Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణ కీలక దశలో ఉండగా.. డైరెక్టర్ ఆర్జీవీ పెను సంచలనం..
ABN, First Publish Date - 2023-04-24T22:42:28+05:30
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య (YS Viveka Murder Case) కేసు విచారణ కీలక దశలో ఉంది. అతి త్వరలోనే కేసులో సూత్రదారులెవరు..? పాత్రదారులెవరు..?...
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య (YS Viveka Murder Case) కేసు విచారణ కీలక దశలో ఉంది. అతి త్వరలోనే కేసులో సూత్రదారులెవరు..? పాత్రదారులెవరు..? అని తేల్చేయాలని సీబీఐ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు.. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం.. అసలు బెయిల్ వద్దే వద్దని ఇటు వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి (YS Sunitha Reddy) సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఇటు కడప జిల్లాలోని పులివెందులకు వెళ్లిన సీబీఐ బృందం.. వివేకా హత్య జరిగిన బెడ్రూమ్, బాత్రూమ్‌లో.. అవినాష్ రెడ్డి ఇంట్లోనూ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసింది. మరీ ముఖ్యంగా అవినాష్‌ను మూడ్రోజులు.. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్‌ను ఆరు రోజులు.. సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డిని, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మను కూడా సీబీఐ విచారించింది. ఇలా సీరియస్‌గా వివేకా కేసు విచారణ జరుగుతున్న సమయంలో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ (Tollywood Director Ram Gopal Varma) వర్మ సంచలనానికి తెరలేపారు. ఇంతకీ ఆర్జీవీ ఏం చేయదలుచుకున్నారు..? అసలు వివేకా హత్య కేసులో ఆయన ఎందుకు తలదూర్చారు..? అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.
ఆర్జీవీ ఫేస్‌బుక్ పోస్ట్ యథావిధిగా..
‘అబద్ధం బతికేదే నిజాన్ని చంపటం కోసం ప్రయత్నించటానికి .నిజాన్ని ఎవ్వరూ చంపలేరు.కానీ నిజం అప్పుడప్పుడూ చచ్చిపోయినట్టు నటిస్తుంది. .. దానికి మోసపోయి,అబద్ధాలు చెప్పే వాళ్ళు సంబరం తో డాన్స్ లాడుతూండగా ఏదో ఒక రోజు వెనక నుంచి ముందు పోటు పొడుస్తుంది. నిజాన్ని చేధించడానికి ఒకే ఒక్క సాధనం లాజికల్ థింకింగ్. అనాలిసిస్ ద్వారా, టెక్నాలజీ ద్వారా.. సర్కమ్ స్టాన్సేస్ ద్వారా అన్నింటికన్నా ముఖ్యంగా మోటివ్ మీద కాన్సంట్రేట్ చేయడం ద్వారా నిజాన్ని అబద్ధం నుంచి కాపాడవచ్చు. నిజంఛానల్ లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా కొన్ని కరెంట్ సిట్యుయేషన్స్, సైన్స్, హిస్టరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెక్స్ , ఫిలాసఫీ, పోలీస్, క్రైం, న్యాయ స్థానాలు,ఇంకా ఎన్నెన్నో టాపిక్స్ ఉంటాయి. నిజం గురించి ప్రతి ఎపిసోడ్‌లో నేనే కాకుండా నిపుణులు వేరే వేరే టాపిక్స్ అనలైజ్ చేస్తారు. కొన్నిసార్లు నేను వాళ్ళతో, కొన్నిసార్లు స్వప్నగారు వాళ్ళతో, కొన్నిసార్లు వేరేవాళ్ళు ఎవరెవరితోనో.. అలా నిజాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ నిజం ఛానల్ గొడుగు కింద కేటాయించిన ప్రత్యేక చోటుంటుంది. వివేకా మర్డర్ వెనక నిజంలోని అబద్ధాలు, ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనుక వేరే వాళ్ళు ప్రభోదిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పైవాళ్లు అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు, వాటన్నింటి వెనుక నిజాలన్నింటినీ తవ్వి తీయడమే నిజం ఛానల్ ముఖ్య ఉద్దేశం. వివేకా హత్య వెనక నిజంలో అబద్దముందా ? అనే ఎపిసోడ్ రిలీజ్ 25 న సాయంత్రం 4 గంటలకు ఇట్లు నిజంగా రామ్ గోపాల్ వర్మ’ అని ఆర్జీవీ తన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
నవ్వు ఆపుకోలేని రీతిలో సెటైర్లు..!
బోలెడంత టాలెంట్‌తోపాటు అదే స్థాయిలో వివాదాలూ మూటగట్టుకున్న ఆర్జీవీ.. వివేకా కేసులో ఏమేం నిజాలు చెబుతారో.. ఆయన నోటి నుంచి ఎలాంటి మాటలొస్తాయో అని అభిమానులు, జనాలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆర్జీవీ పోస్ట్‌పై ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో ఓ రేంజ్‌లో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే మీమ్స్ పోస్ట్ చేస్తూ ఇట్లుంటది మరి ఆర్జీవీతో అని ఆయన్ను ప్రశంసిస్తున్నారు కూడా. మరికొందరైతే నవ్వు ఆపుకోలేని రీతిలో సెటైర్లు కురిపిస్తున్నారు. ఇంకొందరైతే సీరియస్ వ్యవహారంలో వచ్చాడండి ఆర్జీవీ.. అంటూ సినిమా డైలాగ్స్ పేలుస్తు్న్నారు. ఇప్పటి వరకూ ఓకే మంగళవారం నాడు వీడియోను రిలీజ్ చేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
KCR BRS Sabha : మరాఠా గడ్డ నుంచి మాటిస్తున్నా.. మొత్తం మార్చేస్తా.. కీలక హామీలిచ్చిన కేసీఆర్..
******************************
SC Verdict On YS Viveka Case : సుప్రీం తీర్పుతో వైఎస్ అవినాష్‌కు దారులన్నీ క్లోజ్.. హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ.. ఇదేగానీ జరిగితే..!
******************************
Viveka Murder Case : సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌కు చుక్కెదురు.. అరెస్ట్ విషయంలో సీబీఐకు లైన్ క్లియర్..
******************************
Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పురోగతి సాధించిన సీబీఐ.. సడన్‌గా ఇలా జరగడంతో...
******************************
Viveka Murder Case : సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. మరో కీలక పరిణామం.. ఈసారి ఏకంగా..
******************************
Updated Date - 2023-04-24T22:48:41+05:30 IST