ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ghanpur: BRS ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య వర్గపోరు.. అధిష్టానం వైఖరే కారణమని చర్చ..!

ABN, First Publish Date - 2023-03-29T09:16:45+05:30

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు రోజురోజుకు హీట్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆ నియోజవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్‌ ఎమ్మెల్సీగా మారిందా? ఒకరిపై ఒకరు పోటీ పడి మరి విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారా? ఆ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య పోరుకు అధిష్టానం కూడా ఓ కారణమా? ఇంతకీ నియోజకవర్గం ఏంటి.? ఆ ఇద్దరు నేతలెవరు? అసలు వారిద్దరి మధ్య జరుగుతుందేంటి? అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు రోజురోజుకు హీట్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. అదే నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య.. వర్గపోరు కంటిన్యూ అవుతోంది. తాజాగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. వారిద్దరి మధ్య పోరుకు అధిష్టానం వైఖరే కారణమన్న చర్చ జరుగుతోంది.

తనను కావాలనే ఇరికించారన్న ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన సర్పంచ్ నవ్య.. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని మధ్య వర్తిగా దించగా...సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య మధ్య ఆయన రాజీ కుదిర్చారు. దీంతో సర్పంచ్ నవ్య ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే రాజయ్య...నవ్యకు సారీ చెప్పారు. జరిగిన ఘటన విచారకరమని మీడియా ముఖంగా ప్రకటించారు. నవ్య కూడా ఎమ్మెల్యే చెప్పిన సారీని స్వీకరించారు.

తానేప్పుడూ తప్పు చేయను..ఎవరికీ సారీ చెప్పబోను?

ఇంతటితో స్టేషన్ ఘనపూర్ గ్రూపు రాజకీయాలకు తెరపడినట్టేనని అంతా భావించారు. కానీ ఇటీవలే నియోజకవర్గంలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య.. తనను లైంగిక వేధింపుల కేసులో కావాలనే ఇరికించారని.. సొంత పార్టీ నేతలే కుట్రలు చేశారని బోరున విలపించారు. అయితే.. నియోజకవర్గానికి చెందిన కడియం శ్రీహరిని ఉద్దేశించే రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరిగింది. దీంతో ఒక్కసారిగా స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు వేడెక్కాయి. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.. ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించి ఘాటైనా వ్యాఖ్యలు చేశారు. తానేప్పుడూ తప్పుచేయనని.. ఎవరికీ సారీ చెప్పబోనని ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించి అన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే నియోజకవర్గంలో నీటిపైనా, రిజర్వాయర్లపైనా అవగాహన లేని నేతలు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి ఘాటైనా వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి చేసిన ఈ వ్యాఖ్యలు నియోజకవర్గంలో మరోసారి చర్చకు దారి తీశాయి.

ఒక్క స్టేషన్‌ ఘనపూర్‌పైనే కడియం శ్రీహరి ఫోకస్‌?

అలాగే కడియం శ్రీహరి తీరుపై నియోజకవర్గంలో విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండగా ఎమ్మెల్సీ ఆధిపత్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో లేని పరిస్థితి స్టేషన్ ఘనపూర్‌లోనే ఎందుకన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. మిగిలిన నియోజకవర్గాల్లో...ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్సీలు ఉన్నా...ఆయా నియోజకవర్గాల రాజకీయాల్లో ఎవరూ జోక్యం చేసుకోరు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనా కడియం శ్రీహరి ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం పైనే ఫోకస్ పెట్టి.. ఎమ్మెల్యే రాజయ్యను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో అధిష్టానం తీరును కూడా తప్పుపడుతున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సుపీరియర్ అని చెప్పిన సీఎం కేసీఆర్...స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య వర్గపోరుకు అధిష్టానమే ఆజ్యం పోస్తోందన్న చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-03-29T09:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising