ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam: కవితతో ముడిపడిన ఈ కేసు ఈడీకే ఎందుకెళ్లిందంటే...

ABN, First Publish Date - 2023-03-11T20:18:41+05:30

ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ప్రశ్నిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా కవితను సుదీర్ఘంగా విచారిస్తోంది. ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవితను ఆరు గంటలు దాటినా ఇంకా విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ విస్తృతాధికారాలపై మరోమారు చర్చ తెరపైకి వచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ(ED), సీబీఐ(CBI) తమ పరిధి దాటుతున్నాయన్న విమర్శలు చాలా కాలంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ, సీబీఐకి ఉన్న అధికారాలేంటో చూద్దాం.

సీబీఐ పరిధిలోకి వచ్చే కేసులివే..

ఉగ్రవాదం, బాంబు పేలుళ్లు, కిడ్నాప్‌లు, మాఫియా, అండర్ వరల్డ్ నేరాలు వంటివి సీబీఐ పరిధిలోకి వస్తాయి. ఆయా రాష్ట్రాలోని కేసుల తీవ్రతను బట్టి కొన్ని కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు సీబీఐకి అప్పగిస్తాయి. ఆర్థిక నేరాల విషయానికి వస్తే ఆర్థిక కుంభకోణాలు, ఆర్థిక నేరాలు, దొంగనోట్ల తయారీ, బ్యాంకు మోసాలు, సైబర్ నేరాలు, ఔషధాల రవాణా, పురాతన వస్తువుల అక్ర రవాణా, సంస్కృతిక ఆస్తులు, నిషిద్ధ వస్తువులు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అవకతకలు వంటి కేసులను సీబీఐ విచారిస్తుంది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులపై నమోదైన అవినీతి కేసులతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగే నేరాలను సీబీఐ సుమోటోగా తీసుకుని విచారిస్తుంది.

ఈడీ పరిధిలోకి వచ్చే కేసులు..

ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ హైకోర్టు చెప్పిన దాని ప్రకారం మనీలాండరింగ్ కేసులను మాత్రమే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారించగలదు. ఆర్థిక నేరానికి ఆవల మరే కేసులను ఈడీ విచారించజాలదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మద్యం కేసు(Delhi Liquor Case) ఆర్థిక అవకతవకలకు సంబంధించినది కావడంతోనే అటు సీబీఐ, ఇటు ఈడీ రెండు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ఇదే కేసులో కవితను ఈడీ విచారిస్తోంది.

చర్చకు దారితీసిన ఈడీ విస్తృతాధికారాలు

మనీలాండరింగ్ కేసుల్లో ఈసీ విస్తృతాధికారాలపై చాలా చర్చ జరిగింది. ఈడీ అధికారాలపై సమీక్ష చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను అప్పట్లో సుప్రీంకోర్టు కొట్టవేసింది. తీవ్రమైన ఆర్థిక నేరాల విషయంలో ఈడీకి విస్తృతాధికారాలు ఉండడంలో తప్పులేదని తేల్చి చెప్పింది. ఆ తర్వాత నెల రోజులకే ఇదే వ్యవహారంపై దాఖలైన మరో పిటిషన్‌‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం.. ఈడీ విస్తృతాధికారాలపై సమీక్ష జరగాల్సిందేనని అభిప్రాయపడింది.

Updated Date - 2023-03-11T20:18:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising