Delhi Ordinance Bill : ఢిల్లీ సర్వీసుల బిల్లు విషయంలో బీఆర్ఎస్, వైసీపీ పార్టీలు ఏ పక్షానికి ఓటేశాయంటే..!?
ABN, First Publish Date - 2023-08-07T23:12:27+05:30
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు (Delhi Ordinance Bill) లోక్‌సభ (Loksabha), రాజ్యసభలో (Rajyasabha) ఆమోదం లభించింది. ఇక మిగిలిందల్లా రాష్ట్రపతి ఆమోదం మాత్రమే. రాష్ట్రపతి ఆమోదిస్తే ఆర్డినెన్స్ బిల్లు చట్టం కానుంది. త్వరలోనే ఈ బిల్లును రాష్ట్రపతికి కేంద్రం పంపనుంది. ఇంతవరకూ అంతా ఓకేగానీ తెలుగు రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ పక్షానికి ఓటేశాయి..?
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు (Delhi Ordinance Bill) లోక్‌సభ (Loksabha), రాజ్యసభలో (Rajyasabha) ఆమోదం లభించింది. ఇక మిగిలిందల్లా రాష్ట్రపతి ఆమోదం మాత్రమే. రాష్ట్రపతి ఆమోదిస్తే ఆర్డినెన్స్ బిల్లు చట్టం కానుంది. త్వరలోనే ఈ బిల్లును రాష్ట్రపతికి కేంద్రం పంపనుంది. ఇంతవరకూ అంతా ఓకేగానీ తెలుగు రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ పక్షానికి ఓటేశాయి..? వైసీపీ (YSRCP), బీఆర్ఎస్ (BRS), టీడీపీ (TDP) ఎంపీలు ఎటువైపు అడుగులేశారు..? అనే విషయం తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు జనాలు గూగుల్‌లో వెతికి మరి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల పార్టీలు ఇలా..!?
ఆర్డినెన్స్ బిల్లును రాజ్యసభలో మొదట మూజువాణి పద్ధతిలో సభ్యులు ఆమోదం తెలిపాయి. అయితే.. డివిజన్‌కు విపక్షం పట్టుబట్టడంతో రెండోసారి ఓటింగ్ జరపాల్సి వచ్చింది. సాంకేతిక సమస్యతో స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ ఓటింగ్‌లో ఎన్డీఏకు ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు మద్దతిచ్చాయి. అయితే.. బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష ఇండియా కూటమికి ఓటేశారు. అయితే.. ఆ కూటమికి ఎందుకు ఓటేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఎంపీ కేశవరావు (MP Kesavarao) మీడియాకు వెల్లడించారు. ‘ అవును.. మేం ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశాం. బిల్లు వ్యతిరేకించినంత మాత్రాన మేము ఇండియా కూటమిలో భాగం కాదు. ఈ బిల్లు అప్రజాస్వామికం, దేశాన్ని నాశనం చేస్తుంది. రాష్ట్రాల అధికారాలను అధిగమిస్తుంది. ప్రజలచే ఎన్నుకొబడినవారికి స్థానం లేకుండా చేసేలా బిల్లు ఉంది అందుకే వ్యతిరేకించాం. స్వల్ప మెజారిటీతో బిల్లు పాస్ అయింది. 102 మంది వ్యతిరేకంగా,131 మంది అనుకూలంగా ఓటు వేశారు’ అని కేశవరావు చెప్పుకొచ్చారు.
ఆ రెండూ ఒక్కటే..!
అయితే.. రాజ్యసభలో బీఆర్ఎస్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఢిల్లీ లిక్కర్ కుంభకుణంలో ఆప్‌తో బీఆర్ఎస్ కుమ్మక్కైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత నేత కేశవరావు తమకు ఏ పార్టీతో సంభందం లేదని అంటారు కానీ.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇద్దరూ ఒక్కటయ్యారని దుయ్య బట్టారు. ఢిల్లీలో ఎలాంటి అవినీతికి తావులేని పాలన (Corruption-free administraion) అందివ్వడం, అవినీతిపై పోరాటమే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2023 ముఖ్య ఉద్దేశమని అమిత్‌షా అన్నారు. గతవారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును ఆయన సోమవారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ జరిగింది. పలువురు అధికార, విపక్ష పార్టీల నేతలు బిల్లుపై చర్చించారు. అనంతరం బిల్లుపై జరిగిన చర్చకు అమిత్‌షా సమాధానమిస్తూ, సుప్రీంకోర్టు ఉత్తర్వులను బిల్లు ఉల్లంఘించలేదని చెప్పారు. ఢిల్లీలో పోస్టింగుల బదిలీల విషయంలో గతంలో ఎలాంటి గొడవులు లేవనని, ముఖ్యమంత్రులతో ఎలాంటి సమస్యలు ఉండేవి కావని అమిత్‌షా అన్నారు. 2015లో ఒక ఆందోళన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కేంద్రం తమ హక్కులను లాక్కోవాలని చూస్తోందంటూ కొందరు మాట్లాడారని అన్నారు. అయితే ఆవిధంగా చేయాల్సిన పని కేంద్రానికి లేదని, దేశ ప్రజలు తమకు అధికారం, హక్కు ఇచ్చారని చెప్పారు.
Punganuru Incident : చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి నిజ స్వరూపం ఇదీ.. ఈ యువకుడి మాటలు ఒక్కసారి విన్నారో..!
Updated Date - 2023-08-07T23:13:11+05:30 IST