ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Politics: ఏపీలో ఒక్కసారిగా మారిపోయిన రాజకీయ వాతావరణం.. స్వయంగా రంగంలోకి సీఎం జగన్.. ఏం జరుగుతోంది

ABN, First Publish Date - 2023-06-12T14:45:07+05:30

బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలు ఇద్దరూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంపై సీఎం జగన్ తానే స్వయంగా స్పందించారు. అయితే నేరుగా కౌంటర్లు ఇచ్చే ధైర్యం చేయక కవరింగ్ చేసుకున్నారు. పల్నాడు జిల్లా క్రోసూరులో నాలుగో విడత ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం మాట్లాడుతూ... బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ ట్రాప్‌లో పడిందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ (AP Politics) సమీకరణాలు మారిపోతున్నాయా?. అధికారపక్షం వైసీపీకి (YCP govt) ఊహించని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయా?. బీజేపీ (BJP) అగ్రనేతలు అమిత్ షా (Amith shah), జేపీ నడ్డాలు (JP nadda) ఒక్కసారిగా జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శల దాడి దేనికి సంకేతం?. కమలనాథుల సడెన్ ఎటాక్‌తో వైసీపీ నాయకత్వం ఉలిక్కపడిందా?. ఇంతకాలంగా జగన్ ప్రభుత్వానికి అండదండలు అందిస్తున్న నరేంద్ర మోదీ సర్కారు వైఖరి మారుతోందా?. కాషాయదళం విమర్శలపై స్వయంగా తానే స్పందించడం ద్వారా సీఎం జగన్ ఏం చెప్పదలుచుకున్నారు?. జేపీ నడ్డా, అమిత్ షాల ఘాటైన విమర్శలు- వాటికి వైసీపీ కౌంటర్ల వేళ ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరి ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా ఈ పరిణామంపై ఒక లుక్కేద్దాం...

నోరెత్తకుండా కవరింగ్..

బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలు ఇద్దరూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంపై సీఎం జగన్ తానే స్వయంగా స్పందించారు. అయితే నేరుగా కౌంటర్లు ఇచ్చే ధైర్యం చేయక కవరింగ్ చేసుకున్నారు. పల్నాడు జిల్లా క్రోసూరులో నాలుగో విడత ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం మాట్లాడుతూ... బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ ట్రాప్‌లో పడిందన్నారు. పసుపు కండువా మార్చి కాషాయ చొక్కాలు వేసుకున్న వాళ్లు చెప్పిన మాటలను అమిత్ షా పలకడం దారుణమని వాపోయారు. చిత్తశుద్ధితో నడుస్తున్న ప్రభుత్వంపై అమిత్ షా నిందలు వేశారని జగన్ నిట్టూర్చారు. అయితే వైసీపీ మంత్రులు, ముఖ్యనేతలు డైరెక్ట్‌గానే బీజేపీకి కౌంటర్లు ఇస్తున్నా జగన్ మాత్రం రక్షణాత్మకంగా మాట్లాడారు. అమిత్ షా, జేపీ నడ్డాల విమర్శలపై నొరెత్తకుండా జాగ్రత్తగా మాట్లాడారు. జగన్ మాట్లాడిన తీరుని చూస్తే బీజేపీకి కౌంటర్లు ఇచ్చే ధైర్యం చేయలేకపోయారని ఇట్టే అర్థమవుతోంది. స్వయంగా తన సారధ్యంలోని ప్రభుత్వంపై అవినీతి విమర్శలు వచ్చినా కౌంటర్లు ఇవ్వకపోవడం ఏంటనేది హాట్ టాపిక్‌గా మారింది.

వైసీపీకి దూరం జరుగుతున్న బీజేపీ !

సీఎం జగన్‌కు ఇంతకాలం ఏ కష్టమొచ్చినా కేంద్రంలోని బీజేపీ సర్కార్ అండగా నిలుస్తూ వచ్చింది. విచ్చల విడిగా రుణాల మంజూరు నుంచి కేసుల వ్యవహారాల వరకు వైసీపీ ప్రభుత్వాన్ని మోదీ సర్కారు కాపాడుతోందనే భావన సర్వత్రా నెలకొంది. అనేక పరిణామాలు కూడా ఇందుకు బలం చేకూర్చాయి. అయితే రెండు మూడు రోజుల్లో ఒక్కసారిగా సీన్ మారిపోయినట్టు కనిపిస్తోంది. ఒక్కసారిగా జగన్ పాలనపై బీజేపీ ఘాటైన విమర్శల దాడి మొదలుపెట్టింది. శనివారం శ్రీకాళహస్తిలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఆదివారం జరిగిన ‘విశాఖ బహిరంగ సభ’లో అమిత్ షా.. ఇద్దరూ వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని ముప్పేట దాడి చేశారు. అమిత్ షా అయితే ఏకంగా జగన్ సిగ్గుపడాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఏపీ బీజేపీ నాయకత్వం వైసీపీపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పటికీ వాటిని ఎవరూ పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. కానీ పార్టీ అగ్రనేతలే ఇప్పుడు వైసీపీపై ఎటాక్ చేయడంతో వైసీపీ కూడా ఉలిక్కిపాటుకు గురైనట్టు కనిపిస్తోంది. అవినీతిమయ ప్రభుత్వమని బీజేపీ విమర్శించడం కలవరపాటుకు గురవుతున్నట్టు కనిపిస్తోంది.

ఈ పరిణామాన్ని చూస్తే వైసీపీకి బీజేపీ దూరమవుతోందా? గతంలో మాదిరిగా ఇకపై కేంద్రం అండదండలు ఉండవా? అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఉన్నపలంగా వైసీపీ-బీజేపీ మధ్య ఈ పరిస్థితికి కారణం ఏంటి? రెండు పార్టీల మధ్య ఎక్కడ చెడింది?. అవినాశ్ కేసు ప్రభావం ఏమైనా ఉందా?. లేక వైసీపీకి రాష్ట్రంలో పడిపోతున్నా గ్రాఫ్ కారణమా? అనే ఆసక్తికర విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. దీనికితోడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈమధ్య ఢిల్లీలో పర్యటించారు. అమిత్ షా, జేడీ నడ్డాలను కలిసి వచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకే వీరిద్దరూ ఏపీలో సమావేశాలు ఏర్పాటు చేసి వైసీపీపై దాడి చేయడం ఈ రాజకీయ చర్చలకు బలం చేకూర్చుతోంది. మరి నిజంగానే వైసీపీకి బీజేపీ దూరం జరుగుతుందా లేదా అనేది వేచిచూడాలి.

Updated Date - 2023-06-12T14:45:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising