Balineni Meets YS Jagan : గంటన్నరపాటు వైఎస్ జగన్‌తో బాలినేని భేటీ.. సుదీర్ఘ చర్చల తర్వాత ఫైనల్‌గా ఏం తేలిందంటే..
ABN, First Publish Date - 2023-06-01T20:09:31+05:30
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (AP CM YS Jagan Reddy) మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) భేటీ ముగిసింది. గురువారం సాయంత్రం 4.35 గంటల నుంచి 6.00 వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (AP CM YS Jagan Reddy) మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) భేటీ ముగిసింది. గురువారం సాయంత్రం 4.35 గంటల నుంచి 6.00 వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చించారు. సీఎంతో (Chief Minister) సుదీర్ఘ సమావేశం తర్వాత బాలినేని హ్యాపీగానే (Balineni Happy) ఫీలవుతూ బయటికొచ్చారు. క్యాంప్ ఆఫీస్ (AP CM Camp Office) బయట మీడియాతో నవ్వుతూనే బాలినేని మాట్లాడారు. ఇన్నాళ్లుగా అలిగిన బాలినేని జగన్ బుజ్జగింపులతో మెత్తబడ్డారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఇవాళ్టి భేటీతో బాలినేని ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు.
జగన్ మాటిచ్చారు..!
‘ జగన్‌గారితో భేటీలో అన్ని విషయాలపైన చర్చించాను. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేను ఎదుర్కొంటున్నా ఇబ్బందులపై కూడా సీఎంకు వివరించాను. ప్రోటోకాల్ అనేది పెద్ద విషయం కాదు. దాని మీద ఫిర్యాదు చేయడానికి ఏం ఉంటుంది?. కొత్తగా రీజినల్ కోఆర్డినేటర్ పదవి కూడా చర్చ జరగలేదు. గతంలోనే ఆ పదవి వద్దని రాజీనామా చేశాను. పదవినే వదులుకొని వచ్చాను.. ప్రోటోకాల్ గురించి నేను ఫీలవుతానా..?. ఒంగోలు నియోజకవర్గంపై దృష్టి పెట్టమని సీఎం సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సీఎం సానుకూలంగా స్పందించారు. నేను పార్టీ మార్పు అనేది ప్రచారం మాత్రమే. అలక అనేది లేదు.. పార్టీలో నన్ను కొంత మంది ఇబ్బంది పెట్టారు. పార్టీలో నన్ను ఇబ్బంది వారిపై ఫైట్ చేశాను. పార్టీలో విభేదాలను పరిష్కరిస్తానని సీఎం చెప్పారు’ అని బాలినేని మీడియాకు వెల్లడించారు.
ఇన్ని భేటీల తర్వాత..!
కాగా.. ఇప్పటికే పలుమార్లు జగన్‌తో బాలినేని నేరుగా వెళ్లి భేటీ అయినప్పటికీ ఒక్కసారీ సక్సెస్ కాలేదు. గురువారం జరిగిన భేటీ విజయవంతమైంది. బుధవారం నాడు సీఎంవో (AP CMO) నుంచి బాలినేనికి ఫోన్ కాల్ వెళ్లింది. గురువారం సాయంత్రం 4 గంటలకు క్యాంప్ ఆఫీసుకు రావాలని.. వైఎస్ జగన్ ప్రత్యేకంగా మాట్లాడతారన్నది ఆ ఫోన్ కాల్ సందేశం. రీజనల్ కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఒంగోలు నియోజకవర్గానికి మాత్రమే బాలినేని పరిమితం కావడం, పార్టీలో తీవ్ర అసంతృప్తిగా ఉండటం, వైసీపీకి గుడ్ బై చెప్పేసి వేరే పార్టీలో చేరతారని వార్తలు రావడం ఇలా బాలినేని ఎక్కడ చూసినా హాట్ టాపిక్ అవుతుండటంతో స్వయంగా జగనే రంగంలోకి దిగి సీఎంవోకు పిలిపించి మాట్లాడగా.. ఆ చర్చలు సక్సెస్ అయ్యాయని తాజా పరిస్థితిని బట్టి చూస్తే అర్థమవుతోంది.
Balineni Row : బాలినేనికి సీఎం వైఎస్ జగన్ బుజ్జగింపులు.. ఈసారైనా తేల్చేస్తారా.. లేకుంటే..!
Updated Date - 2023-06-01T20:21:16+05:30 IST