలేరు’ నుంచి పోటీచేస్తే తుమ్మల పరిస్థితేంటి.. ఖమ్మం కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..!?
Updated Date - 2023-09-30T16:38:59+05:30 IST